- ఉప ముఖ్యమంత్రి పవన్‌కు ఐదు ప్రధాన శాఖలు
- మిత్రపక్షాలకు సముచిత స్థానం కల్పించిన చంద్రబాబు
- యువనేత లోకేష్‌కు విద్య (హెచ్‌ఆర్‌డి), ఐటీ, ఆర్టీజీ
- అచ్చెన్నకు వ్యవసాయం, పయ్యావుల కేశవ్‌కు ఆర్థికం
- వంగలపూడికి హోం.. నాదెండ్లకు పౌరసరఫరాలు
- అనగానికి రెవిన్యూ, నిమ్మలకు జలవనరులు
అమరావతి (చైతన్య రథం): ఆంధ్రప్రదేశ్‌లో కొత్తగా కొలువైన మంత్రివర్గంలో ఎవరికి ఏయే శాఖలన్న ఉత్కంఠకు తెరదించుతూ శుక్రవారం మధ్యాహ్నం ముఖ్యమంత్రి చంద్రబాబు శాఖల కేటాయించారు. కూటమి భాగస్వామ్యపక్షాలైన జనసేన, బీజేపీలకు శాఖల కేటాయింపులో సముచిత స్థానాన్ని కల్పిస్తూ.. కూటమి గౌరవాన్ని ఇనుమడిరప చేశారు. జనసేన అధినేత పవన్ కల్యాణ్‌కు ఉప ముఖ్యమంత్రి పదవితోబాటు ఐదు కీలక శాఖలకు కేటాయించడం ద్వారా కేబినెట్‌లో పవన్ ప్రాధాన్యతను చెప్పకనే చెప్పారు. అదే పార్టీనుంచి మంత్రివర్గంలోకి తీసుకున్న మరో ఇద్దరికీ ప్రాధాన్యత కలిగిన శాఖలిస్తూనే.. బీజేపీనుంచి మంత్రి వర్గంలోకి తీసుకున్న సత్యకుమార్ యాదవ్‌కూ ప్రాధాన్యత కలిగిన శాఖనిచ్చారు. ఇప్పటికే మంత్రివర్గంలో యువరక్తానికి చోటిచ్చిన చంద్రబాబు, తొలిసారి మంత్రులైన వాళ్లకూ తగు ప్రాముఖ్యతనిచ్చారు. మొత్తంమీద శాఖల కేటాయింపులో సానుకూలత మెచ్చదగ్గదన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
ఎవరెవరికి ఏయే శాఖలు..?
సాధారణ పరిపాలన, శాంతిభద్రతలు, పబ్లిక్ ఎంటర్‌ప్రైజెస్, మంత్రులకు కేటాయించని ఇతర శాఖలను చంద్రబాబు తన వద్ద అట్టేపెట్టుకున్నారు. మిత్రపక్షమైన జనసేన అగ్రనేత పవన్‌కల్యాణ్‌కు ఉప ముఖ్యమంత్రి పదవితోపాటు పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ నీటి సరఫరా, అటవీ -పర్యావరణం, శాస్త్ర సాంకేతికత శాఖలను కేటాయించారు. యువనేత, పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌కు విద్య (మానవ వనరుల అభివృద్ధి)Ñ ఐటీ, ఎలక్ట్రానిక్స్ మరియు కమ్యూనికేషన్స్Ñ ఆర్టీజీ (రియల్ టైం గవర్నెన్స్) శాఖలను కేటాయించారు. జగన్ లోపభూయిష్ట విధానాలతో భ్రష్టుపట్టిన విద్యాశాఖను గాడిన పెట్టే బృహత్తర బాధ్యత యువనేత లోకేష్‌కు అప్పగించినట్టయ్యింది. అలాగే, గత ఐదేళ్ల జగన్ రాక్షస పాలనలో ఎన్నో ఆటుపోట్లు, అవమానాలను భరిస్తూ పార్టీ కోసం అలుపెరుగని పోరాటాలు చేసిన వంగలపూడి అనితకు కీలకమైన హోంశాఖ దక్కింది. ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన మహిళకు హోంశాఖను కేటాయించి దళితుల ప్రాధాన్యతను పెంచారు చంద్రబాబు. అదేవిధంగా కష్టకాలంలో అటు అసెంబ్లీలోనూ, ఇటు బయటా పార్టీకోసం శ్రమించి, పాపులర్ లీడర్‌గా, హ్యాట్రిక్ ఎమ్మెల్యేగా గుర్తింపు తెచ్చుకున్న నిమ్మల రామానాయుడుకి జలవనరుల శాఖను కేటాయించారు. వ్యవసాయాధార ప్రాంతమైన రాష్ట్రంలో నీటిపారుదల రంగాన్ని అభివృద్ధి చేసి వృద్ధిరేటు పెంపునకు బాటలు వేయాలన్న ఆలోచన ముఖ్యమంత్రిది. అంతటి ప్రాముఖ్యత కలిగిన శాఖ కష్టించే తత్వమున్న నిమ్మలకు దక్కడం సముచితమే.
అన్నదాతల బాధ్యత అచ్చెన్నది
తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడికి వ్యవసాయ శాఖను కేటాయిస్తేÑ పార్టీ సీనియర్ నాయకుడు, అనంతపురం జిల్లా ఉరవకొండ ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్‌కు అత్యంత ప్రాధాన్యత కలిగిన ఆర్థిక శాఖను కేటాయించారు. గతంలో వైసీపీ హయాంలో పయ్యావుల ప్రజా పద్దుల కమిటీ (పీఏసీ) చైర్మన్‌గా పనిచేసిన అనుభవముంది. అదేవిధంగా సుదీర్ఘ కాలం రాజకీయాల్లోనూ ఉన్నారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై పూర్తి అవగాహనవున్న పయ్యావులకు ఆర్థిక శాఖతోపాటు ప్రణాళిక, వాణిజ్య పన్నులు, శాసనసభ వ్యవహారాల బాధ్యతలు అప్పగించడంపై హర్షం వ్యక్తమవుతోంది.
వైసీపీనుంచి వచ్చినా….
వైసీపీనుంచి వచ్చిన సీనియర్ నాయకుడు, నెల్లూరు జిల్లా ఆత్మకూరు ఎమ్మెల్యే ఆనం రామనారాయణ రెడ్డికి దేవాదాయ శాఖను కేటాయించారు. రోశయ్య, కిరణ్‌కుమార్‌రెడ్డి జమానాలో ఆర్థికమంత్రిగా చేసిన అనుభవం ఉన్నప్పటికీ, నవ్యాంధ్రను ఆధ్యాత్మిక పర్యాటక ప్రాంతంగా తీర్చిదిద్దాలన్న ప్రభుత్వ సంకల్పం నేపథ్యంలో.. ఆనంకు దేవాదాయ శాఖను అప్పగించారు. అలాగే, వైసీపీనుంచి ఎన్నికలకు ముందు జంప్ చేసి టీడీపీ బాటపట్టిన కొలుసు పార్థసారథికీ.. చంద్రబాబు ప్రాధాన్యమున్న పదవినే అప్పగించి, తారతమ్యాలు చూపని కేబినెట్‌గా ప్రతిష్ట పెంచారు. కొలుసుకు గృహనిర్మాణంతోబాటు సమాచార శాఖను అప్పగిస్తూ.. రానున్న ఐదేళ్లలో పేదలకు ఇళ్లు కట్టించి ఇస్తామన్న చంద్రబాబు హామీని సాకారం చేసే అవకాశం కల్పించారు.
మిత్రపక్షమైన జనసేన నుంచి నాదెండ్ల మనోహర్‌కు ఆహార, పౌర సరఫరాలు, వినియోగదారుల వ్యవహారాల శాఖనుÑ కందుల దుర్గేష్‌కు పర్యాటక, సాంస్కృతికం, సినిమాటోగ్రఫీ శాఖలను కేటాయించారు. మరో మిత్రపక్షమైన బీజేపీనుంచి సత్యకుమార్ యాదవ్‌కు ఆరోగ్యం, కుటుంబ వైద్యం మరియు వైద్య విద్యను కేటాయించారు. ఇక తెలుగుదేశం నుంచి అనగాని సత్యప్రసాద్‌కు రెవిన్యూ, స్టాంపులు మరియు రిజిస్ట్రేషన్Ñ కొల్లు రవీంద్రకు గనులు, భూగర్భ శాఖ, అబ్కారీ శాఖలను కేటాయించారు. పొంగూరు నారాయణకు మరోసారి పురపాలక మరియు పట్టణాభివృద్ధి శాఖÑ పార్టీ సీనియర్ ఎన్‌ఎండి ఫరూక్‌కు లా మరియు జస్టిస్, మైనారిటీ సంక్షేమంÑ డోలా బాలవీరాంజనేయ స్వామికి సాంఘిక సంక్షేమం, దివ్యాంగులు, వయోవృద్ధుల సంక్షేమం, సచివాలయం, విలేజ్ వలంటీర్Ñ గొట్టిపాటి రవికి కీలకమైన విద్యుత్ శాఖను కేటాయించారు. బీసీ జనార్థన్‌రెడ్డికి రోడ్లు, భవనాలు, మౌలిక సదుపాయాలు, పెట్టుబడులుÑ టీజీ భరత్‌కు పరిశ్రమలు మరియు వాణిజ్యం, ఆహారశుద్ధిÑ ఎస్ సవితకు బీసీ సంక్షేమం, ఆర్థికంగా వెనుకబడిన వర్గాల సంక్షేమం, హ్యాండ్లూమ్స్ అండ్ టెక్స్‌టైల్స్Ñ వాసంశెట్టి సుభాష్‌కు కార్మిక, కర్మాగార, బాయిలర్స్, వైద్య బీమా సేవలుÑ కొండపల్లి శ్రీనివాస్‌కు ఎంఎస్‌ఎంఈ, సెర్ప్, ఎన్‌ఆర్‌ఐ సాధికారత` సంబంధాలుÑ ఎం రాంప్రసాద్ రెడ్డికి రవాణాÑ యువజన క్రీడా శాఖలు కేటాయించారు.