ఉండవల్లి (చైతన్య రథం): మొంథా తుపానులో ప్రజలకు అండగా నిలిచిన హోంమంత్రి వంగలపూడి అనిత పనితీరును సీపం చంద్రబాబు ప్రశంసించారు. సీపం క్యాంపు కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో హోంమంత్రి అనితకు ప్రశంసాపత్రం, ఉత్తమ సేవా అవార్డును సీఎం స్వయంగా అందించారు. తుఫాను సమయంలో ప్రజల రక్షణ, సహాయక చర్యల సమన్వయంలో కీలక పాత్ర పోషించారంటూ ప్రశంసలు కురిపించారు. ఈ సందర్భంగా మంత్రి అనిత మాట్లాడుతూ `ప్రజాసేవలో సీపం చంద్రబాబు చూపిన మార్గమే మాకు దిశానిర్దేశమన్నారు. అధినాయకుడి నేతృత్వంలో ప్రజాసేవ నేర్చుకున్నామని, సమస్యలు తెలుసుకుని బాధిత వర్గాలకు అందుబాటులో ఉండడం బాధ్యతగా భావిస్తున్నామన్నారు. సీపం చేతుల మీదుగా ‘సైక్లోన్ మొంథా ఫైటర్’ సర్టిఫికెట్ స్వీకరించడం, ప్రశంసలు అందుకోవడం నా జీవితంలో మర్చిపోలేని అనుభవమని సంతోషం వ్యక్తం చేశారు. పెను తుఫాను సమయంలో ప్రజలకు అండగా నిలిచిన ప్రతి ఒక్కరికీ మంత్రి అనిత ధన్యవాదాలు తెలిపారు.














