- యల్లమంద గ్రామంలో లబ్ధిదారులకు పింఛన్ల పంపిణీ
- అనంతరం వారితో మాటామంతీ
- అధికారులు, ప్రజాప్రతినిధులతో సమావేశం
- కోటప్పకొండలో స్వామివారి దర్శనం
అమరావతి (చైతన్యరథం): ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈ నెల 31న పల్నాడు జిల్లా, నరసరావుపేట నియోజకవర్గం, యల్లమంద గ్రామంలో పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొననున్నారు. ఆ రోజు ఉదయం 10.30 గంటలకు ఉండవల్లి నివాసం నుంచి పల్నాడు జిల్లాకు బయలుదేరి 10.50 గంటలకు నరసరావుపేట మండలం, యల్లమంద గ్రామానికి చేరుకుంటారు. 11.00 ` 11.30 గంటల మధ్య లబ్ధిదారులకు పింఛన్లు పంపిణీ చేస్తారు. 11.35-12.35 వరకు లబ్ధిదారులతో ముచ్చటిస్తారు. మధ్యాహ్నం 12.40-1.00 వరకు పల్నాడు జిల్లా అధికారులు, ప్రజాప్రతినిధులతో సమావేశమవుతారు. 1.45 గంటలకు కోటప్పకొండ త్రికోటేశ్వరస్వామిని దర్శించుకుంటారు. 2.55 గంటలకు ఉండవల్లి నివాసానికి చేరుకుంటారు.