అమరావతి (చైతన్య రథం): నవ్యాంధ్ర రాజధాని నగరం అమరావతి పునఃప్రారంభోత్సవ వేడుకల్లో సభా వేదికపై ప్రధాని నరేంద్ర మోదీ మంత్రి నారా లోకేశ్‌తో సరదా వ్యాఖ్యలు చేశారు. ‘నీకెన్నిసార్లు చెప్పాలి.. నన్ను కలవడానికి రావా? అని లోకేశ్‌ని ప్రేమగా నిలదీశారు. గత పర్యటనలోనూ ఇదే అంశాన్ని ప్రధాని ప్రస్తావించారు. అయితే, ఇందుకు బదులిచ్చిన మంత్రి నారా లోకేశ్.. త్వరలోనే కుటుంబ సమేతంగా ఢల్లీికి వస్తానని మోదీతో చెప్పారు. అమరావతి పునఃప్రారంభోత్సవం సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ రూ.58వేల కోట్ల విలువైన ప్రాజెక్టులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేసిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా సభావేదికపై మరో ఆసక్తికర ఘటన జరిగింది. డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ సభలో ప్రసంగించిన సమయంలో దగ్గు రాగా.. ఆ తర్వాత ప్రధాని ఆయనను పిలిచి చాక్లెట్ అందజేశారు. దీంతో ప్రధానికి పవన్ కృతజ్ఞతలు తెలుపుతున్న వీడియో వైరల్‌గా మారింది.