- ఉత్తమ ముఖ్యమంత్రుల జాబితాలో నాలుగో స్థానం గర్వకారణం
- మంత్రి కొలుసు పార్థసారథి
అమరావతి (చైతన్యరథం): దేశంలోని ఉత్తమ ముఖ్యమంత్రుల జాబితాలో నాలుగవ స్థానంలో నిలిచిన ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడుకి రాష్ట్ర గృహనిర్మాణ, సమాచార, పౌరసంబంధాల మంత్రి కొలుసు పార్థసారథి హృదయపూర్వక అభినందనలు తెలియజేశారు. ప్రతిష్టాత్మక ఇండియా టుడే పత్రిక సర్వేలో చంద్రబాబు నాయుడు నాలుగో స్థానంలో నిలవడం మాకు గర్వకారణం. కేవలం అధికారంలోకి వచ్చిన 8 నెలల్లోనే ఐదో స్థానం నుంచి ఆయన నాలుగో స్థానానికి చేరుకోవడం.. సంక్షేమం కోసం ఆయన పడుతున్న శ్రమ, ప్రగతి సాధించడానికి పట్టుదలతో పనిచేస్తున్న తీరుకు నిదర్శనంగా నిలుస్తుంది. కేవలం కొన్ని నెలల కాలంలోనే ఆరున్నర లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులను సాధించడం ప్రజలకు, పెట్టుబడిదారులకు ఆయన మీద ఉన్న నమ్మకాన్ని ప్రతిబింబిస్తోంది. ఐదేళ్లపాటు అన్ని రంగాల్లో విధ్వంసాన్ని చవిచూసిన రాష్ట్రాన్ని మళ్లీ ప్రగతి పట్టా లెక్కించేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నిరంతరం శ్రమించడం అందరికీ, ప్రత్యేకించి యువతకు కచ్చితంగా మార్గదర్శకం. ప్రజలకు వాగ్దానం చేసిన సూపర్ సిక్స్ పథకాలు అమలు చేయటానికి, యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించేందుకు ప్రభుత్వ యంత్రాంగాన్ని సీఎం చంద్రబాబు ముందుండి నడిపిస్తున్నారు. ఆయన మార్గదర్శకత్వంలో మేం కూడా అన్ని విధాలుగా కష్టపడుతున్నాం. ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన హామీల మేరకు సూపర్ సిక్స్ పథకాలను అమలు చేసి 20 లక్షల మంది యువతకు ఉపాధి అవకాశాలు కల్పించాలన్న లక్ష్యాన్ని ప్రభుత్వం త్వరలోనే సాధిస్తుందని మంత్రి పార్థసారథి ఉద్ఘాటించారు.
“