- 72 గంటల్లో ప్రాథమిక నివేదికకు ఆదేశించారు
- బాధ్యులపై చర్యలకు విచారణ కమిషన్ ఏర్పాటు
- మృతులకు రూ.25 లక్షలు, క్షతగాత్రులకు రూ.3 లక్షలు
- బాధిత కుటుంబాలకు అవుట్ సోర్సింగ్ ఉద్యోగాలు
- గృహ నిర్మాణ మంత్రి కొలుసు పార్థసారథి
అమరావతి(చైతన్యరథం): సింహాచలంలో భక్తులపై గోడ కూలిన దుర్ఘటనపై ముఖ్యమంత్రి చంద్రబాబు వెంటనే స్పందించి తక్షణ సహాయక చర్యలు తీసుకునే విధం గా అధికార యంత్రాంగాన్ని అప్రమత్తం చేయడం జరిగిందని సమాచార పౌర సంబంధా లు, గృహ నిర్మాణ మంత్రి కొలుసు పార్థసారథిó తెలిపారు. ఈ ఘటనకు సంబంధించిన నివేదికను 72 గంటల్లో అందజేయాలంటూ ముగ్గరు ఉన్నతస్థాయి అధికారులతో విచార ణ కమిషన్‌ను నియమించడం జరిగిందన్నారు. మృతులకు రూ.25 లక్షలు, గాయపడిన వారికి రూ.3 లక్షల నష్టపరిహారాన్ని ముఖ్యమంత్రి ప్రకటించినట్లు తెలిపారు. బాదిత కుటుం బాలకు చెందిన వారికి అవుట్ సోర్సింగ్‌పై ఉద్యోగాలు ఇవ్వాలని అదేశించార న్నారు. బుధవారం సచివాలయం ప్రచార విభాగంలో మీడియాతో ఆయన వివరాలు వెల్లడిరచారు. చందనోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించేందుకు ప్రభుత్వం అన్ని ఏర్పా ట్లను పటిష్టంగా చేయడం జరిగిందన్నారు. అకాల వర్షం కారణంగా క్యూలైన్ల కోసం నిర్మించిన గోడ నాని భక్తులపై పడటం ఈ దుర్ఘటనకు దారితీసిందన్నారు. ఈ దుర్ఘట నకు బాధ్యులైన వారికి తక్షణ చర్యలు తీసుకునేందుకు పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ చైర్మన్‌గా ఐజీ ఎ.రవి కృష్ణ, జలవనరుల శాఖ అడ్వైజర్, ఇంజనీర్ ఇన్ చీఫ్ వెంకటేశ్వరరావు సభ్యులుగా విచారణ కమిషన్‌ను ప్రభుత్వం నియమించినట్లు తెలిపారు. ఈ ఘటనపై ప్రధాని మోదీ కూడా స్పందిస్తూ విచారణ వ్యక్తం చేయడమే కాకుండా మృతులకు రూ.2 లక్షలు, గాయ పడిన వారికి రూ.50 వేలు ప్రకటించడం జరిగిందన్నారు. ఊహించని విధంగా జరిగిన ఈ ఘటనను రాజకీయం చేస్తూ ప్రతిపక్ష పార్టీ నాయకులు మాట్లాడటం దురదృష్టకమని విచారణ వ్యక్తం చేశారు.
అమరావతికి అందరూ ఆహ్వానితులే….
అమరావతి పనుల పున:ప్రారంభ కార్యక్రమానికి అందరూ ఆహ్వానితులేనని, అమరావతి రాష్ట్ర ఆర్థిక గ్రోత్ ఇంజన్ అని, అటువంటి రాజధానిని ప్రేమించే వారంతా ఈ కార్యక్రమానికి హాజరుకావాలని పిలుపునిచ్చారు. మే 2న సాయంత్రం 3.00 గంటల నుంచి మొదలయ్యే మోదీ పర్యటనను విజయవంతానికి పటిష్టమైన ఏర్పాట్లు చేశాం. దాదాపు ఐదు లక్షల మంది హాజరయ్యే అవకాశం ఉందని, ఎటువంటి అసౌకర్యం కలు గకుండా అన్ని వసతులు, సౌకర్యాలు కల్పిస్తున్నట్లు తెలిపారు.