పాట్నా: బీహార్ ముఖ్యమంత్రిగా నితీష్ కుమార్ గురువారం ప్రమాణ స్వీకారం చేశారు. కార్యక్రమానికి ముఖ్యమంత్రి ఎన్ చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేషు హాజరయ్యారు. కార్యక్రమంలో భాగంగా కేంద్ర మంత్రులు అమిత్ షా. అర్జున్ రామ్ మేఘ్వాల్, యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్, మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవిస్, పలువురు బిజెపి, జెడియు నేతలను సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్ లు కలిసి ముచ్చటించారు. కొత్తగా ఎన్నికైన ముఖ్యమంత్రి నితీష్ కుమార్, ఆయన మంత్రివర్గానికి చంద్రబాబు ఈ సందర్భంగా శు భాకాంక్షలు తెలిపారు. “విజయవంతమైన, ప్రజాకేంద్రీకృత పాలన కోసం బీహార్లోని ఎన్డీఏ నాయకత్వానికి నా శుభాకాంక్షలు”అంటూ ముఖ్యమంత్రి చంద్రబాబు ట్వీట్ చేశారు. సీఎంగా నితీష్ ప్రమాణ స్వీకారోత్సవానికి కేంద్ర మంత్రి కె రామ్మోహన్నాయుడు సైతం హాజరయ్యారు.












