కేంద్రానికి చంద్రబాబు ధన్యవాదాలు
అమరావతి (చైతన్య రథం): రాష్ట్రాభివృద్ధి విషయంలో కేంద్రం అందిస్తోన్న సహకారం మరువలేనిదని చంద్రబాబు హర్షం వ్యక్తం చేశారు. ఏపీకి సెమీ కండక్టర్ యూనిట్‌ను కేటాయిస్తూ కేంద్ర కేబినెట్ తీసుకున్న నిర్ణయంపై ముఖ్యమంత్రి చంద్రబాబు సంతోషం వ్యక్తం చేశారు. ఈమేరకు కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్‌తో ఫోన్‌లో మాట్లాడిన సీఎం, సెమీ కండక్డర్ యూనిట్ కేటాయింపుపై ప్రధాని మోదీ, కేంద్రానికి ధన్యవాదాలు తెలిపారు. ఆంధ్రప్రదేశ్‌లో సెమీ కండక్టర్ యూనిట్ ఏర్పాటుకు దక్షిణ కొరియా సంస్థ అపాక్ట్ కంపెనీ లిమిటెడ్ ముందుకు రావడం తెలిసిందే. రూ.468 కోట్ల పెట్టుబడితో మొబైల్స్, సెట్ టాప్ బాక్సులు, ఆటోమోటివ్ ఈసీయూ, గృహ వినియోగ ఎలక్ట్రానిక్ పరికరాలకు సెమీ కండక్టర్లను అపాక్ట్ కంపెనీ ఉత్పత్తి చేయనుంది.