అమరావతి (చైతన్య రథం): ‘ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల ఆశ `చీకట్లను జయించింది. ప్రధాని నరేంద్ర మోదీజీ రాకతో ఆంధ్ర రాష్ట్రంలో కోత్త ఉషోదయం సాక్షాత్కరించింది. ఏళ్ల తరబడి రాష్ట్ర ప్రజలు రాజధాని అనే దార్శనికతను ఆశించారు. పోరాడారు. సాధించుకున్నారు. మా ప్రజా రాజధాని కోసం కీలకమైన అభివృద్ధి ప్రాజెక్టులకు పునాది రాయి వేసి మీ ఉనికిని మాకు అందించినందుకు భారత ప్రధాని నరేంద్రమోదీజీకి హృదయపూర్వకంగా కృతజ్ఞతలు చెబుతున్నాను. రాష్ట్ర పురోగతికి మరింత కష్టపడి పనిచేయాలనే మా నిబద్ధతను మోదీజీ స్ఫూర్తిదాయకమైన ప్రసంగం పునరుద్ధరించింది. ఆయన నిరంతర మద్దతు ప్రజా రాజధానిని నిర్మించాలనే నా విశ్వాసాన్ని మరింత బలోపేతం చేసింది. అమరావతి కాంక్రీటు, ఉక్కుకంటే ఎక్కువ. ఇది నా రాష్ట్ర ప్రజల కలల హృదయ స్పందన. ఆ ఆకాంక్షలను సమైక్యంగా వాస్తవంలోకి తెచ్చే వేడుకను ఆస్వాదించాం. ధన్యవాదాలు మోదీజీ!’ అంటూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎక్స్ వేదికగా భావోద్వేగ హృదయ స్పందనతో ట్వీట్ చేశారు.