- రాష్ట్ర అభివృద్ధికి కేంద్రం నుంచి పూర్తి సహకారం
- కేంద్ర గృహనిర్మాణ మంత్రి మనోహర్‌లాల్ ఖట్టర్
- విజయవాడ, విశాఖ మెట్రో రైలు ప్రాజెక్టులు,
- గృహనిర్మాణానికి నిధులపై సానుకూల స్పందన
- ఏపీజెన్కో, ఏపీ ట్రాన్స్‌కో, డిస్కమ్లపైనా సమీక్ష
- పాల్గొన్న రాష్ట్ర మంత్రులు కొలుసు, నారాయణ, గొట్టిపాటి
విజయవాడ(చైతన్యరథం): గృహ నిర్మాణం, పురపాలక, పట్టణాభివృద్ధి, విద్యుత్ రంగాలకు సంబంధించి ఏపీకి కేంద్రం నుంచి పూర్తి సహకారం ఉంటుందని కేంద్ర గృహ నిర్మాణ, పట్టణ వ్యవహారాల, ఇంధన శాఖల మంత్రి మనోహర్‌లాల్ ఖట్టర్ భరోసా ఇచ్చారు. శనివారం విజయవాడలోని నోవాటెల్‌లో రాష్ట్ర గృహనిర్మాణం, విద్యు త్, పురపాలక పట్టణాభివృద్ధి శాఖలపై ఆయన సమీక్షించారు. రాష్ట్ర గృహ నిర్మాణ, సమాచార, పౌరసంబంధాల మంత్రి కొలుసు పార్థసారథి, పురపాలక పట్టణాభివృద్ధి మంత్రి పి.నారాయణ, విద్యుత్ మంత్రి గొట్టిపాటి రవికుమార్ హాజరయ్యారు. ఆయా శాఖల పనితీరు, రాష్ట్ర ప్రభుత్వ చర్యలు, కేంద్ర ప్రభుత్వ సహకారాన్ని పవర్ పాయింట్ ప్రజంటేషన్ ద్వారా అధికారులు కేంద్రమంత్రికి వివరించారు. ఈ సందర్భంగా కేంద్ర విద్యుత్, హౌసింగ్, అర్బన్ అఫైర్స్ శాఖల మంత్రి మనోహర్‌లాల్ ఖట్టర్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు పనితీరు చాలా బాగుందన్నారు. గృహ నిర్మాణ, పురపాలక పట్టణాభివృద్ధి, ఇంధన రంగాలకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన చర్యలను ప్రశంసించారు. కేంద్రం నుంచి రాష్ట్రానికి పూర్తి సహకారం ఉంటుందని భరోసా ఇచ్చారు.
మంత్రుల వినతులకు సానుకూల స్పందన
రాష్ట్ర గృహ నిర్మాణ మంత్రి కొలుసు పార్థసారథి మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రంలో పీఎంఏవై అర్బన్ 2.0కి శ్రీకారం చుట్టామని వివరిస్తూ పీఎంఏవై-యు, హౌసింగ్ లేఅవుట్లలో మౌలిక సదుపాయాల కల్పనకు త్వరితగతిన నిధులు మంజూరు చేయాలని కోరారు. గత ప్రభుత్వం లేఅవుట్లలో మౌలిక సదుపాయాలను పట్టించుకోలేదన్నారు. దీంతో చాలామంది ఇప్పటికీ గృహ ప్రవేశానికి నోచుకోలేకపోతున్నారని కేంద్రమంత్రి దృష్టికి తీసుకెళ్లారు. మంత్రి పార్థసారథి ప్రతిపా దనలకు కేంద్రమంత్రి ఖట్టర్ సానుకూలంగా స్పందించారు. రాష్ట్ర పురపాలక, పట్టణాభి వృద్ధి మంత్రి పి.నారాయణ మాట్లాడుతూ విజయవాడ, విశాఖపట్నం మెట్రో రైల్ ప్రాజెక్టులకు త్వరగా ఆమోదం తెలపాలని కోరారు. ఆయా ప్రాజెక్ట్‌లకు సంబంధించి గతంలోనే కేంద్ర ప్రభుత్వంతో సంప్రదింపులు కూడా జరిగాయని వివరించారు. అలాగే అమృత్ 2 పథకం పనులు కొనసాగింపునకు సహకరించాలని కోరుతూ గత ఐదేళ్లుగా రాష్ట్రంలో అమృత్ పథకం అమలుకు నోచుకోని తీరును వివరించారు. మంత్రి నారాయ ణ ప్రతిపాదనలకు కేంద్రమంత్రి ఖట్టర్ సానుకూలంగా స్పందించారు. అనంతరం ఖట్టర్ ను మంత్రులు కొలుసు పార్థసారథి, పి.నారాయణ, గొట్టిపాటి రవికుమార్ జ్ఞాపిక, దుశ్శాలువాతో ఘనంగా సత్కరించారు. అంతకుముందు విజయవాడ నోవాటెల్‌కు చేరుకున్న కేంద్రమంత్రి ఖట్టర్‌కు కేంద్ర భారీ పరిశ్రమలు, ఉక్కు శాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాసవర్మ, రాష్ట్ర మంత్రులు గొట్టిపాటి రవికుమార్, పి.నారాయణ, ఏపీ ట్రాన్స్‌కో జేఎండీ కీర్తి, విజయ వాడ మున్సిపల్ కమిషనర్ ధ్యానచంద్ర సాదర స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో స్పెషల్ చీఫ్ సెక్రటరీలు విజయానంద్, అజయ్‌జైన్, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అండ్ అర్బన్ డెవలప్మెంట్ సెక్రటరీ కన్నబాబు, హౌసింగ్ ఎండీ రాజాబాబు, పురపాలక శాఖ కమిషనర్ హరినారాయణన్, ఏపీ ట్రాన్స్‌కో జేఎండీ కీర్తి, టిడ్కో ఎండీ సునీల్‌కుమార్ రెడ్డి, మెప్మా ఎండీ తేజ్ భరత్, స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ ఎండీ అనిల్‌కుమార్‌రెడ్డి, ప్రజారోగ్య విభాగం ఇంజినీరింగ్ చీఫ్ మరియన్న తదితరులు పాల్గొన్నారు.