అమరావతి (చైతన్య రథం): విశాఖపట్నం ఫిషింగ్ హార్బర్ వద్ద వెల్డింగ్ షాపులో గ్యాస్ సిలిండర్ పేలి మృతిచెందిన వారి కుటుంబాలకు ప్రభుత్వం తరపున ముఖ్యమంత్రి చంద్రబాబు ఎక్స్‌గ్రేషియా ప్రకటించారు. ప్రమాదంలో మృతి చెందిన ముగ్గురికి రూ.10 లక్షల చొప్పున పరిహారం అందించాలని అధికారులను సీఎం ఆదేశించారు. ఈ ప్రమాదంలో గాయపడిన వారికి మెరుగైన వైద్య చికిత్స అందించాలని సీఎం చంద్రబాబు అధికారులను ఆదేశించారు.