- తక్షణమే వైద్య, ఆర్థికసాయం
- సింహాచలం ఘటన దురదృష్టకరం
- వైసీపీ నికృష్ట రాజకీయాలు హేయం
- టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు
విశాఖపట్నం(చైతన్యరథం): సింహాచలం ఆలయ పరిసరాల్లో గోడ కూలిన ఘట నపై టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు, గాజువాక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు స్పందించారు. ఘటనపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఎనిమిది మంది భక్తులు ప్రాణాలు కోల్పో వడం తీవ్ర విషాదకరం. బాధిత కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతి తెలియ జేస్తున్నాను. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. ఈ ఘటనపై ముఖ్యమంత్రి బాధ్యతతో వెంటనే స్పందించారని, మృతుల కుటుంబాలకు ఒక్కొక్కరికి రూ.25 లక్షల ఎక్స్‌గ్రేషియా ప్రకటించి గాయపడిన వారికి అత్యుత్తమ వైద్యం అంది స్తున్నట్లు వివరించారు. ఈ ప్రమాదానికి కారణమైన నిర్మాణ లోపాలపై తక్షణమే విచా రణకు ఆదేశించారని తెలిపారు. ఎవరు బాధ్యులైనా కఠిన చర్యలు తప్పవు. భవిష్యత్తు లో ఇటువంటి ప్రమాదాలు పునరావృతం కాకుండా రాష్ట్రవ్యాప్తంగా అన్ని దేవస్థానా ల్లో భద్రతా సమీక్ష చేపడతామని తెలిపారు. ప్రకృతి విపత్తుల వంటి విషాద ఘటన లను కూడా రాజకీయం చేయడం వైసీపీకి అలవాటేనని, బాధిత కుటుంబాల బాధను రాజకీయ లబ్ధికోసం వాడటం శోచనీయ మని విమర్శించారు. విషాదాన్ని కూడా ప్రభుత్వంపై దుష్ప్రచారానికి వేదికగా మార్చే వైఖరిని ప్రజలు ఎప్పటికీ క్షమించరు. వారి రాజకీయం ఎంతస్థాయి దిగజారిందో వారి తీరే నిదర్శనమని హితవుపలికారు.