- ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఆలపాటిని గెలిపించాలి
- ఏపీ టీడీసీ చైర్మన్ నూకసాని బాలాజీ
గుంటూరు(చైతన్యరథం): గుంటూరు తూర్పునియోజకవర్గం ఉర్దూ ఉన్నత పాఠశాల లో శుక్రవారం గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో భాగంగా పర్యాటకాభివృద్ధి సంస్థ చైర్మన్ నూకసాని బాలాజీ పాల్గొన్నారు. ఎనిమిది నెలల కూటమి పాలనలో రాష్ట్రం ఎదుర్కొంటున్న ఆర్థిక సవాళ్లను అధిగమించేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నిరంతర కృషి చేస్తున్నారని తెలిపారు. గత ప్రభుత్వ హయాంలో ప్రజలు, ఉపాధ్యాయులు సమస్య లను చెప్పడానికే భయపడే పరిస్థితులు ఉన్నాయని, ప్రస్తుతం ప్రజాస్వామ్య వాతావర ణం నెలకొందని పేర్కొన్నారు. ప్రస్తుతం జరుగుతున్న గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూటమి అభ్యర్థి ఆలపాటి రాజేంద్రప్రసాద్‌కు మొదటి ప్రాధాన్య ఓటు వేయాలని పిలు పునిచ్చారు. ముఖ్యమంత్రి చంద్రబాబుకు సన్నిహితుడైన రాజేంద్రప్రసాద్ ప్రజా సమస్యల పై నిరంతరం పోరాడుతున్నారని కొనియాడారు. ఉపాధ్యాయులు, ప్రైవేటు టీచర్లు, ఇతర ఉద్యోగుల సమస్యలను త్వరలో పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. జగన్‌రెడ్డి పాలన లో వ్యవస్థలు నాశనమైన తీరును వివరించారు. ఈ కార్యక్రమంలో తూర్పు నియోజక వర్గ పరిశీలకులు రాఘవేంద్ర, అఖిల భారత ఓబీసీ సంఘం చైర్మన్ అంగిరేకుల వరప్రసాద్ యాదవ్, టీడీపీ సీనియర్ నాయకులు జాగర్లమూడి శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.
వాసవీ క్లాత్ మార్కెట్‌లో ప్రచారం
ఉమ్మడి కృష్ణా-గుంటూరు జిల్లాల గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా గుంటూరు తూర్పు నియోజకవర్గంలోని వాసవీ క్లాత్ మార్కెట్, వైష్ణవి క్లాత్ మార్కెట్ ప్రాంతాల్లో ప్రచారం నిర్వహించారు. ప్రకాశం జిల్లా టీడీపీ అధ్యక్షుడు, ఏపీ పర్యాటకా భివృద్ధి సంస్థ చైర్మన్ నూకసాని బాలాజీ పాల్గొన్నారు. ఆయన వెంట అంగిరేకుల వరప్రసాద్ యాదవ్, తూర్పు నియోజకవర్గ అబ్జర్వర్ గంజం రాఘవేంద్ర తదితరులు ఉన్నారు. వాసవీ క్లాత్ మార్కెట్ అసోసియేషన్, వైష్ణవి క్లాత్ మార్కెట్ అసోసియేషన్ సభ్యులు పెద్దఎత్తున హాజరై ఆలపాటికి మద్దతు ప్రకటించారు.