- బహిరంగ సభ ఏర్పాట్లపై మంత్రుల సమీక్ష
- సభా వేదిక, హెలిప్యాడ్ ప్రాంతాల పరిశీలన
- పటిష్ట భద్రతా ఏర్పాట్లు చేయాలని ఆదేశం
అనంతపురం(చైతన్యరథం): సూపర్‌సిక్స్..సూపర్‌హిట్ భారీ బహిరంగ సభ ఏర్పాట్లపై శనివారం ఆర్ అండ్ బీ గెస్ట్ హౌస్‌లో మంత్రులు పయ్యావుల కేశవ్, అనగాని సత్యప్రసాద్, గొట్టిపాటి రవికుమార్, పి.నారాయణ, సవిత, మండిపల్లి రాంప్రసాద్‌రెడ్డి, కొల్లు రవీంద్ర బృందం అధికారులతో సమీక్షించింది. ఈనెల 10న అనంతపురంలో జీఎంఆర్ ఇంద్రప్రస్థ శ్రీనగర్ కాలనీ వైపు ఉన్న ప్రాంతంలో బహిరంగ సభ జరగనుంది. ఈ బహిరంగ సభను విజయవంతం చేసేందుకు చేయాల్సిన ఏర్పాట్లపై చర్చించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు ముఖ్య అతిథిగా, ఉప ముఖ్యమంత్రి పవన్‌కళ్యాణ్ కూడా వస్తున్న నేపథ్యంలో పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. సభకు రాష్ట్రం నలుమూలల నుంచి వచ్చే ప్రజలకు వాహన ఏర్పాట్లు, మంచినీటి సౌకర్యం కల్పించాలని సూచించారు. సభా వేదిక, హెలిప్యాడ్ ఏర్పాటు చేసే స్థలాలను మంత్రుల బృందం పరిశీలించింది.
విజయవంతం చేయాలి: అనగాని
అనంతపురంలో సభను విజయవంతం చేయాలని కోరారు. 15 నెలల్లో కూటమి ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ పథకాను వివరిస్తూ సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమా నికి అద్భుతమైన స్పందన వచ్చిందని తెలిపారు. అనంతపురం ఎప్పు డూ టీడీపీకి, కూటమి ప్రభుత్వానికి అండగా ఉందన్నారు. జిల్లా లోని 14 నియోజకవర్గాలు, రెండు ఎంపీ స్థానాలు కూటమి గెలుచుకుంది..సీఎం చంద్రబాబు కృషితో కియా మోటార్స్ వచ్చిం ది. భవిష్యత్తులో మరిన్ని పరిశ్రమలు రాబోతున్నాయి..రాయలసీమ ప్రాంతాన్ని సస్యశ్యామలం చేసేందుకు కృషి చేస్తున్నామని తెలిపా రు. మూడున్నర లక్షల మంది సభకు హాజరయ్యేలా అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని వివరించారు. మంత్రులు, కమిటీ బృందం అన్ని కార్యక్రమాలను పర్యవేక్షిస్తుందని తెలిపారు.
మెడికల్ పాలసీపై వైసీపీ దుష్ప్రచారం
ప్రతిపక్ష నేతలు ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారు. పాజిటివ్ ఆలోచనతో ఆరోగ్య బీమా పథóకాన్ని తీసుకొచ్చాం. ఆరోగ్య సమ స్యలను దృష్టిలో పెట్టుకుని యూనివర్సల్ బీమా పథకాన్ని తీసుకొ చ్చాం.. 3,400 పైచిలుకు వ్యాధులకు 2 వేల ఆసుపత్రుల లో చికిత్స అందేలా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. వైసీపీవి ఎప్పుడూ మద్యం పాలసీ, రివర్స్ టెండరింగ్, శాండ్ పాలసీలే.. కూటమి ప్రభుత్వానివి ప్రజాహితం కోరే పాలసీలు. ఆరు గంటల్లో నే అప్రూవల్ వచ్చే మెడికల్ పాలసీ రూపొందించాం. గత ప్రభు త్వం రూ.600 కోట్లతో రుషికొండ ప్యాలెస్ కట్టే బదులు మెడికల్ కాలేజీలు పూర్తి చేయవచ్చు కదా అని హితవుపలికారు. పేద విద్యార్థులకు ఇబ్బందులు కలగకుండా పీపీపీ మోడల్‌లో మెడికల్ కాలేజీలు పూర్తి చేస్తున్నామని వివరించారు. పాజిటివ్ వాతావర ణంలో జరుగుతున్న కార్యక్రమాలను వైసీపీ తప్పుదోవ పట్టిస్తూ చిల్లర రాజకీయాలు చేస్తుందని మండిపడ్డారు. టీడీపీ నేతలపై కేసులున్నాయని ప్రచారం చేస్తున్నారు..
ప్రజాహితం కోసం చేసిన పోరాటాలపై పెట్టిన కేసులు అవి..తన మీదా మూడు కక్షపూరిత కేసులు నమోదు చేశారని పేర్కొన్నారు. వైసీపీ దుకాణం మూత పడుతోంది.. వారి పాలన నచ్చకే వైసీపీని ఇంటికి పంపా రని అన్నారు. ఈ కార్యక్రమంలో అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్, ఎంపీలు అంబికా లక్ష్మీనారాయణ, హిందూపురం ఎంపీ బీకే పార్థసారథి, రాప్తాడు ఎమ్మెల్యే పరిటాల సునీత, కళ్యాణదుర్గం ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు, సింగన మల ఎమ్మెల్యే బండారు శ్రావణి, మడకశిర ఎమ్మెల్యే ఎంఎస్ రాజు, పుట్టపర్తి ఎమ్మెల్యే పల్లె సింధూరరెడ్డి రాష్ట్ర కార్మిక సంక్షేమ బోర్డు చైర్మన్ వెంకటశివుడు యాదవ్, అహుడా ఛైర్మెన్ వరుణ్, రాష్ట్ర నాయకులు కే.రవీంద్ర(నాని), కిలారి రాజేష్, చిలక మధు సూదన్‌రెడ్డి, రాయలసీమ జిల్లాల ఎంపీలు, ఎమ్మెల్యేలు, కూటమి పార్టీల ఇన్‌చార్జిలు, నాయకులు పాల్గొన్నారు.














