అమరావతి (చైతన్యరథం): క్రీడాంధ్రప్రదేశ్ దిశగా మరో అడుగు పడిరదని విద్య, ఐటీశాఖల మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు. ఆంధ్ర ప్రీమియర్ లీగ్ (ఏపీఎల్) సీజన్ – 4… గ్రామీణ క్రీడాకారులకు మెరుగైన అవకాశాలు కల్పించే వేదికగా నిలిచిందన్నారు. విశాఖలో సోమవారం జరిగిన వేలంలో అమరావతి రాయల్స్ తరపున ఎంపికైన కోరుకొండ బుద్ధరాం దుర్గేష్ నాయుడికి అభినందనలు తెలిపారు. సింహాచలంలో నివసిస్తున్న నిరుపేద కుటుంబానికి చెందిన నాయుడు కెరీర్ లో 4సెంచరీలు, 6 అర్థ సెంచరీలు సాధించి క్రికెట్‌లో అత్యుత్తమ ప్రతిభ కనబర్చాడని ప్రశంసించారు. నాయుడు మరింత ఉన్నత స్థానాలకు చేరుకోవాలని మనస్పూర్తిగా ఆకాంక్షిస్తున్నానన్నారు.