అమరావతి (చైతన్య రథం): పర్యాటకంలో కొత్త గమ్యస్థానాలు సృష్టించాలనే ఆనంద్ మహీంద్రా దార్శనికతను అభినందిస్తున్నానని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. పర్యటకంపై ఆనంద్ మహీంద్రా పెట్టిన పోస్టుకు ప్రతిస్పందిస్తూ సీఎం చంద్రబాబు ఎక్స్‌లో పోస్టు పెట్టారు. ‘భవిష్యత్‌కు ఏకైక ‘ఇజం’ టూరిజం. ఇది ప్రజలను ఒకచోటకు చేర్చుతుంది. భిన్న సంస్కృతులను అనుసంధానిస్తుంది. సరికొత్త జీవనోపాధిని సృష్టిస్తుంది. లక్ష్యాలతో వృద్ధిని నడిపిస్తుంది. కొత్త గమ్యస్థానాలను సృష్టించాలనే మీ దార్శనికతను నేను అభినందిస్తున్నాను. ఆంధ్రప్రదేశ్‌లో దిండివంటి అనేక మరుగునపడిన రత్నాలు ఆవిష్కరణకు వేచి ఉన్నాయి. ఆధ్యాత్మిక వారసత్వం నుండి సుందరమైన ప్రదేశాల వరకు, ఆంధ్ర రాష్ట్రం ప్రతి పర్యాటక ప్రయాణికుడికీ అనుభవాల నిధి అందిస్తుంది. ప్రపంచాన్ని ఆంధ్రప్రదేశ్‌కు స్వాగతించడంలో మాతో భాగస్వామ్యం కావాలని నేను మిమ్మల్ని, పర్యాటక ఆతిథ్య ప్రతినిధులను ఆహ్వానిస్తున్నాను’ అని పేర్కొన్నారు.