- పేదరికం లేని సమాజం నిర్మించేందుకు చర్యలు
- ఇబ్బందుల్లో ఉన్నా ప్రతినెలా 1వ తేదీనే పింఛన్లు
- మంత్రి డోలా బాలవీరాంజనేయస్వామి
కొండపి(చైతన్యరథం): పేదరికం లేని సమాజమే తమ ప్రభుత్వ లక్ష్యమని, పీ4..మార్గదర్శి, బంగారు కుటుంబం కాన్సెప్ట్‌తో రాష్ట్రంలో పేదరికాన్ని రూపుమాపేం దుకు ముఖ్యమంత్రి చంద్రబాబు కృషి చేస్తున్నారని సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా బాలవీరాంజనేయస్వామి పేర్కొన్నారు. మంగళవారం ప్రకాశం జిల్లా కొండపి నియోజకవర్గం జరుగుమల్లి మండలం పైడిపాడులో లబ్ధిదారులకు మంత్రి పెన్షన్లు పంపి ణీ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రాష్ట్రం ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్నా ప్రతి నెలా 1వ తేదీనే పేదల తలుపు తట్టి పెన్షన్లు ఇస్తున్నాం..రూ.2,722 కోట్లు వెచ్చిస్తు న్నాం..రూ.1000 పెన్షన్ పెంచడానికి జగన్‌కి ఐదేళ్లు పట్టింది..ఎన్నికల్లో ఇచ్చిన హామీ ప్రకారం తాము రూ.4 వేలకు పెంచామని తెలిపారు. గత వైసీపీ ప్రభుత్వం రాష్ట్రాన్ని రూ.9 లక్షల కోట్ల అప్పుల్లో ముంచి వెళ్లింది. చంద్రబాబు తన పాలనా దక్షతతో ఓ వైపు జగన్ చేసిన అప్పులు తీరుస్తూ మరో వైపు సంక్షేమం, అభివృద్ధిలో రాష్ట్రాన్ని ముందుకు నడిపిస్తున్నారని వివరించారు. సమాజంలో 10 శాతం ఉన్న ధనవంతులు 20 శాతం ఉన్న పేదలను అభివృద్ధి చేసేందుకు ముందుకు రావాలని పిలుపునిచ్చారు. ఏప్రిల్ నెల సంస్కరణ వాదుల మాసం. అంబేద్కర్, జగజ్జీవన్‌రామ్, జ్యోతిరావు పూలే, చంద్రబాబు వంటి సామాజికవేత్తలంతా ఈ నెలలోనే పుట్టారని పేర్కొన్నారు.