- ప్రజావినతుల కార్యక్రమానికి వినతులు
- అర్జీలు స్వీకరించిన నిమ్మల, పోలంరెడ్డి
మంగళగిరి(చైతన్యరథం): టీడీపీ కేంద్ర కార్యాలయంలో సోమవారం ప్రజావినతుల కార్యక్రమంలో మాజీ ఎంపీ నిమ్మల కిష్టప్ప, ఎన్విరాన్‌మెంట్ మేనేజ్‌మెంట్ కార్పొరేషన్ చైర్మన్ పోలంరెడ్డి దినేష్‌రెడ్డి అర్జీలు స్వీకరించారు. భూ కబ్జాలు, ఆక్రమణలు, ఆన్‌లైన్‌లో భూముల అక్రమ మార్పులు, ఉద్యోగాల పేరుతో మోసాలపై అర్జీదారులు వినతులు అందించి న్యాయం చేయాలని కోరారు.
` పాస్ పుస్తకాలు ఉండి రిజిస్ట్రేషన్ ఉన్న భూమిని గత ప్రభుత్వంలో రీ సర్వే పేరు తో 22ఏలో పెట్టారని దయచేసి దాన్ని సరిచేసి సమస్యను పరిష్కరించాలని గుంటూరు జిల్లా ప్రత్తిపాడు మండలం గనికపూడి గ్రామానికి చెందిన షేక్ అప్సాన విజ్ఞప్తి చేశారు.
` తమకు వారసత్వంగా వచ్చిన భూమికి వైసీపీకి చెందిన మణి అనే వ్యక్తి దొంగ డాక్యుమెంట్లు సృష్టించి కబ్జా చేసేందుకు కుట్ర చేస్తున్నాడని తిరుపతి జిల్లా చిట్టమూరు మండలం మల్లం గ్రామానికి చెందిన పర్రి కోటేశ్వరమ్మ ఫిర్యాదు చేసింది. విచారించి దొంగ డాక్యుమెంట్లను రద్దు చేయాలని విజ్ఞప్తి చేసింది.
` తమ స్థలాన్ని కబ్జాదారులు ఆక్రమించుకుని ఆవులను కట్టేయడమే కాకుండా తమను చంపుతామని బెదిరిస్తున్నారని శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురం మండలం శ్రీకంఠపురం గ్రామానికి చెందిన లక్ష్మీదేవి ఆవేదన వ్యక్తం చేసింది. తమ స్థలాన్ని కబ్జా చేసిన వ్యక్తుల నుంచి తమకు ప్రాణహాని ఉందని.. దయచేసి తమకు రక్షణ కల్పించి స్థలాన్ని కబ్జా నుంచి విడిపించాలని వేడుకున్నారు.
` మేకల లక్ష్మీపతి అనే వైసీపీ వ్యక్తి పూర్వం నుంచి తాము వెళుతున్న రహదారి ఆక్రమించి మూసి వేశాడని తూర్పుగోదావరి జిల్లా తోకాడ గ్రామానికి చెందిన పలువురు ఎస్సీ కాలనీకి చెందిన వ్యక్తులు ఫిర్యాదు చేశారు. తమకు దారి సమస్య ఏర్పడిర దని.. దయచేసి తమ సమస్యను పరిష్కరించాలని విజ్ఞప్తి చేశారు.
` రాజవరం గ్రామంలో తామ భూములను మరొకరి పేరు మీదకు అక్రమంగా మార్చారని తూర్పుగోదావరి జిల్లా కొవ్వూరు మండలం వాడపల్లికి చెందిన గోలి రాధ ఫిర్యాదు చేశారు. ఆ భూములకు సంబంధించిన అన్ని ఆధారాలు తమ వద్ద ఉన్నాయ ని..వాటిని పరిశీలించి న్యాయం చేయాలని విన్నవించారు.
` చిలకలూరిపేటకు చెందిన బత్తుల శ్రీ గణేష్ అనే వ్యక్తి ఉద్యోగాలు ఇప్పిస్తానని చెప్పి నలుగురి వద్ద రూ.35 లక్షలు తీసుకుని మోసం చేశాడని ప్రకాశం జిల్లా తుళ్లూరు మండలం తురకపాలెం గ్రామానికి చెందిన చంద్రగిరి శ్రీనిసువాసులరెడ్డి తెలిపారు. అతనిపై చర్యలు తీసుకుని తమ డబ్బులు తిరిగి ఇప్పించాలని కోరారు.
` తూర్పుగోదావరి జిల్లా సీతానగరం మండలం రఘుదేవపురం గ్రామంలో పంచా యతీ నిధులు దుర్వినియోగం చేశారని జానకీరామయ్య అనే వ్యక్తి ఫిర్యాదు చేశారు. దాదాపు రూ.2 కోట్ల వరకు స్వాహా చేశారని..విచారించి బాధ్యులపై చర్యలు తీసు కోవాలని కోరారు.
` 1947 నుంచి రిజిస్ట్రర్ అయ్యి లింక్ డాక్యుమెంట్లు ఉన్న తమ స్వాధీనంలోని భూమిని ఆన్‌లైన్ చేయమంటే పట్టించుకోవడం లేదని ఎన్టీఆర్ జిల్లా జి.కొండూరు మం డలం వెల్లటూరు గ్రామానికి చెందిన ఎలుబండి శ్రీనివాసరావు ఫిర్యాదు చేశారు.
` రాష్ట్రవ్యాప్తంగా అంబేద్కర్ గురుకులాల్లో పనిచేస్తున్న హౌస్ కీపింగ్ వర్కర్లు, సెక్యూరిటీ గార్డులను తొలగిస్తున్నట్లు ప్రచారం జరుగుతుందని, తమను యధావిధిగా కొనసాగించాలని పలువురు అర్జీ ఇచ్చారు.