* నేడు 3 కొత్త పథకాలకు శ్రీకారం
* రూ.189.62 కోట్లతో ఉచిత విద్యుత్ పథకం అమలు
* రూ.5 కోట్ల త్రిఫ్ట్ పథకానికి నిధులు మంజూరు
* చేనేత వస్త్రాలపై 5 శాతం జీఎస్టీ మినహాయింపు
. 365 రోజులూ ఉపాధి… నేతన్నల ఆర్థిక వృద్ధికి పథకాల రూపకల్పన
* క్లస్టర్లు, టైక్స్టైల్స్ పార్క్ ఏర్పాటు
* మంత్రి లోకేశ్ స్ఫూర్తితో రాష్ట్రంలో వీవర్ శాలలకు ప్రణాళిక
* విశాఖలో రూ.172 కోట్లతో యూనిట్ మాల్ నిర్మాణం
అమరావతి (చైతన్య రథం) సీఎం చంద్రబాబు నేతృత్వంలో రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం రాకతో చేనేతల బతుకుల్లో వెలుగులు విరజిమ్ముతున్నాయి. ఏడాది కాలంనుంచి నేతన్నలు తన కాళ్ల మీద తామే నిలబడి, గౌరవప్రదమైన జీవనం సాగించేలా బృహత్తర కార్యక్రమాలకు నాంది పలికింది. ఒకవైపు నేతన్నలకు సంక్షేమ పథకాలు అందిస్తూనే, చేనేత ఉత్పత్తులకు మార్కెటింగ్ సదుపాయం కల్పించి వారి ఆర్థిక ఉన్నతికి వెన్నుదన్నుగా నిలుస్తోంది. రాష్ట్రంలో వ్యవసాయం తరవాత అత్యధికులు చేనేత రంగంపైనే ఆధారపడి జీవిస్తున్నారు. 2.5 లక్షలమంది వేనేత వస్త్రాల తయారీనే జీవనాధారంగా చేసుకున్నారు. ఏపీలో 986 చేనేత సహకార సంఘాలు నేతన్నలకు ఉపాధి కల్పిస్తున్నాయి. రాష్ట్రంలో చేనేత రంగం రూ.1,374 కోట్ల టర్నోవర్ కలిగి ఉంది. గత ప్రభుత్వ హయాంలో చేనేతలకు ప్రోత్సాహం కరవ్వడంతోపాటు ఉత్పత్తులకు మార్కెటింగ్ సదుపాయం కూడా లభించ. లేదు. దీంతో 2019-24 కాలంలో రాష్ట్ర చేనేత రంగంలో చీకటి కాలంగా మిగిలిపోయింది. సీఎం చంద్రబాబునాయుడు, యువగళం పాదయాత్ర ద్వారా మంత్రి నారా లోకేశ్ చేనేతల కష్టాలనుచూసి చలించి. పోయారు. అధికారంలోకిరాగానే నేతన్నలకు అండగా ఉంటామని భరోసానిచ్చారు. ఇచ్చిన హామీలను నిల బెట్టుకుంటూ అధికారంలోకి వచ్చిన మొదటి రోజు. నుంచే చేనేతలకు మేలు కలిగేలా నిర్ణయాలు తీసు కుంటున్నారు. ఎంఎస్ఎంఈ పార్కుల్లో నేతన్నలకు ప్రత్యేక యూనిట్లు కేటాయిస్తున్నారు. సీఎం చంద్రబాబునాయుడు నేతృత్వంలోని కూటమి రూ.10/వేల కోట్ల పెట్టుబడితో నూతన టెక్స్టైల్స్ పాలసీని తీసుకొచ్చింది. ఈ పాలసీ ద్వారా 1.51 లక్షల మందికి ఉపాధి కల్పించాలని లక్ష్యంగా పెట్టుకుంది.
11వ జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా నేతన్నలకు ఉచిత విద్యుత్ పథకం, చేనేత వస్త్రాలపై ఐదు శాతం మేర జీఎస్టీ మినహాయింపు. క్రిఫ్ట్ నిధులు మంజూరు పథకాలకు సీఎం చంద్రబాబునాయుడు శ్రీకారం దుడుతున్నారు. ప్రతి ఇంటి నుంచి ఒక వ్యాపారవేత్తను తయారు చేయాలన్న లక్ష్యంలో భాగంగా నేతన్నలను వ్యాపారులుగా తీర్చిదిద్దే కార్యక్రమానికి సీఎం చంద్రబాబు శ్రీకారం చుట్టారు.
నేతన్నకు 50 ఏళ్లకే రూ.4 వేల పింఛను
2024లో సీఎం సంద్రబాబు నేతృత్వంలో ఏర్పడిన ఎన్డీయే ప్రభుత్వం కూడా నేనేతలకు మరోసారి అండగా నిలిచింది. 50 ఏళ్లు నిండిన నేతన్నలకు ఎన్టీఆర్ భరోసా పింఛన్లు అందజేస్తున్నారు. 92,724 మంది నేతన్నలకు రూ.3 వేలనుంచి రూ.4 వేలకు పెన్షన్ మొత్తం పెంచారు. ఈ ఏడాది జూన్ వరకూ రూ.545.60 కోట్లు నేతన్నల పెన్షన్ల కోసం చంద్రబాబు ప్రభుత్వం వెచ్చించింది.
ముద్ర రుణాలు, నూలు సబ్సిడీ అందజేత
క్యాష్ క్రెడిట్ కార్డులతో సహకార సంఘాల బలోపేతానికి బ్యాంకు రుణాలు అందజేస్తోంది. గతేడాని 116 నేనేత సహకార సంఘాలకు రూ. 40.87 కోట్లను జిల్లా సహకార కేంద్ర బ్యాంకుల ద్వారా అందజేసింది. ఈ ఏడాది 110 సంఘాలకు రూ.37,76 కోట్లు రుణమివ్వడానికి నిర్ణయించింది. ప్రధాన మంత్రి చేనేత ముద్ర యోజన పధకం (ముద్ర) కింద నేతన్నలకు గతేడాది వర్కింగ్ కాపిటల్ నిమిత్తం రూ.33.25 కోట్లు అందించింది. 3,367 నేతన్నలకు రూ.50 వేలనుంచి రూ.2 లక్షల రుణ సదుపాయం కల్పించింది. ప్రస్తుత ఆర్థిక వ్యవస్థలో జూన్వరకు 294 మందికి రూ.2.57 కోట్లు మంజూరు చేసింది. ముడి పదార్థాల సరఫరా పథకం. నూలు కొనుగోలుపై కూటమి ప్రభుత్వం 15 శాతం సబ్సిడీ అందజేస్తోంది. సహకార సంఘాలకు, వ్యక్తిగతంగా పలువురు నేతన్నలకు రూ.164.24 కోట్ల విలువైన మాలును 15 శాతం నచ్సిడీపై ఇవ్వగా, దీనివల్ల లబ్దిదారులకు రూ.24.63 కోట్లమేర లబ్ధి కలిగింది. అంతర్జాతీయ మహిళా దినోత్సవం
సందర్భంగా 135 మంది స్వయం సహాయక సంఘాల్లో ఉన్న చేనేత మహిళలకు రూ.13,50 లక్షల విలువైన సూలును ఒక్కొక్కరికీ రూ.10 వేల చొప్పున కూటమి ప్రభుత్వం అందజేసింది.
క్లస్టర్లు, టెక్స్టైల్స్ సార్యుల ఏర్పాటు…
కేంద్ర ప్రభుత్వ సహకారంతో సీఎం చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం విశాఖపట్నంలో ఐదు ఎకరాల్లో రూ.172 కోట్లతో యూనిటీ మాల్ నిర్మిస్తోంది. రాష్ట్రంలో టెక్స్ట్సైటైల్స్ పార్టుల అభివృద్ధికి ప్రభుత్వం పెద్దపీట వేస్తోంది. ఎమ్మిగనూరుతో పాటు రాయదుర్గం, మైలవరం, పామిడిలోనూ టెక్స్టైల్స్ పార్యులు నిర్మించనుంది. ఎమ్మిగనూరు టెక్స్టైల్స్ పొర్యును 77 ఎకరాల్లో నిర్మాణానికి ప్రభుత్వం శంకుస్థాపన కూడా చేసింది. చీరాలలో హ్యాండ్లూమ్ పార్క్ తోపాటు టెక్స్టైల్స్ పార్కు కూడా ఏర్పాటు. చేయనుంది. మంగళగిరి మెగా టెక్స్టైల్ పార్కు నిర్మాణానికి ప్రభుత్వం చర్యలు చేపట్టింది. 2014-19లో రూ.50.15 కోట్లతో 54 క్లస్టర్లు ఏర్పాటు చేశారు. జాతీయ హ్యాండ్లూమ్ అభివృద్ధి ప్రోగ్రామ్ కింద 2024-25లో రూ.10.44 కోట్లతో 10 క్లస్టర్లు ఏర్పాటు చేస్తోంది. ఈ క్లస్టర్లతో 2,020 మంది లబ్దిపొందుతున్నారు. కేంద్ర ప్రభుత్వ సాయంతో శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరంలో రూ.38.21 కోట్లతో భారీ నేనేత క్లస్టర్ను రాష్ట్ర ప్రభుత్వం నిర్మిస్తోంది ఈ క్లస్టర్ వల్ల ప్రత్యక్షంగా, పరోక్షంగా 20 వేలమందికి లబ్ది చేకూరనుంది. మంగళగిరిలో మంత్రి నారా లోకేశ్ ఏర్పాటు చేసిన వీవరాల మాదిరిగా రాష్ట్రవ్యాప్తంగా వీవర్ శాలల ఏర్పాటుకు కూటమి ప్రభుత్వం నిర్ణయించింది.
రూ.80 కోట్లమేర ఆప్కో అమ్మకాలు
కాలనుగుణంగా నూతన వస్త్రాల తయారీ బరు జిల్లాల్లో నైపుణ్యాభివృద్ధి శిక్షణ కార్యక్రమాలు రాష్ట్ర ప్రభుత్వం చేపట్టింది. చేనేత వస్త్రాల విక్రయాలకు రాష్ట్రంతోపాటు దేశంలోని ఏడు సగరాల్లో ఎగ్జిబిషన్లు ఏర్పాటు చేసింది. ఆస్కో నేతృత్వంలో ఈ-కామర్స్ ద్వారా నేరుగా వినియోగదారుల ఇళ్ల వద్దకే చేనేత వస్త్రాలను డెలివరీ చేస్తోంది. ఏడాది కూటమి..
పాలనలో ఆస్కో షోరూమ్ల ద్వారా రూ.80 కోట్లమేర అమ్మకాలు జరిగాయి. ఈ-కామర్స్ ద్వారా రూ.40 లక్షలమేర అమ్మకాలు జరపడం విశేషం. నేరితరం అభిరుచులకు అనుగుణంగా చేనేత రెడీమేడ్ వస్త్రాల ను రూపొందించి ఆప్కోసోరూమ్ల ద్వారా అమ్మకాలు దేపట్టింది. ఏడాదిలో రాష్ట్రంలో ఐ ఆప్కో షోరూమ్ లను ప్రభుత్వం ప్రారంభించింది. నేతన్నలకు 365 రోజులపాటు పనిదినాలు కల్పించదంతో పాటు చేనేత ఉత్పత్తులకు మార్కెటింగ్ కల్పించడానికి టాటా తనేరియా, కార్యం బిర్లా గ్రూప్, తమిళనాడుకు చెందిన కో-ఆప్టెక్ట్స్ నూ ఒప్పందం చేసుకుంది.
ఓడీఓపీ అవార్డుల వెల్లువ
‘రాష్ట్రంలో చేనేతరంగ అభివృద్ధికి సీఎం. చంద్రబాబు తీసుకుంటున్న చర్యలు సత్ఫలితాలిస్తు న్నాయి. ఇందుకు నిదర్శనమే వన్ డ్రిస్టిక్- వన్ ప్రొరెక్ట్ (ఓడీఓపీ) ఆవార్డులు, కేంద్ర ప్రభుత్వం 29 ఓడీఓపీ అవార్డులు ప్రకటిస్తే, అందులో 9 అవార్డులు ఏపీకే సొంతమయ్యాయి. వాటిలో శిఅవార్డులు చేనేత ఉత్పత్తులకు దక్కాయి. ఓడీఓపీ రాష్ట్రస్థాయి అవార్డుల్లో ఏదీ బంగారు పతకం సాధించింది. భవిష్యత్తులో మరిన్ని ఓడీఓపీ అవార్డుల సాధనే ధ్యేయంగా చేనేత కార్మికులకు నైపుణ్యం పెంపుదలకు శిక్షణ కార్యక మాలు, తయారైన ఉత్పత్తులకు జీఐ ట్యాగ్ గుర్తింపు నకు పెద్దపీట వేస్తోంది. 20చేనేత ఉత్పత్తులకు జీఐ ట్యాగ్ కోసం రూ.24 లక్షలు వెచ్చిస్తోంది.
నూతన డిజైన్లకు ప్రోత్సాహం
ప్రస్తుత పోటీ ప్రపంచంలో చేనేత వస్త్రాల వినియోగం పెంచడానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. దీనిలో భాగంగా నేతన్నలకు ప్రత్యేక శిక్షణా కార్యక్రమాలు నిర్వహిస్తోంది. ఏపీ స్కిల్ డవలప్ మెంట్ కార్పొరేషన్ ద్వారా అయిదు జిల్లాల్లో నైపుణ్య శిక్షణలు నిర్వహించగా 180 మంది లబ్ధి పొందారు. చేనేత కార్మికుల్లో నైపుణ్యాన్ని వెలికి తీసే ఉద్దేశంతో, నూతన డిజైన్లపై దరఖాస్తులను కూటమి ప్రభుత్వం నేతన్నల నుంచి ఆహ్వానించింది. ఉత్తమ డిజైన్లకు రూ.5 లక్షల వరకూ బహనుతులు అందజేయనుంది.
నేడు 3 పథకాలకు సీఎం చంద్రబాబు శ్రీకారం
జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేర్పుతూ, సీఎం చంద్రబాబు నాయుడు చేనేత కార్మికులకు 200 యూనిట్లు, మరమగ్గాలకు 500 యూనిట్లు ఉచిత విద్యుత్నచ్చే పధకానికి గురువారం శ్రీకారం చుడుతున్నారు. చేనేత దుస్తులపైనా 5శాతం జీఎస్టీ మినహాయింపు పధకాన్ని ప్రారంభిస్తున్నారు. చేనేతలకు రూ. 5మేర త్రిఫ్ట్ నిధులు మంజూరు చేస్తున్నారు. ఉచిత విద్యుత్ కోసం ఏడానికి రూ.190కోట్లను రాష్ట్రప్రభుత్వం వెచ్చిస్తోంది. జీఎస్టీ మినహాయింపునకు ఏడాదికి రూ.15 కోట్లను నేతన్నలకు చెల్లించాలని నిర్ణయించింది. ఉచిత విద్యుత్ పథకంతో మగ్గాలపై నేసే నేతన్నలకు నెలకు 1,233ల చొప్పున్న ఏడానికి రూ.14,956లు, మర మగ్గాలపై ఆధారపడిన వారికి నెలకు రూ.2,7176 చొప్పున ఏడాదికి 32,604ల మేర లబ్ది కలగనుంది. దేనేత కుటుంబాలకు త్వరలో ఆరోగ్య బీమా పధకం వర్తింప జేయడానికి ప్రణాళికలు రూపొందించింది. త్వరలో చేనేత సహకార సంఘాల ఎన్నికలు నిర్వహించడానికి ఏర్పాట్లు చేపట్టింది.