- ఇమామ్, మౌజమ్‌లకు రూ.45 కోట్ల నిధులు
- గత ప్రభుత్వం నిలిపేసిన బకాయిలు విడుదల
- 2024-25 బడ్జెట్‌లో రూ.4,376 కోట్లు
- వైసీపీ హయాంలో మైనార్టీలకు రక్షణ లేదు
- ఒక్క హామీని నెరవేర్చకుండా మోసం చేశారు
- ప్రభుత్వ సలహాదారు మహ్మద్ షరీఫ్
మంగళగిరి(చైతన్యరథం): ముస్లింలకు టీడీపీ ఎప్పుడు అధికారంలో ఉన్నా అండ గా నిలుస్తూ వస్తుందని ప్రభుత్వ సలహాదారు మహ్మద్ షరీఫ్ పేర్కొన్నారు. ఎన్నికల ముందు హామీ ఇచ్చిన మేరకు ఇమామ్ మౌజమ్‌లకు గౌరవ వేతనం ఆరు నెలల బకా యిలు విడుదల చేసిన సందర్భంగా సీఎం చంద్రబాబుకు వారి తరపున ధన్యవాదాలు తెలిపారు. వైసీపీ ఐదేళ్ల పాలనలో ముస్లింలు అనేక ఇబ్బందులు పడ్డారు. ఇమామ్, మౌజమ్‌లకు ఇవ్వాల్సిన గౌరవ వేతనం నిలిపివేశారు. ఆరు నెలల బకాయిలు రూ.45 కోట్లు నేడు కూటమి ప్రభుత్వం విడుదల చేసింది. ఈ మొత్తం నిధులు ఏప్రిల్ నెల నుంచి ఇమామ్ మౌజమ్‌లకు అందుతాయని తెలిపారు. ఎన్నికల ముందు మైనార్టీలకు అండగా ఉంటామని చంద్రబాబు ఇచ్చిన హామీ మేరకు అధికారంలోకి వచ్చిన వెంటనే బడ్జెట్‌లో అధిక నిధులు కేటాయించి న్యాయం చేశారని కొనియాడారు. ఇచ్చిన మాట నిలబెట్టుకునే స్వభావం చంద్రబాబుది అయితే… ఇచ్చిన మాట మరిచిపోయి ద్రోహం చేయడం జగన్‌రెడ్డి స్వభావమని విమర్శించారు. జగన్‌రెడ్డి ఐదేళ్ల పాటు మైనార్టీలను దోకా చేశారు. ఇచ్చిన ఏ హామీని అమలు చేయకపోగా 2014- 2019 మధ్య చంద్రబా బు ప్రభుత్వం ఇచ్చిన అనేక పథకాలను రద్దు చేసి మైనార్టీలకు తీరని ద్రోహం చేశారని మండిపడ్డారు. ఇమామ్ మౌజమ్‌లకు ఇప్పటికే ప్రభుత్వం రూ.90 కోట్ల నిధులు విడు దల చేసిందని, ఇమామ్‌లకు రూ.10 వేలు, మౌజమ్‌లకు రూ.5 వేల చొప్పున నెలకు గౌరవ వేతనం లభిస్తుందని చెప్పారు.