- పార్టీ కోసం శ్రమించిన తనను ఆదరించారు
- తనపై ఉంచిన నమ్మకాన్ని వమ్ము చేయను
- మైనార్టీల సంక్షేమం, అభివృద్ధే ధ్యేయంగా పనిచేస్తా
- అందరి ఆదరాభిమానాలే తనను ఈ స్థాయికి చేర్చాయి
- మైనారిటీస్ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ ముస్తాక్ అహ్మద్
- తుమ్మలపల్లి క్షేత్రయ్య కళాక్షేత్రంలో బాధ్యతల స్వీకరణ
విజయవాడ(చైతన్యరథం): తాను ఈ స్థాయికి రావడానికి మీ అందరి ఆదరాభిమా నాలే కారణమని రాష్ట్ర మైనారిటీస్ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ మౌలానా షేక్ ముస్తాక్ అహ్మద్ తెలిపారు. తుమ్మలపల్లి క్షేత్రయ్య కళాక్షేత్రంలో రాష్ట్ర మైనారిటీస్ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్‌గా మౌలానా షేక్ ముస్తాక్ అహ్మద్ సోమవారం బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మైనార్టీల ఆత్మ బంధువు ముఖ్యమంత్రి చంద్ర బాబు అని కొనియాడారు. మైనార్టీల సంక్షేమం, అభివృద్ధే ధ్యేయంగా అనునిత్యం ముఖ్య మంత్రి అప్పజెప్పిన బాధ్యతను నెరవేరుస్తానని, చైర్మన్ పదవి ద్వారా నేను మైనార్టీలకు దగ్గరగా ఉంటూ ప్రభుత్వ పథకాలు వారికి అందేలా పనిచేస్తానని తెలిపారు. లబ్ధిదారు లను గుర్తించడానికి అవసరమైతే తానే వారి దగ్గరకు వెళ్లి న్యాయం చేస్తానన్నారు. తల్లి దండ్రుల ప్రార్ధనలు, అల్లా దీవెనలు నన్ను ఈ స్థాయికి తీసుకొచ్చాయి.. నేను మదరసా లో చదువుకున్నా..గత ప్రభుత్వం మదరాసాలను సరిగా నిర్వహించలేదని చెప్పారు. నాకు చైర్మన్ పదవిని ఇచ్చిన ముఖ్యమంత్రి, మంత్రి నారా లోకేష్‌కు జీవితాంతం రుణ పడి ఉంటానని కృతజ్ఞతలు తెలిపారు. మంత్రి లోకేష్ స్ఫూర్తిగా ఇప్పటినుంచి తనను కలవటానికి వచ్చేవారు బొకేలు, శాలువాలు కాకుండా పెన్నులు, పెన్సిళ్లు, నోట్‌బుక్స్ తెస్తే వాటిని విద్యాశాఖ ద్వారా విద్యార్థులకు అందిస్తామని చెప్పారు.
పార్టీ కోసం శ్రమించిన వారికి న్యాయం
ప్రభుత్వ మైనార్టీ సంక్షేమ శాఖ సలహాదారు మహ్మద్ షరీఫ్ మాట్లాడుతూ ముస్తాక్ అహ్మద్ శ్రమే ఆయనకు చైర్మన్ పదవి రావడానికి కారణమని.. నిజాయితీకి పట్టం కట్టేలాగా రాజకీయాలు ప్రక్షాళన జరగాలని ఆయన బలంగా నమ్మే వ్యక్తి అని తెలిపారు. రాష్ట్రంలోని 70కి పైగా నియోజకవర్గాల్లో ఆయన పర్యటించారని, మైనార్టీల్లో పేదరికాన్ని దూరం చేయడానికి కృషి చేయాలని కోరారు. మొదటిసారి స్వర్గీయ ఎన్టీఆర్ మైనార్టీల కోసం ఫైనాన్స్ కార్పొరేషన్‌ను కోటి రూపాయలతో ఏర్పాటు చేశారన్నారు. మైనార్టీలకు సబ్సిడీలతో పథకాలు, వడ్డీ లేని రుణాలు, స్వయం ఉపాధి కోసం మైనార్టీ మహిళలకు టైలరింగ్, బ్యూటీషియన్ తదితర కోర్సుల్లో శిక్షణ అందించేలా చూడాలని కోరారు.
మైనార్టీల సంక్షేమానికి చంద్రబాబు కృషి
ఎమ్మెల్యే గద్దే రామ్మోహన్ మాట్లాడుతూ మైనార్టీల కోసం ప్రత్యేక శ్రద్ధ కనపరచిన ఏకైక వ్యక్తి ముఖ్యమంత్రి చంద్రబాబు ఒక్కరే..తాను పార్లమెంటు సభ్యునిగా పనిచేసిన కాలంలో కూడా ముస్లింలకు, క్రిస్టియన్స్‌కు అనేక నిధులను అందించినట్లు గుర్తు చేశా రు. ఎమ్మెల్యే నక్కా ఆనంద్‌బాబు మాట్లాడుతూ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వానికి భారీ మెజార్టీతో 164 సీట్లను ప్రజలు అందించారు..పార్టీ కోసం పనిచేసిన ప్రతిఒక్కరికీ ముఖ్యమంత్రి న్యాయం చేస్తారనడానికి ఇదే నిదర్శనమన్నారు. మైనార్టీ నాయకుడిగా ముస్తాక్ అహ్మద్ అనేక అవమానాలు అనుభవించారు.. అందుకు తగ్గ ఫలితం వచ్చింద న్నారు. మైనార్టీ వర్గాలకు పథకాలు అందించి వారికి చేరువ అయినప్పుడే ముఖ్యమంత్రి ఆశించిన ఫలితం నెరవేరుతుందన్నారు. పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ నాగుల్‌మీరా మాట్లాడుతూ రాష్ట్రంలో మైనార్టీలు చంద్రబాబు వెంటే నిలిచారని తెలిపా రు. ముస్లింల అభివృద్ధి, సంక్షేమానికి రాష్ట్ర మైనారిటీస్ ఫైనాన్స్ కార్పొరేషన్‌ను ఏర్పాటు చేశారని, వారి మనోభావాలను కాపాడిన వ్యక్తి చంద్రబాబు అని పేర్కొన్నారు. తొలుత ఎన్టీఆర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం రాష్ట్ర మైనారి టీస్ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్‌గా మౌలానా షేక్ ముస్తాక్ అహ్మద్ చేత ఎండీ యాకూబ్ ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ కార్యక్రమంలో అభిమానులు, నాయకు లు పెద్దఎత్తున పాల్గొన్నారు.