అమరావతి (చైతన్యరథం): ఏపీ సీఎం చంద్రబాబు ఆలోచనలు అద్భుతంగా ఉంటాయని ప్రముఖ పారిశ్రామికవేత్త ఆనంద్ మహీంద్రా అన్నారు. ఈ మేరకు ఆయన ‘ఎక్స్’లో పోస్టు చేశారు. నాంది ఇండియా ఫౌండేషన్ స్థాపన వెనుక సీఎం చంద్రబాము ఆలోచన ఉందన్నారు. అప్పటి నుండి ఆయన అందిస్తున్న ఆచంచలమైన మద్దతుకు, ప్రోత్సాహానికి ధన్యవాదాలు. ప్రస్తుతం అరకు కేఫ్‌లు విస్తరిస్తున్న తీరును చూసి చంద్రబాబు ఎంతో సంతోషిస్తారని ఆనంద్ మహీంద్రా పేర్కొన్నారు. పారిస్ కేఫ్‌లోని ఎలక్ట్రానిక్ స్క్రీన్‌పై అరకులోని గిరిజనుల జీవనశైలికి సంబంధించిన చిత్రాలు, వీడియోలు ప్రదర్శించనున్నట్లు తెలిపారు. ఇక్కడి కాఫీ ప్యాకేజింగ్‌ను గిరిజనుల వేషధారణ, భారతదేశంలోని వైవిధ్యమైన రంగుల స్ఫూర్తితో రూపొందించినట్లు వివరించారు. మరోవైపు ఈ నెల 29న కూడా కూడా ఆనంద్ మహీంద్రా ‘ఎక్స్’లో ఆసక్తికర పోస్టు పెట్టారు. ‘పారిస్‌లో మా రెండో అరకు కాఫీ స్టాల్ అంటూ వీడియో పెట్టారు. దీనిపై సీఎం చంద్రబాబు స్పందించారు. పచ్చని అరకులోయ నుంచి పారిస్ నడిబొడ్డుకు ‘మేడ్ ఇన్ ఏపీ’ ఉత్పత్తి చేరడం, ప్రపంచవ్యాప్తంగా తగిన గుర్తింపు లభించడం స్ఫూర్తిదాయకమని సీఎం పేర్కొన్నారు