అమరావతి (చైతన్య రథం): నాలుగు రోజుల పర్యటన నిమిత్తం 16వ ఆర్ధిక సంఘం ఈనెల 14న రాష్ట్రానికి రానుంది. ఆర్ధిక సంఘంతో ఈనెల 16న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమావేశం కానున్నారు. 16వ ఆర్ధిక సంఘానికి రాష్ట్ర ఆర్ధిక పరిస్థితిని వివరించి తగు సాయం చేయాలని కోరనున్నారు. దీనిపై సన్నాహకంగా ఆర్ధిక శాఖ అధికారులతో ముఖ్యమంత్రి గురువారం సచివాలయంలో సమీక్ష నిర్వహించారు. సమావేశంలో ఆర్ధిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్, రాష్ట్ర ఆర్ధిక శాఖ ముఖ్య కార్యదర్శి పియూష్‌కుమార్, ఇతర అధికారులు పాల్గొన్నారు.