` రాష్ట్ర ప్రజలకు భరోసా ఇస్తూ ఎక్స్‌లో సీఎం చంద్రబాబు పోస్ట్
` సత్వర న్యాయం, పోలీసింగ్ సహా వివిధ అంశాల్లో దేశంలోనే రెండో స్థానంలో ఏపీ
` ఇండియా జస్టిస్ రిపోర్ట్`2025లో రాష్ట్రాల పనితీరుపై నివేదిక
అమరావతి (చైతన్యరథం): ప్రజలకు సత్వర న్యాయం అందించటంలో ఏపీని నెంబర్ 1 రాష్ట్రంగా తీర్చిదిద్దటమే లక్ష్యంగా పనిచేస్తున్నామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. ప్రజలకు న్యాయసహాయం, పోలీసింగ్ సహా వివిధ కేటగిరీల్లో ఏపీ దేశంలోనే రెండో స్థానంలో నిలవటంపై వచ్చిన కథనాలపై స్పందించిన సీఎం రాష్ట్ర ప్రజలకు భరోసా ఇస్తూ ఎక్స్‌లో పోస్ట్ చేశారు. ఈ అంశాల్లో దేశంలో రెండో స్థానంలో నిలిచిన ఏపీ కీలకమైన మైలు రాయిని అందుకున్నా సంతృప్తి చెందటం లేదని.. ఏపీని అగ్రస్థానంలో నిలబెట్టేంత వరకూ నిర్విరామంగా పనిచేస్తామని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు.
సత్వర న్యాయం, పటిష్టమైన పోలీసింగ్ సహా వివిధ అంశాల్లో దేశంలోనే ఏపీ రెండో స్థానంలో నిలిచింది. ప్రజలకు న్యాయ సహాయం అందించటంలో, శాంతిభద్రతల్లో ఏపీ టాప్‌లో ఉందని ఇండియా జస్టిస్ రిపోర్టు `2025 వెల్లడిరచింది. రాష్ట్రంలో ప్రజలకు సత్వర న్యాయం అందటం, శాంతిభద్రతలు, పోలీసింగ్, న్యాయవ్యవస్థ పనితీరు, సామాజిక, చట్టపరమైన పాలన, తదితర అంశాలను పరిగణనలోకి తీసుకుని ఇండియా జస్టిస్ సంస్థ ఏపీకి ర్యాంకింగ్ ఇచ్చింది. ఈ నివేదిక ఆధారంగా వివిధ పత్రికలు, వెబ్ సైట్లు కథనాలు వెలువరించాయి. జగన్ హయాంలో రాజకీయ ప్రతీకారాలు, ప్రతిపక్ష నాయకుల్ని టార్గెట్ చేసేందుకు పోలీసు వ్యవస్థను దుర్వినియోగం చేయటంతో ఏపీ ర్యాంకింగ్ దిగజారిపోయింది.
2019 నుంచి 2024 వరకు ఆంధ్రప్రదేశ్ ర్యాంకింగ్ బాగా పడిపోయింది. అయితే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రాష్ట్రంలో చట్టబద్ద పాలన తిరిగి వచ్చినట్టు ఇండియా జస్టిస్ రిపోర్టు పేర్కోంది. పోలీసింగ్‌తో పాటు న్యాయ సహకారాన్ని అందించటంలో ఏపీ పనితీరు మెరుగైనట్లు ఆ నివేదిక వెల్లడిరచింది. ఇండియా జస్టిస్ రిపోర్టులో 6.78 స్కోర్‌తో కర్ణాటక రాష్ట్రం మొదటి స్థానంలో ఉంది. 6.32 స్కోర్‌తో దేశంలో ఆంధ్రప్రదేశ్ రెండో స్థానంలో నిలిచింది. ఇక ఆ తదుపరి స్థానాల్లో తెలంగాణ, కేరళ, తమిళనాడు రాష్ట్రాలు ఉన్నాయి. రాష్ట్రంలో శాంతిభద్రతల నిర్వహణను కూటమి ప్రభుత్వం కఠినంగా అమలు చేస్తుండటంతో ఏపీ మెరుగైన ర్యాంకింగ్ సాధించిందని మాధ్యమాల్లో కథనాలు వెలువడ్డాయి.