పలు ప్రాజెక్టులు, కేంద్ర పథకాలపై చర్చ
అమరావతి: రెండ్రోజుల పర్యటన నిమిత్తం ముఖ్యమంత్రి చంద్రబాబు ఢల్లీికి వెళ్లారు. శుక్రవారం ఏడుగురు కేంద్ర మంత్రులతో సీఎం భేటీ కానున్నారు. రాష్ట్రానికి సంబంధించిన పలు ప్రాజెక్టులు, కేంద్ర పథకాలపై మంత్రులతో చర్చించి సహకారం కోరనున్నారు. నూతన క్రిమినల్ చట్టాల అమలు తీరుతెన్నులపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా నిర్వహించే సమీక్షకు చంద్రబాబు హాజరుకానున్నారు. ఢపిెన్స్ పరిశ్రమలు, స్పేస్ మ్యానుఫ్యాక్చరింగ్ పరిశ్రమలు, ఎలక్ట్రానిక్ తయారీ పరిశ్రమలు, పోలవరం, బనకచర్లకు కేంద్ర సాయం, ప్రతి ఇంటికీ తాగునీరు, రెన్యువబుల్ ఎనర్జీ ప్రాజెక్టులు తదితర అంశాలపై సీఎం చంద్రబాబు కేంద్ర మంత్రులతో ప్రధానంగా చర్చించనున్నారు.
సీఎం ఢిల్లీ పర్యటన షెడ్యూల్..
శుక్రవారం ఉదయం 10 గంటలకు పునరుత్పాదక ఇంధనశాఖ మంత్రి ప్రహ్లాద్ జోషితో సీఎం భేటీ కానున్నారు. ఉదయం 11 గంటలకు రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌తో సమావేశమవుతారు. మధ్యాహ్నం 12గంటలకు జలశక్తిశాఖ మంత్రి సీఆర్ పాటిల్‌తో భేటీ, ఒంటిగంటకు సైన్స్ అండ్ టెక్నాలజీ మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్‌తో సమావేశమవుతారు. సాయంత్రం 3 గంటలకు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌తో సీఎం భేటీ అవుతారు. సాయంత్రం 4 గంటలకు కేంద్ర హోంమంత్రి అధ్యక్షతన కొత్త క్రిమినల్ చట్టాల అమలుపై సమీక్షకు సీఎం చంద్రబాబు హాజరవుతారు. రాత్రి 9గంటలకు సీఎం చంద్రబాబును కేంద్ర ఎలక్ట్రానిక్స్, ఐటీ మంత్రి అశ్వినీ వైష్ణవ్ మర్యాదపూర్వకంగా కలుస్తారు. 24న భారత్ మండపంలో జరిగే నీతి ఆయోగ్ పాలక మండలి సమావేశానికి సీఎం చంద్రబాబు నాయుడు, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి విజయానంద్ హాజరవుతారు.