దావోస్ (చైతన్యరథం): ఏపీలో క్యాన్సర్ చికిత్సలో బసవతారకం క్యాన్సర్ ఇనిస్టిట్యూట్‌తో కలిసి పనిచేయాలని కేరింగ్ క్రాస్ ఎగ్జిక్యూటివ్ డైరక్టర్ బోరో డ్రోపులిక్‌ను రాష్ట్ర విద్య, ఐటీశాఖల మంత్రి నారా లోకేష్ కోరారు. కేరింగ్ క్రాస్ ఎగ్జిక్యూటివ్ డైరక్టర్ బోరో డ్రోపులిక్ తో దావోస్ బెల్వడేర్‌లో మంత్రి నారా లోకేష్ భేటీ అయ్యారు. ఈ సందర్భంగా నారా లోకేష్ మాట్లాడుతూ… ఆంధ్రప్రదేశ్‌లో బసవతారకం క్యాన్సర్ ఇనిస్టిట్యూట్‌తో కలసి జన్యుచికిత్స, అత్యాధునిక ఆరోగ్యసంరక్షణ మౌలిక సదుపాయాల్లో భాగస్వామ్యం వహించాలని కోరారు. దీనిద్వారా రాష్ట్రంలోని క్యాన్సర్ రోగులకు మరింత అందుబాటులో వైద్యసేవలు అందించే అవకాశం కలుగుతుంది. అంతర్జాతీయ బయోటెక్ సంస్థలు, పరిశోధనా సంస్థలతో గ్లోబల్ కొలాబరేషన్‌కు సహకారాన్ని అందించండి. బసవతారకం క్యాన్సర్ ఇనిస్టిట్యూట్‌తో కలిసి ఏపీని బయో టెక్నాలజీ, జన్యుచికిత్సల ప్రాంతీయ కేంద్రంగా నిలిపేందుకు క్యాన్సర్ వైద్య పరిశోధనలు, అభివృద్ధికి సహకారం అందించండి. ఏపీలో బయోటెక్నాలజీలో స్థానిక ఆవిష్కరణలు, అత్యాధునిక క్యాన్సర్ చికిత్సలు, జీన్ థెరపీలో లోకల్ ఇన్నోవేషన్ కోసం బసవతారకం క్యాన్సర్ ఇనిస్టిట్యూట్‌తో కలసి పనిచేయాలని మంత్రి నారా లోకేష్ కోరారు.