అమరావతి(చైతన్యరథం): రాష్ట్ర ప్రజలకు ఐటీ, విద్యాశాఖల మంత్రి నారా లోకేష్ ఒక ప్రకటనలో క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు. ఎల్లలు లేని సంతోషాలను బహూకరిం చే ఉత్సవం క్రిస్మస్.. ఏసుక్రీస్తు పుట్టిన పవిత్రమైన రోజును ఆనందంగా జరుపుకోవాలని ఆకాంక్షించారు. కృతజ్ఞత, ప్రేమను కలిగి ప్రజలతో సంతోషాలను పంచుకోవడమే క్రిస్మస్. లోక రక్షకుడు, కరుణామయుడు క్రీస్తు బోధనలు ప్రతిఒక్కరికీ మార్గదర్శకం. అందరూ సుఖ, సంతోషాలతో ఉండాలన్నదే ఏసు క్రీస్తు బోధనల సారాంశం. ప్రేమ, శాంతి ద్వారా ఏదైనా సాధించవచ్చని ఆచరించి చూపారు. ఏసుక్రీస్తు బోధనలను నేటి యువత ఆదర్శంగా తీసుకోవాలని సందేశమిచ్చారు.