ఉండవల్లి (చైతన్య రథం): ఉండవిల్లిలోని సీఎం నారా చంద్రబాబు నాయుడు స్వగృహంలో మొంథా తుఫాన్‌లో మెరుగైన సేవలు అందించిన రాష్ట్ర కార్మికశాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్‌ను సీఎం చంద్రబాబు అభినందించారు. ఉత్తమ సేవలు అందించిన సుభాష్‌ను ప్రశంసిస్తూ.. ప్రశంసాపత్రం, జ్ఞాపికతో సత్కరించారు. అటు కోనసీమ జిల్లాలోనూ, ఇన్చార్జి మంత్రిగావున్న కృష్ణా జిల్లాలోనూ మంత్రి తీసుకున్న మెరుగైన తుఫాను సహాయక చర్యలుపట్ల సీఎం చంద్రబాబు అభినందనలు తెలిపారు.














