- కష్టాల్లో ఆదుకుంటున్నారు
- దేశంలో ఏ రాజకీయ పార్టీకీ లేని విధంగా టీడీపీ కార్యకర్తల సంక్షేమ నిధి ఏర్పాటు
- టీడీపీ రాజకీయ పార్టీ కాదు..ఓ ఆత్మీయ కుటుంబం
- మంత్రి డోలా శ్రీబాల వీరాంజనేయస్వామి స్పష్టీకరణ
- రోడ్డు ప్రమాదంలో మరణించిన కార్యకర్త కుటుంబానికి కార్యకర్తల బీమా రూ. 5 లక్షలు అందజేత
ప్రకాశం / తూర్పు నాయుడుపాలెం (చైతన్యరథం): టీడీపీ కార్యకర్తల కష్టాల్లో పార్టీ జాతీయ అధ్యక్షుడు, సీఎం చంద్రబాబు నాయుడు..జాతీయ ప్రధాన కార్యదర్శి, మంత్రి లోకేష్ అండగా నిలుస్తున్నారని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డా. డోలా శ్రీ బాల వీరాంజనేయస్వామి అన్నారు. ఇటీవల రోడ్డు ప్రమాదంలో మరణించిన ప్రకాశం జిల్లా కొండపి నియోజకవర్గం కామేపల్లి అగ్రహారానికి చెందిన టీడీపీ కార్యకర్త తానికొండ వెంకటరావు కుటుంబ సభ్యులకు మంగళవారం నాడు తూర్పునాయుడుపాలెం లోని తన క్యాంపు కార్యాలయంలో మంత్రి రూ.5 లక్షల కార్యకర్తల బీమా చెక్కును అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ….కార్యకర్తల కష్టాల్లో చంద్రబాబు, లోకేష్ అండగా నిలుస్తున్నారన్నారు. దేశంలో ఏ రాజకీయ పార్టీకి లేని విధంగా టీడీపీ కార్యకర్తల సంక్షేమ నిధి ఏర్పాటు చేశాం. ఈ సంక్షేమ నిధి ద్వారా కార్యకర్తల కుటుంబాలకు ఆర్థిక సాయంతో పాటు వారి పిల్లలకు విద్యను అందిస్తున్నాం. పార్టీ కోసం ప్రాణాలు సైతం ఫణంగా పెట్టి పనిచేసే కార్యకర్తలు టీడీపీ సొంతం. టీడీపీ రాజకీయ పార్టీ కాదు..ఓ ఆత్మీయ కుటుంబం. పార్టీలో ఎవరికి ఏ కష్టం వచ్చినా 70 లక్షల మంది కార్యకర్తలు అండగా ఉంటారు. కార్యకర్తలకు మంచి చేసే విషయంలో చంద్రబాబు, లోకేష్ ఎప్పుడూ ముందే ఉంటారని మంత్రి డోలా స్పష్టం చేశారు. ఈ సందర్భంగా తమ కుటుంబానికి అండగా నిలిచిన సీఎం చంద్రబాబు నాయుడు, మంత్రులు నారా లోకేష్, డోలా శ్రీ బాల వీరాంజనేయస్వామికి టీడీపీ కార్యకర్త వెంకట్రావు కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు.