కుప్పం (చైతన్య రథం): కుప్పంను తాకిన కృష్ణమ్మకు చంద్రబాబు జలహరతి ఇస్తోన్న సమయంలోనే.. కుప్పంలోని మొత్తం 60కి పైగా ప్రాంతాల్లో ప్రజలు జలహారతులు ఇచ్చారు. కుప్పంలోని తన నివాసం నుంచి ఆర్టీసీ బస్సులో ముఖ్యమంత్రి ప్రయాణించారు. మహళలు, రైతులతో కలిసి స్త్రీశక్తి బస్సులో సీఎం ప్రయాణించారు. కుప్పం బ్రాంచ్ కెనాల్ వరకు మహిళలు, రైతులతో సంభాషిస్తూ బస్సులో సీఎం ప్రయాణించారు. స్త్రీ శక్తి పేరుతో అందిస్తున్న ఉచిత బస్సు సదుపాయం ఎలా ఉందని మహిళలను అడిగిన చంద్రబాబు…. తాము ఎక్కడికి వెళ్లినా ఇబ్బంది లేకుండా ఫ్రీ బస్సులో వెళు _న్నామని మహిళలు చెప్పారు. హంద్రీ-నీవా నీళ్లు తొలిసారి కుప్పానికి వచ్చాయి.. కాల్వల్లో నీళ్లు చూశారా..? చెరువులు నిండాయా? అంటూ చంద్రబాబు ఆరా తీశారు. తొలిసారి కుప్పానికి కృష్ణమ్మ వచ్చిందని… చాలా సంతోషంగా ఉందని రైతులు, మహిళలు చెప్పారు. ఇక సభకు హాజరయ్యే ముందు బోటులో పరమ సముద్రం చెరువులోకి వెళ్లి చెరువును పరిశీలించారు. ఇక సభలో 2014-19 మధ్య అసెంబ్లీలో సాగునీటి రంగంపై జరిగిన చర్చ వీడియోను సీఎం చంద్రబాబు ప్రదర్శించారు. నాడు ప్రతి నియోజకవర్గానికి నీళ్లిస్తామని సభలో చంద్రబాబు ప్రకటించిన వీడియోను పొందుపరిచారు. జగన్ అడ్డంగా పడుకున్నా… నీళ్లిచ్చి తీరతామంటూ నాడు సభలో చంద్రబాబు స్పష్టం చేస్తూ ప్రకటిస్తున్న వీడియో చూసిన సభికులు చప్పట్లతో సభా ప్రాంగణాన్ని మార్మోగించారు. ఈ సందర్భంగా వైసీపీ తీరును సభలో సీఎం ఎండగట్టారు. పట్టిసీమ ద్వారా గోదావరి జలాలను తరలించి.. కృష్ణా జలాలను సీమకు తీసుకువచ్చే ప్రయత్నం చేశామని నాడు సభలో జరిగిన చర్చను చంద్రబాబు వివరించారు. పట్టిసీమకు అడ్డుపడే ప్రయత్నం చేశారని వైసీపీ తీరును చంద్రబాబు దుయ్యబట్టారు. 2019 మధ్యకాలంలో వైసీపీ ప్రభుత్వ నిర్వాకంవల్ల సీమకు నీరు చేరలేదని ముఖ్యమంత్రి వెల్లడించారు. కుప్పం బ్రాంచ్ కెనాల్ వద్ద ఏర్పాటు చేసిన ఫొటో ఎగ్జిబిషన్ను ముఖ్యమంత్రి సందర్శించారు. రిజర్వాయర్లల్లో నీరు ఏవిధంగా నింపుతున్నాం… ప్రవాహాలు వస్తున్న తీరును జనానికి అర్థమయ్యేలా సీసీ కెమెరాల ద్వారా లైవ్లో చూపించే ఏర్పాట్లు చేయాలని సీఎం ఆదేశించారు. నీటి విలువ, ఇరిగేషన్ కోసం ఎంత ఖర్చు పెడుతున్నామనే అంశాలను, ఎన్ని రోజుల్లో నీటిని తరలించామనే విషయాలను వివరిస్తూ లైవ్ డిమానిస్ట్రేషన్ ఇవ్వాలని సీఎం సూచించారు. హంద్రీ-నీవా కాల్వ విస్తరణ పనుల పైలాను సీఎం చంద్రబాబు ఆవిష్కరించారు.