- ఆరుగురు కొత్త ప్రిన్సిపాళ్ల నియామకం
- ఐదు బోధనాసుపత్రులకు కొత్త సూపరింటెండెంట్లు
అమరావతి (చైతన్యరథం): వైద్య కళాశాలల ప్రక్షాళన దిశగా కూటమి ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. ఇందులో భాగంగానే ప్రభుత్వ వైద్య కళాశాలలు, బోధనాస్పత్రుల్లో నియామకాలు చేపడుతోంది. కళాశాలలకు కొత్త ప్రిన్సిపాళ్లు, ఆసుపత్రులకు సూపరింటెండెంట్ల నియామకానికి సీఎం చంద్రబాబు ఆమోదం తెలిపారు. దీంతో ఆరు ప్రభుత్వ వైద్య కళాశాలలకు కొత్త ప్రిన్సిపాళ్లను నియమించడంతో పాటు ఐదు బోధనాస్పత్రులకు కొత్త సూపరింటెండెంట్లను నియమిస్తూ వైద్య, ఆరోగ్యశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. తాజా ఆదేశాల్లో భాగంగా ముగ్గురు ప్రిన్సిపాళ్లు, ఒక సూపరింటెండెంట్‌ను బదిలీ చేయడంతో పాటు ఖాళీల్లో ముగ్గురు కొత్త ప్రిన్సిపాళ్లు, ఐదుగురు కొత్త సూపరింటెండెంట్‌లను వైద్య, ఆరోగ్య శాఖ నియమించింది. వివరాలిలా ఉన్నాయి.
కొత్త ప్రిన్సిపాళ్లు
1. ప్రొఫెసర్ (ఓబిజి)గా వ్యవహరిస్తూ ప్రస్తుతం తాత్కాలిక ప్రిన్సిపాల్‌గా పనిచేస్తున్న డాక్టర్ కె.వి.ఎస్.ఎం.సంధ్యా దేవి.. ఖాళీగా ఉన్న విశాఖపట్నం ఆంధ్రా మెడికల్ కాలేజీ ప్రిన్సిపాల్‌గా నియమితులయ్యారు.
2. కాకినాడ ప్రభుత్వ వైద్య కళాశాలకు వైస్ ప్రిన్సిపాల్‌గా వ్యవహరిస్తున్న ప్రొఫెసర్ (అనస్థీషియా) డాక్టర్ ఎ.విష్ణు వర్ధన్‌ను ప్రిన్సిపాల్‌గా నియమించారు. ఇప్పటి వరకూ ప్రిన్సిపాల్‌గా పనిచేస్తున్న డాక్టర్ డి.డి.ఎస్.వి. నరసింహం ఇన్చార్జి హోదాలో డీఎంగా కొనసాగుతారు
3. రాజమహేంద్రవరంలోని జిఎంసిలో ప్రొఫెసర్ (బయో-కెమిస్ట్రీ)గా పనిచేస్తున్న డాక్టర్ జి.రాజేశ్వరి నెల్లూరులోని జిఎంసి ప్రిన్సిపాల్‌గా నియమించారు
కొత్త సూపరింటెండెంట్లు
1. విశాఖపట్నంలోని ఎఎంసి, ప్రొఫెసర్ (ఎండోక్రినాలజీ) గా పనిచేస్తున్న డాక్టర్ కె.ఎ.వి.సుబ్రమణ్యంను ఒంగోలులోని జిజిహెచ్ సూపరింటెండెంట్‌గా నియమించారు2. విశాఖపట్నంలోని ఎఎంసిలో ప్రొఫెసర్ (ఒబిజి) గా పనిచేస్తున్న డాక్టర్ సి.అమూల్యను శ్రీకాకుళంలోని జిజిహెచ్ సూపరింటెండెంట్‌గా నియమించారు
3. విజయవాడలోని జిజిహెచ్‌లో తాత్కాలిక సూపరింటెండెంట్‌గా పనిచేస్తున్న డాక్టర్ ఎ.వి.రావుకు ఈ పదవికి సంబంధించి రెగ్యులర్ బాధ్యతలను అప్పగించారు.
4. శ్రీవెంకటేశ్వర మెడికల్ కాలేజీలో ప్రొఫెసర్ (అనస్థీషియా)గా పనిచేస్తున్న డాక్టర్ జె.రాధను తిరుపతిలోని ఎస్వీఆర్‌ఆర్జిహెచ్ సూపరింటెండెంట్‌గా నియమించారు
5. విశాఖపట్నంలోని ఎఎంసిలో ప్రొఫెసర్ (జనరల్ సర్జరీ)గా పనిచేస్తున్న డాక్టర్ వి.మన్మధరావును జిజిహెచ్‌లో సూపరింటెండెంట్‌గా నియమించారు
కాగా ఇటీవల మచిలీపట్నంలో ఎడిఎంఇ స్థాయికి పదోన్నతి కోసం సిఫారసు చేసిన జాబితాలోని 12 మందిలో ఐదుగురు పదోన్నతి పొందేందుకు నిరాకరించిన విషయం తెలిసిందే. ఈ ధోరణిపై ఆందోళన వ్యక్తం చేసిన ఆరోగ్య మంత్రి సత్య కుమార్ యాదవ్ ఈ విషయాన్ని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువచ్చారు.
బదిలీలు
1. కాకినాడలోని జిఎంసి ప్రిన్సిపాల్, డిఎంఇగా బాధ్యతలు నిర్వహిస్తున్న డాక్టర్ డి.వి.ఎస్.ఎల్. నరసింహం ఇన్చార్జి డిఎంగా కొనసాగుతారు
2. కడపలోని జిఎంసి ప్రిన్సిపాల్ డాక్టర్ ఎ.సురేఖ.. నంద్యాల జిఎంసికి బదిలీ అయ్యారు.
3. ఒంగోలులోని జిజిహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ టి. జమున కడపలోని జిఎంసి ప్రిన్సిపాల్‌గా బదిలీ అయ్యారు.
4. తిరుపతిలోని ఎస్వీఆర్‌ఆర్జిహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ జి. రవి ప్రభు తిరుపతిలోని శ్రీ వెంకటేశ్వర మెడికల్ కాలేజీ ప్రిన్సిపాల్‌గా బాధ్యతలు స్వీకరిస్తారు
పనితీరు సామర్థ్యాన్ని పరిగణనలోకి తీసుకుని పదోన్నతిపై కొత్త పోస్టింగ్‌లు ఇచ్చారు. అదే విధంగా ఆరోగ్య సమస్యలు, ఇతర అంశాల ఆధారంగా అందిన అభ్యర్థనల్ని పరిశీలించిన మీదట ఈ బదిలీలను చేపట్టారు