- అన్నదాతకు అండగా కూటమి ప్రభుత్వం
- చేసిన మంచిని చూసి ఓర్వలేకే అబద్ధాలు
- గత ఐదేళ్లలో వ్యవసాయాన్ని అటకెక్కించారు
- రైతులను దోపిడీ చేసి నేడు కల్లబొల్లి కబుర్లు
- ధాన్యం బకాయిలు చెల్లించకుండా మోసం
- వ్యవసాయ మిషన్ వైస్ చైర్మన్ మర్రెడ్డి శ్రీనివాసరెడ్డి
మంగళగిరి(చైతన్యరథం): రైతు బాంధవుడు చంద్రన్న అయితే.. రైతుద్రోహి జగన న్న అని రాష్ట్ర వ్యవసాయ మిషన్ వైస్ చైర్మన్, తెలుగు రైతు విభాగం రాష్ట్ర అధ్యక్షుడు మర్రెడ్డి శ్రీనివాసరెడ్డి విమర్శించారు. మంగళగిరి టీడీపీ కేంద్ర కార్యాలయంలో శుక్ర వారం విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ రైతు గెలిస్తేనే వ్యవసాయం బతుకుతుందని, సమాజం అభివృద్ధి చెందుతుందని చంద్రబాబు భావించారు.. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 8 నెలల్లోనే వారికి మేలు చేకూరేలా పాలన సాగిస్తున్నారు. రైతు ద్రోహి జగన్‌రెడ్డి అని బల్ల గుద్ది చెప్పొచ్చు. కొత్త ముసుగు వేసుకుని రైతులపై ప్రేమ, అభిమానం, దయ అంటూ కొత్త నాటకానికి తెరలేపాడు. కూటమి ప్రభుత్వం రైతులకేమీ చేయలేదని నమ్మించే ప్రయత్నానికి నాంది పలికాడు. చంద్రబాబు ప్రభుత్వం కౌలు రైతు లకు రూ.3,826 కోట్లు పంట రుణాలు మంజూరు చేసి లక్షలాది మంది రైతులకు లబ్ధి చేకూర్చింది. గతంలో ఎన్నడూ లేనంతగా రికార్డు స్థాయిలో ధాన్యం రైతులకు మేలు చేకూరేలా 5,21,000 మంది రైతుల నుంచి 32 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కూటమి ప్రభుత్వం కొనుగోలు చేసింది. రూ.7,508 కోట్లను రైతుల ఖాతాల్లో 24 గంటల్లోనే జమ చేసిన ఘనత కూటమి ప్రభుత్వానిది. వైసీపీ ప్రభుత్వం కౌలు రైతు చట్టాన్ని రద్దు చేసి 2019, సెప్టెంబర్ 23న జీఓ 410 పేరుతో కొత్త చట్టాన్ని తీసుకొచ్చింది. భూమి యజమానులు కౌలు ఒప్పంద పత్రాలను జారీ చేయకపోవడం వల్ల లక్షలాది మంది కౌలు రైతులు నష్టపోయారు.
చంద్రన్న హయాంలో దాదాపు 9 లక్షల మంది కౌలు రైతులకు మేలు జరిగింది. జగన్ ప్రభుత్వం కౌలు రైతులను 3 లక్షల మందికి కుదించారు. జగన్‌రెడ్డి ప్రభుత్వ హయాంలో రాష్ట్రం రైతు ఆత్మహత్యల్లో 3వ స్థానం, కౌలు రైతుల ఆత్మహత్యల్లో 2వ స్థానంలో ఉందంటే ఆయన పాలన ఏ విధంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. రాష్ట్రంలో రికార్డు స్థాయిలో 37 కేంద్రాలలో 44 వేల మంది రైతుల నుంచి 20 లక్షల టన్నులు, ఏడాదికి రూ.1500 కోట్ల పత్తిని కొనుగోలు చేసి చంద్రబాబు ప్రభుత్వం రైతులకు అండగా నిలిచింది. రాష్ట్రంలో మిర్చి రైతులు పడుతున్న ఇబ్బందులను చంద్రబాబు కేంద్రం దృష్టికి తీసుకెళ్లి రైతులు వెతలు తీర్చారు. టమోటా ధరల పతనం నేపథ్యంలో రైతులు నష్టపోకుండా నేరుగా రైతుల నుంచి టమో టాలు సేకరించి రైతు బజార్లో అమ్మాలని కూటమి ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. వరద విపత్తు సమయంలో ప్రజలను ఆదుకునేందుకు ఆపన్న హస్తంగా చంద్ర న్న రూ.608 కోట్లతో నిధులు మంజూరు చేశారు. నేడు జగన్ రైతుల వద్దకు వచ్చి మొసలి కన్నీరు కారుస్తున్నాడు.
రైతులను మోసం చేసే కార్యక్రమం చేపట్టాడు. 2014-19 మధ్య చంద్రబాబు హయాంలో వెలిగొండ ప్రాజెక్ట్ నిర్మాణ పనులు పరుగులు పెట్టాయి. ఈ ప్రాజెక్టుకు చంద్రబాబు రూ.1373 కోట్లు ఖర్చు చేశారు. వైసీపీ ప్రభుత్వ హయాంలో అరకొరగా కేవలం రూ. 642 కోట్లు మాత్రమే ఖర్చు చేసినా పనులు పూర్తి కాలేదు. గోదావరి బనకచర్ల ప్రాజెక్ట్ ద్వారా ఏటా సముద్ర పాలవుతున్న 300 టీఎంసీల నీటిని ఒడిసిపట్టేలా చంద్ర బాబు కార్యాచరణ సిద్ధం చేశారు. రూ.80 వేల కోట్లతో మూడు దశల్లో ఈ ప్రాజెక్ట్‌ను మూడేళ్ల లో నిర్మించేలా ప్రణాళికలు సిద్ధం చేశారు. ఈ ప్రాజెక్టుకు రూ.40 వేల కోట్లు కేంద్రం నుంచి తీసుకొచ్చేలా జాగ్రత్తలు చేపట్టారు. సూపర్ సిక్స్ హమీల్లో భాగమైన ‘అన్నదాత సుఖీభవ’ పథకాన్ని ఈ ఏడాది మే, జూన్ నెలల్లోగా రూ.20 వేలు ఇవ్వబోతున్నామని చంద్రబాబు ఇప్పటికే ప్రకటించారు.
రైతు ద్రోహి జగన్‌రెడ్డి కొత్త ముసుగు వేసుకుని రైతుల పట్ల ప్రేమ, అభిమానం, దయ తనకున్నాయని నమ్మించే ప్రయత్నాలు చేస్తున్నాడు. చంద్రబాబు వ్యవసాయం, రైతులు అన్నా బాధ్యత ఉన్న వ్యక్తి. రైతును రాజుగా చూడాలని సంకల్పం ఉన్న నాయ కుడు. ఉప ముఖ్యమంత్రి పవన్‌కళ్యాణ్, బీజేపీ నాయకులు అందరూ కలిసి నేడు రాష్ట్రా భివృద్ధికి కృషి చేస్తున్నారు. పొలం దగ్గర నుంచి అంతర్జాతీయ పంటల వరకు అందరూ జోక్యం చేసుకుని రైతుకు అండగా నిలిచారు. మంచి సంకల్పం ఉన్న ప్రభుత్వంపై నేడు జగన్ బాధ్యత లేకుండా దుష్ప్రచారాలు చేస్తున్నాడు. తన గ్యాంగ్‌తో బాధ్యతారహిత వ్యాఖ్యలు చేయిస్తూ బజారున పడ్డారు. జగన్‌రెడ్డి అండ్ కో బ్యాచ్ విధ్వంసం వైపు అడు గులు వేస్తోంది. నేడు వ్యవసాయాన్ని నిలబెట్టాలని కూటమి ప్రభుత్వం తాపత్రయ పడు తూ ముందుకు సాగుతోంది. రైతు గెలిస్తేనే వ్యవసాయం బతుకుతుందని, సమాజం అభివృద్ధి చెందుతుందనే ఉద్దేశంతో చంద్రబాబు అధికారంలోకి వచ్చిన 8 నెలల్లోనే చేసిన మంచి పనులు ప్రజలు చూస్తున్నారని తెలిపారు.
సమాజానికి చీడపురులా జగన్‌రెడ్డి బృందం
జగన్‌రెడ్డి తానేదో రైతుల కష్టాలు చూసి చలించిపోయినట్లు మాట్లాడుతున్నాడు. గత ఐదేళ్లుగా పరదాల మాటున దాక్కుని ఏ ఒక్క రోజు కూడా ంౖతుల సమస్యలపై స్పందిం చిన దాఖలాలు లేవు. నేడు రైతుల వద్దకు వచ్చి వారు కష్టాలు పడుతున్నట్లుగా మాట్లాడు తున్నాడు. వారిని మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నాడు. 2019 నుంచి 2024 వరకు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వ్యవసాయం, రైతులపై వైసీపీ ప్రభుత్వం వ్యవహరించిన తీరు చాలా జుగుప్సాకరం. వ్యవసాయ రంగాన్ని దివా ళా తీయించారు. రైతులకు ఉప యోగపడే పథకాలు అటకెక్కించాడు. ఆర్బీకే కేంద్రాలంటూ భక్షక కేంద్రాలను సృష్టించి రైతులు పండిరచిన పంటను దోచుకున్నారు. దోపిడీదారులను నియమించుకుని దోచు కున్న దాంట్లో తాడేపల్లి ప్యాలెస్‌కు కమీషన్లు వచ్చేలా చేసుకున్నారు. ధాన్యం కొనుగోలు రైతులను పట్టించుకున్న పాపాన పోలేదు. 84,724 మంది రైతులకు ఇవ్వాల్సిన రూ.1674 కోట్లను ఎగ్గొట్టాడు.
కూటమి ప్రభుత్వం అధికా రంలోకి వచ్చాక వారి ఆర్థిక ఇబ్బందులను గ్రహించి వారికి అండగా నిలుస్తూ జగన్ పెట్టిపోయిన రూ.1674 కోట్ల బకాయిలను చెల్లించారు. వైసీపీ హయాంలో జగన్ ల్యాండ్, శాండ్, వైన్, మైన్స్ అంతా దోచుకున్నారు. మళ్లీ దోచుకోవడానికి అవకాశాల కోసం ప్రయత్నిస్తున్నారు. అడవి దొంగ వీరప్పన్ అయితే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అతని సోదరుడిగా మారి అడవినే సృష్టించుకున్నాడు. వీరప్పన్ అడవిలోని గంధపు చెక్కలు, ఏనుగు దంతాలు దోచుకుం టే.. అభినవ వీరప్పన్ పెద్దిరెడ్డి అడవినే దోచుకున్నాడు. సమాజానికి చీడపీడలా మారిన జగన్ బృందం ఆ చీడను చంద్రబాబు విదిలిస్తున్నాడు. ప్రజా సంక్షేమమే పరమావధిగా పాలన చేస్తున్న కూటమి ప్రభుత్వంపై బురద జల్లాలనే ప్రయత్నం చేయకండి..దుర్మార్గపు విమర్శలు మాని దుష్ప్రచారాలు కట్టిపెట్టాలని హితవుపలికారు.
ఐదేళ్ల పాటు జగన్ పాలనలో జగన్‌ను ధన పిశాచి ఆవరించి ఉంది. రాష్ట్రానికి తీరని ద్రోహం, అన్యాయం చేశారు. వ్యవసాయ శాఖకే తాళాలు వేశారు. ప్రాజెక్టులను పూర్తిగా అటకెక్కించారు. కూటమి ప్రభుత్వం సాగునీటి రంగానికి పెద్దపీట వేసింది. రాయలసీమను సస్యశ్యామ లం చేయడానికి ఏటా 3 వేల కోట్ల టీఎంసీలకు పైగా సముద్రం పాలవుతున్న గోదావరి జలాలను కృష్ణాకు తరలించి కృష్ణా నుంచి బనకచర్ల, బనకచర్ల నుంచి పెన్నాకు తరలించి హంద్రీనీవా, గాలేరు నగరి, తెలుగుగంగ, కేసీ కెనాల్ పరివాహక ప్రాంతాలకు కూడా ప్రతి ఎకరాకు నీరు అందించాలనే ఆలోచన చంద్రబాబుదని వివరించారు.