- సీసీ రోడ్ల బిల్లులు మెక్కిన పార్టీ నాయకులు
- దళితులకు ఇచ్చిన స్థలాన్ని కబ్జా చేసి దౌర్జన్యం
- భూమి లీజుకు తీసుకుని ఆక్రమణకు యత్నం
- ప్రజావినతుల కార్యక్రమంలో బాధితుల గోడు
మంగళగిరి(చైతన్యరథం): వైసీపీ నేతల అక్రమాలు, భూ కబ్జాలపై ఫిర్యాదులు వెల్లువెత్తున్నాయి. టీడీపీ కేంద్ర కార్యాలయంలో మంగళవారం నిర్వహించిన ప్రజా వినతుల కార్యక్రమంలో నేతలకు అర్జీలు ఇచ్చి గోడు వెళ్లబోసుకున్నారు. 2017-2018 సంవత్సరంలో చినిగేపల్లిలో తాను సిమెంట్ రోడ్ల పనులు చేయగా వచ్చిన బిల్లులను వైసీపీ నేతలు కొట్టేశారని తిరుపతి జిల్లా చిన్నగొట్టుగల్లు మండలం జం గావాండ్లపల్లె గ్రామ పంచాయతీకి చెందిన బి.ప్రతాప్‌రెడ్డి ఫిర్యాదు చేశారు. వారిపై చర్యలు తీసుకుని రావాల్సిన డబ్బులు ఇప్పించాలని విజ్ఞప్తి చేశాడు. శాసనమండలి మాజీ చైర్మన్, ప్రస్తుత ప్రభుత్వ సలహాదారు ఎం.ఎ.షరీఫ్, రాష్ట్ర వినియోగదారుల పరిరక్షణ మండలి చైర్పర్సన్ పీతల సుజాత, ట్రైకార్ చైర్మన్ బొరగం శ్రీనివాసులు అర్జీలు స్వీకరించారు.
` గత ప్రభుత్వంలో వైసీపీ పార్టీ నాయకులు దళితులమైన తమకు ప్రభుత్వం ఇచ్చిన స్థలాన్ని ఆక్రమించుకున్నారని పలువురు ఫిర్యాదు చేశారు. పోలీసు కేసు పెడితే వారిపై క్రిమినల్ కేసు నమోదు చేశారన్నారు. అయినప్పటికీ వైసీపీ నాయకు లు తమను బెదిరిస్తున్నారని, వారిపై కఠిన చర్యలు తీసుకు తమకు ప్రభుత్వం ఇచ్చిన స్థలంలో ఇళ్లు నిర్మించుకునేందుకు రక్షణ కల్పించాలని అభ్యర్థించారు.
` డిగ్రీ చదువుతున్న తన కుమారుడిని ఎవరో దారుణంగా కొట్టి చంపారని, దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేస్తే కేసును పక్కదారి పట్టించేందుకు యాక్సిడెంట్లో చనిపోయాడని చెబుతున్నారని అనకాపల్లి జిల్లా చోడవరం మండలం చోడవరం రెల్లి వీధికి చెందిన సోమాదుల కృప అనే మహిళ ఆవేదన వ్యక్తం చేసింది. తన కుమారుడి చావుకు కారణమైన వారిని గుర్తించి కఠినంగా శిక్షించాలని కోరింది.
` చిత్తూరు జిల్లా పెనుమూరు మండలం పెద్ద రాజుపల్లికి చెందిన ప్రవీణ్ కుమార్ సమస్యను వివరిస్తూ తన భూమిని లీజుకు తీసుకున్న వైసీపీ నేతలు తప్పుడు పత్రాలు సృష్టించి భూమిని కొట్టేసేందుకు యత్నించారని ఫిర్యాదు చేశారు. పెను మూరు పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని, అధికారులు విచారించి న్యాయం చేయాలని విజ్ఞప్తిచేశారు.
` తన అనుభవంలో ఉండి తన పేరు మీద ఆన్లైన్ అయిన భూమిని కొట్టేసేందుకు గుంటూరుకు చెందిన లక్ష్మీ అనే మహిళ కుట్ర పన్నుతుందని ప్రకాశం జిల్లా చంద్రశేఖరపురం కోవిలంపాడు గ్రామానికి చెందిన నన్నెసాని గుంటెయ్య నేతల ఫిర్యాదు చేశాడు. ఆమె బంధువులతో వచ్చి దౌర్జన్యం చేస్తోందని, అధికారులు తమ భూమిని సర్వే చేసి పూర్తి హక్కులు కల్పించాలని కోరింది.
` ఉమ్మడి కృష్ణా జిల్లాతో పాటు రాష్ట్రంలోని అన్ని పాఠశాలల్లో ఉర్దూ ఉపాధ్యా య పోస్టుల భర్తీకి తగిన చర్యలు తీసుకోవాలని, డీఎస్సీ నోటిఫికేషన్ ద్వారా ఉర్దూ ఉపాధ్యాయ పోస్టులు కూడా భర్తీ చేయాలని పలువురు అభ్యర్థులు వినతిపత్రం అం దజేశారు. గత ప్రభుత్వం తమకు అన్యాయం చేసిందని.. కూటమి ప్రభుత్వం తమకు న్యాయం చేయాలని కోరారు.
` క్లాప్ ఆటోడ్రైవర్లు, సూపర్వైజర్ల నియామకం నిర్వహణను ఏజెన్సీ వ్యవస్థ నుంచి తప్పించి మున్సిపాలిటీ ఆఫీసు పరిధిలోకి తెచ్చి స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ నుంచి వేతనాలు చెల్లించాలని పలువురు అర్జీదారులు విజ్ఞప్తి చేశారు.
` గ్రామ పంచాయతీల్లో ట్యాంక్ వాచర్, ఎవెన్యూ వాచర్, గేట్ వాల్ ఆపరేటర్, ఎలక్ట్రీషియన్ ఇలా వివిధ రకాల పేర్లతో తాము 30 సంవత్సరాల నుంచి కాంట్రాక్టు సిబ్బందిగా చాలీచాలని జీతాలతో పనిచేస్తున్నామని, తమకు ఉద్యోగ భద్రత కల్పించి క్రమబద్ధీకరించాలని విజ్ఞప్తి చేశారు.