అమరావతి (చైతన్య రథం): చిత్తూరు జిల్లా గర్వించదగ్గ ముద్దుబిడ్డ, దార్శనిక విద్యావేత్త ప్రొఫెసర్ ఎంఆర్ దొరైస్వామినాయుడు ఇక లేరన్న సమాచారం బాధాకరం. దొరైస్వామినాయుడు లేని లోటు తీర్చలేనిదే’ అంటూ ముఖ్యమంత్రి చంద్రబాబు తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. ఈమేరకు ఎక్స్ వేదికగా పోస్టు పెడుతూ పీఇఎస్ గ్రూప్ ఆఫ్ ఇన్‌స్టిట్యూషన్స్ వ్యవస్థాపకుడిగా, ఆయన విద్యకు విశేష కృషి సలిపారని కొనియాడారు. ప్రజాసేవకు కట్టుబడిన వ్యక్తిగా ప్రశంసించారు. నా అభ్యర్థన మేరకు కుప్పంలో పిఇఎస్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ అండ్ రీసెర్చ్ (పిఇసిఎంఎస్‌ఆర్)ను స్థాపించారని, అది నేడు ప్రముఖ వైద్యసంస్థగా నిలుస్తోందని గుర్తు చేసుకున్నారు. విద్య మరియు ప్రజాసేవలో ఆయన వారసత్వం తరతరాలకు స్ఫూర్తినిస్తూనే ఉంటుదని కాంక్షించారు. ఆయన కుటుంబం, స్నేహితులు మరియు ఆయన తాకిన లెక్కలేనన్ని జీవితాలకు ముఖ్యమంత్రి చంద్రబాబు హృదయపూర్వక సంతాపం ప్రకటించారు.