- ఆయన స్ఫూర్తి నింపేందుకే గురుకులాల్లో విగ్రహాలు
- విదేశీ విద్య పథకాన్ని తిరిగి ప్రారంభిస్తాం
- గురుకుల, వసతిగృహాలకు నాణ్యమైన బియ్యం
- ప్రజలకు మెరుగైన సేవలకే సచివాలయాల రేషనలైజేషన్
- సాంఘిక సంక్షేమ మంత్రి డోలా బాలవీరాంజనేయస్వామి
అంబేద్కర్ కోనసీమ/పలివెల/వాడపాలెం(చైతన్యరథం): అంబేద్కర్ ఆశయాలకు అనుగుణంగా కూటమి ప్రభుత్వం పరిపాలన సాగిస్తుందని సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా బాలవీరాంజనేయస్వామి పేర్కొన్నారు. ఆదివారం కొత్తపేట మండలం పలివెల పెద్దపేట గ్రామంలో స్థానిక ఎమ్మెల్యే బండారు సత్యానందరావుతో కలసి మంత్రి అంబేద్కర్ విగ్రహావిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్నారు. అనంతరం కొత్తపేట మండలం వాడపాలెంలో మంచినీటి పథకం, సచివాలయ భవనం, సీసీ రోడ్లను ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ అంబేద్కర్ విగ్రహావిష్కరణలో పాల్గొనడం అదృష్టంగా భావిస్తున్నట్లు చెప్పారు. అంబేద్కర్ ఇచ్చిన రిజర్వేషన్ల ఫలితంగానే సమాజంలో వెనుకబ డిన తరగతుల వారు ఉన్నత స్థాయికి చేరారన్నారు. ఎటువంటి సదుపాయాలు లేని పరిస్థితుల్లో కూడా అంబేద్కర్ విదేశాలు వెళ్లి ఉన్నత చదువులు అభ్యసించి దేశానికి గర్వకారణంగా నిలిచారన్నారు. నేటి యువత కూడా ఆయనను స్ఫూర్తిగా తీసుకొని ఉన్నత స్థాయిలను చేరుకోవాలని ఆకాంక్షించారు.
చదువులతోపాటు ఉద్యోగాలు ఉపాధి సంపాదించడం కూడా ముఖ్యమన్నారు. అంబేద్కర్ ఆశయాలు కనుగుణంగా కూటమి ప్రభుత్వం పరిపాలన సాగిస్తుందని స్పష్టం చేశారు. గురుకులాలు, సంక్షేమ వసతిగృహా ల్లో విద్యార్థులకు అన్ని సౌకర్యాలు కల్పిస్తున్నామని వివరించారు. రానున్న విద్యా సంవత్స రం నుంచి గురుకులాలు వసతిగృహాల విద్యార్థులకు కాస్మోటిక్ కిట్స్ ఇవ్వడంతో పాటు, నాణ్యమైన బియ్యంతో భోజనం అందిస్తామన్నారు. రూ.143 కోట్లతో సంక్షేమ వసతి గృహాలకు మరమ్మతులు నిర్వహిస్తున్నామన్నారు. అంబేద్కర్ విదేశీ విద్యకు పేరు మార్చి జగన్ అంబేద్కర్ అవమానించారని, అంబేద్కర్ విదేశీ విద్యా పథకాన్ని పునః ప్రారంభి స్తామన్నారు. అంబేద్కర్ స్ఫూర్తిని విద్యార్థుల్లో రగిలించేందుకు ప్రతి గురుకులంలో అంబే ద్కర్ విగ్రహం ఏర్పాటు చేస్తామన్నారు. పేద విద్యార్థులను సమాజంలో గొప్ప స్థాయికి తీసుకెళ్లాలని సీఎం చంద్రబాబు తపన పడుతున్నారన్నారు.
నేటి యువత కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అందించే సహకారాన్ని అందిపుచ్చుకుని ఉన్నత చదువులు అభ్యసించి ఉన్న త పదవులు అధిరోహించాలని, వ్యాపారవేత్తలుగా ఎదగడానికి కృషి చేయాలని సూచిం చారు. సచివాలయాలపై మాట్లాడుతూ ఆస్పిరేషనల్ సెక్రటరీ ద్వారా గ్రామాల్లో ఆర్టీజీఎస్ సేవలు అందిస్తామన్నారు. ఇప్పటికే మనమిత్ర వాట్సాప్ గవర్నమెంట్ ద్వారా ప్రజలకు సులభతరంగా సేవలు అందిస్తున్నట్లు వివరించారు. ఎస్సీ, ఎస్టీల సంక్షేమం గ్రామాల అభివృద్ధికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. పీ 4 ద్వారా సమాజంలో పేదరికం లేకుండా చేయాలన్నదే సీఎం చంద్రబాబు లక్ష్యమని స్పష్టం చేశారు.