- చట్ట సవరణ బిల్లులో మూడు ప్రతిపాదనలు
- మైనార్టీలపై జగన్‌రెడ్డికి చిత్తశుద్ధి లేదు
- ఆ పార్టీ ఎంపీలు బిల్లుపై నోరు మెదపలేదు
- గత ప్రభుత్వంలో ముస్లింలకు తీరని అన్యాయం
- వక్ఫ్ భూములు పెద్దఎత్తున అన్యాక్రాంతం
- వైసీపీ నేతలు చౌకబారు విమర్శలు మానుకోవాలి
- ఎమ్మెల్యే మహమ్మద్ నసీర్ అహ్మద్ హితవు
మంగళగిరి(చైతన్యరథం): వక్ఫ్ చట్ట సవరణ బిల్లుపై చంద్రబాబు ఒక స్పష్టమైన ఆలోచనతో ఉన్నారని ఎమ్మెల్యే మహమ్మద్ నసీర్ అహ్మద్ తెలిపారు. రాష్ట్రంలో ముస్లిం ల రక్షణ, వారి అభ్యున్నతికి టీడీపీ కట్టుబడి ఉందన్నారు. రాజకీయాలకు అతీతంగా అధి కారంలో ఉన్నా లేకున్నా ముస్లింల మనోభావాలు దెబ్బతినకుండా వారి అభ్యున్నతికి పనిచేస్తుందని తెలిపారు. ముస్లింల మనోభావాలకు పెద్దపీట వేసేలా తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచి కృషిచేస్తుందని వివరించారు. స్వతంత్ర భారతదేశంలో ఉమ్మడి ఆంద్ర óప్రదేశ్, ప్రస్తుతం రాష్ట్రంలో కానీ ముస్లింల అభివృద్ధి కోసం బాటలు వేసిన నాయకుడు చంద్రబాబు అని పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన వక్ఫ్ చట్ట సవరణ బిల్లు లోని అభ్యంతరాలను నిర్మొహమాటంగా జాయింట్ పార్లమెంట్ యాక్షన్ కమిటీకి సిఫా ర్సు చేయాల్సిన బాధ్యతను పార్టీ తన భుజస్కందాలపై వేసుకుంది. ఈ విషయంలో టీడీపీ క్రియాశీలకంగా వ్యవహరిస్తున్న విషయాన్ని ముస్లిం సమాజం ఆలోచించాలని కోరారు. దేశంలోని ఏ ప్రభుత్వం ఏ పార్టీ తీసుకోని విధంగా టీడీపీ ఈ ప్రతిపాదనలను పెట్టింది. ముస్లింల పక్షపాతి అని గొప్పలు చెప్పుకుంటున్న జగన్ వక్ఫ్ చట్ట సవరణ బిల్లుపై ఎందుకు ప్రతిపాదనలు చేయలేదు? అని ప్రశ్నించారు. దేశంలో కీలకమైన బిల్లుపై చర్చ జరుగుతుంటే వైసీపీకి చెందిన ఒక్క పార్లమెంట్ సభ్యుడు కూడా నోరు మెదపలేదు. నిజంగా వారిపై చిత్తశుద్ధి ఉంటే పార్లమెంట్లో ఎందుకు వక్ఫ్ చట్ట సవరణ బిల్లుపై మాట్లాడలేదు? అని ప్రశ్నించారు.
గత ప్రభుత్వంలో వక్ఫ్ ఆస్తులు ఎక్కడ చూసి నా అన్యాక్రాంతం అయ్యాయి. ఆస్తుల పరిరక్షణకు లీగల్ టీంని ఏర్పాటు చేయలేదు. నేడు వక్ఫ్ ఆస్తులను కంటికి రెప్పలా కాపాడుకునే కార్యక్రమాన్ని సీఎం చంద్రబాబు చేస్తే.. ఉన్న కంటినే పొడిచే కార్యక్రమం జగన్ పాలనలో జరిగిందని ధ్వజమెత్తారు. చంద్రబాబు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అతిపెద్ద హజ్ హౌస్‌ను హైదరాబాద్‌లో నిర్మించారు. 2014లో హజ్ యాత్రికుల కోసం కడపలో హజ్ హౌస్‌ను రూ.13 కోట్లతో నిర్మించి 80 శాతం పనులు పూర్తి చేశారు. విజయవాడలో రూ.23 కోట్లతో హౌజ్ హౌస్ నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. కానీ జగన్‌రెడ్డి అధికారం లోకి వచ్చాక ఈ రెండిరటిని నాశనం చేశాడు. ఐదేళ్ల పాలనలో హౌజ్‌హౌస్‌ల నిర్మా ణానికి నిధులు కేటాయించకుండా ముస్లింలకు ద్రోహం చేశాడు. టీడీపీ 10 లక్షల కుటుంబాలకు రంజాన్ తోఫాను అందజేస్తే జగన్‌రెడ్డి వచ్చాక ఈ పథకాన్ని రద్దు చేశా డు. దేశంలోనే తొలిసారిగా ముస్లిం సంక్షేమం కోసం 1985లో అన్న ఎన్టీఆర్ మైనారిటీ ఫైనాన్స్ కార్పొరేషన్‌ను ఏర్పాటు చేశారు. గతంలో ఎప్పుడూ లేని విధంగా ముస్లింల సంక్షేమం కోసం పెద్దపీట వేస్తూ మౌజన్ ఇమాములకు గౌరవ వేతనం ఇచ్చే కార్యక్ర మాన్ని కూడా ఆనాడు ముఖ్యమంత్రిగా చంద్రబాబు తీసుకున్న నిర్ణయమేనని గుర్తుచేశా రు.
జగన్‌రెడ్డి జీఓ 43 పేరుతో వక్ఫ్ బోర్డును వివాదాస్పదం చేస్తే అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం ఆ జీవో రద్దు చేసి కొత్త వక్ఫ్ బోర్డును ఏర్పాటు చేసింది. ముఖ్యంగా 32 అపరిష్కృత కేసులను ఈ బోర్డు ఏర్పాటు చేసిన తర్వాత పరిష్కరించిన విషయాన్ని గుర్తుచేశారు. రంజాన్ మాసంలో ఇఫ్తార్ విందులో ముస్లింల పక్షపాతిగా సీఎం చంద్ర బాబు తన వైఖరి స్పష్టంగా చెప్పారు. బడ్జెట్‌లో రూ.5 వేల కోట్లకు పైగా నిధులు కేటాయించారు. వక్ఫ్ బిల్లుపై ముస్లింలకు స్పష్టమైన విధానాన్ని చంద్రబాబు తెలిపారు. రాష్ట్రంలో 65 వేల ఎకరాలు వక్ఫ్ భూముల్లో 50 శాతం అన్యాక్రాంతం అయ్యాయి. మిగతా 35 వేల ఎకరాలను కాపాడుకోవడానికి దాదాపు రూ.8 కోట్లు బడ్జెట్‌లో కేటాయించారు. రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే 3,500 ఎకరాల వక్ఫ్ ఆస్తులను డిజిటైజేషన్ చేశారు. అంతేకాకుం డా ఎక్కడాలేని విధంగా వక్ఫ్ ఆస్తుల పరిరక్షణకు పటిష్టమైన లీగల్ టీంని ఏర్పాటు చేశారు. ఇప్పటికైనా వైసీపీ నాయకులు చౌకబారు విమర్శలు మానుకోవాలని హితవుపలికారు.