అమరావతి (చైతన్య రథం): ఎన్డీయే ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా ప్రకటించిన సిపి రాధాకృష్ణన్‌కు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అభినందనలు తెలిపారు. ఎన్డీయే తరపున ఉప రాష్ట్రపతి అభ్యర్థి ఎవరనే ఉత్కంఠకు తెరదించుతూ ఆదివారం ఢల్లీిలో సమావేశమైన భాజపా పార్లమెంటరీ పార్టీ బోర్డు కీలక నిర్ణయం తీసుకోవడం తెలిసిందే. ఎన్డీఏ ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా సీపీ రాధాకృష్ణన్ పేరును ఖరారు చేసినట్టు భాజపా జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ప్రకటించారు. ఈమేరకు రాధాకృష్ణన్‌కు అభినందనలు తెలిపిన సీఎం చంద్రబాబు ఎక్స్‌లో పోస్టు పెడుతూ.. ‘అనుభవ రాజనీతిజ్ఞుడు, గౌరవనీయ నాయకుడు, చాలాకాలంగా దేశానికి విశిష్ట సేవలందించిన రాధాకృష్ణన్ ఎంపిక గొప్ప విషయం. తెలుగుదేశం పార్టీ ఆయన నామినేషన్‌ను హృదయపూర్వకంగా స్వాగతిస్తోంది, పూర్తి మద్దతు అందిస్తోంది’ అని పేర్కొన్నారు.