- ప్రాజెక్ట్ పనులకు రూ.106 కోట్లు విడుదల
- ఎస్సీఎల్ కంపెనీకి రూ.29.38 కోట్ల పనులు
- గత ప్రభుత్వంలో పూర్తి కాకుండానే జాతికి అంకితం
- ఐదేళ్ల పాలనలో 5 శాతం పనులు కూడా చేయని వైనం
- ఒక్క చంద్రబాబు హయాంలోనే 80 శాతం పనులు పూర్తి
- 2026 జూన్ నాటికి ఆయకట్టుకు నీరందించేలా వేగవంతం
ప్రకాశం, నెల్లూరు, కడప జిల్లాల వరప్రదాయని పూలసుబ్బయ్య వెలిగొండ ప్రాజెక్ట్ కు మూడు దశాబ్ధాల క్రితం నల్లమల్ల అడవులో అంకురార్పణ చేసిన సీఎం చంద్ర బాబు..నేడు ప్రాజెక్టును పూర్తి చేసే దిశగా పనుల్లో వేగం పెంచారు. గత ప్రభుత్వాల తప్పుల వల్ల ప్రాజెక్ట్ పనుల్లో ఆలస్యం జరిగింది. నిధులు కేటాయించకుండా నిర్లక్ష్యం వహించారు. నేడు కూటమి ప్రభుత్వం ప్రాజెక్ట్ నిర్మాణానికి ఉన్న అడ్డంకులను తొలగించి పనులు చేయని పాత కాంట్రాక్టర్లను ఏరివేసి కొత్త వారికి పనులు అప్పగించి త్వరగా పూర్తి చేసేందుకు చర్యలు తీసుకుంది. ఇప్పటికే సీఎం చంద్రబాబు వెలిగొండ ప్రాజెక్ట్‌పై సమీక్ష నిర్వహించి పనుల పురోగతిని తెలుసుకున్నారు. త్వరలో ప్రాజెక్ట్‌ను సందర్శించను న్నట్లు అధికారులకు తెలిపారు. జలవనరుల శాఖ మంత్రి ఇప్పటికే వెలిగొండ ప్రాజెక్ట్ ను సందర్శించి పనులు పరిశీలించారు. వెలిగొండ ప్రాజెక్ట్ పూర్తి కాకుండానే జాతికి అంకితం చేసిన జగన్‌రెడ్డి చేష్టలను చూసి రాష్ట్ర ప్రజలంతా నవ్వుకున్నారు. వెలిగొండ నిర్వాసితులకు ఒక్క రూపాయి కూడా చెల్లించని వైసీపీ.. ప్రాజెక్ట్ పూర్తి చేసినట్టు తప్పుడు ప్రచారం చేసి పరువు పోగొట్టుకుంది. కూటమి ప్రభుత్వం ఈ 11 నెలల్లో ప్రాజెక్టుకు రూ.759 కోట్లు కేటాయించింది. 2026 జూన్ నాటికి వెలిగొండ ఆయకట్టు రైతాంగాని కి సాగునీరందించేలా నిర్మాణ పనులు జరుగుతున్నాయి. తాజాగా నల్లమల సాగర్ జలా శయంలో నీళ్లు నింపేందుకు వీలుగా వెలిగొండ టన్నెళ్ల నుంచి నీళ్లు తీసుకువెళ్లే కాలువ ల్లో అవసరమైన పనులు చేసేందుకు ప్రభుత్వం రూ.106.39 కోట్లు విడుదల చేసింది. ప్రాజెక్ట్ పనులు వేగంగా పూర్తి చేసేలా పాలనామోదం ఇచ్చారు.
లక్షల ఎకరాలకు సాగునీరు, లక్షలాది మందికి తాగునీరు
కృష్ణా జలాలను ప్రకాశం, నెల్లూరు, కడప జిల్లాలకు తరలించాలనే సంకల్పంతో 1996 మార్చి 5న సీఎం చంద్రబాబు పూలసుబ్బయ్య వెలిగొండ ప్రాజెక్ట్ పనులకు పునాది వేశారు. శ్రీశైలం రిజర్వాయర్ ఫోర్ షోర్ కుడిగట్టు ద్వారా గ్రావిటీతో కృష్ణా నది నుంచి 43.50 టీఎంసీల వరద జలాలను వినియోగించుకుని ప్రకాశం, నెల్లూరు, కడప జిల్లాల్లో 4.47 లక్షల ఎకరాలకు సాగునీటికి ఉపయోగించనున్నారు. అలాగే 30 ఫ్లోరైడ్ ప్రభావిత మండలాలలోని 15.25 లక్షల మందికి తాగునీరు అందించడం ముఖ్య ఉద్దే శం. ఈ ప్రాజెక్టులో భాగంగా కృష్ణా నది వరద జలాలను ముందుగా 200 మీటర్ల అప్రో చ్ కాలువతో పారిస్తారు. అక్కడి నుంచి 18.8 కి.మీ పొడవున రెండు భారీ సొరంగాలను తవ్వారు. ఆసియాలోనే అతిపెద్ద సాగునీటి సొరంగాలుగా ఇవి పేరొందాయి. దోర్నాల-కర్నూలు మార్గంలోని కొత్తూరు వరకు తవ్విన ఈ రెండు టన్నెళ్ల ద్వారా రోజుకు ఒక టీఎంసీ నీటిని తరలించొచ్చు. కొత్తూరు నుంచి సుమారు 22 కి.మీ దూరంలో ఉన్న ‘నల్లమల సాగర్’కు కాలువ ద్వారా నీటిని తరలిస్తారు. ఈ జలాశయం నుంచి ఐదు ప్రధాన కాల్వల ద్వారా నిర్దేశిత ప్రాంతాలకు నీటిని అందిస్తారు.
టీడీపీ హయాంలో రూ.1,319 కోట్లు ఖర్చు
2014-19 మధ్య చంద్రబాబు ప్రభుత్వం రూ.1,973 కోట్లు కేటాయించి రూ.1,319 కోట్లు ఖర్చు చేసింది. టన్నెల్-1 పూర్తయినా దానిలో 1.20 లక్షల క్యూబిక్ మీటర్ల మట్టిని టన్నెల్ -2 నుంచి తోలారు. దీనిని తొలగించాలంటేనే ఆరు నెలలు పడుతుంది. టన్నెల్-2లో ఇంకా 7 కిలోమీటర్ల మేర లైనింగ్ పనులు పెండిరగ్‌లో ఉన్నాయి. అదే టన్నెల్‌లోకి 11 కిలోమీటర్ల లైనింగ్ పూర్తికావడానికి 11 ఏళ్లు పట్టింది. ఈ టన్నెళ్ల నుంచి నీటిని జలాశయానికి తరలించాలంటే 21 కిలోమీటర్ల ఫీడర్ కెనాల్ పూర్తికావాలి. సీఎం చంద్రబాబు హయాంలోనే వెలిగొండ ప్రాజెక్ట్ పనులు 80 శాతాని కిపైగా పూర్తి చేశారు. 2019లో మరోసారి అధికారంలోకి వచ్చి ఉంటే ప్రాజెక్ట్ పూర్తయి ఉండేది. కానీ గత ప్రభుత్వ మొండివైఖరి కారణంగా ప్రాజెక్ట్ పనుల్లో ఒక్క అడుగు పురో గతి కూడా జరగలేదు.
ప్రాజెక్ట్ పూర్తి కాకుండానే జాతికి అంకితం
వైసీపీ ప్రభుత్వం ఐదేళ్ల పాలనలో రాష్ట్రంలోని అన్ని ప్రాజెక్ట్‌లను అటకెక్కించింది. అలాగే వెలిగొండ ప్రాజెక్టును నిర్లక్ష్యం చేసింది. ఐదేళ్ల పాలనలో 5 శాతం పనులు చేసి మమ అనిపించింది. అంతేకాకుండా ప్రాజెక్ట్‌ను పూర్తి చేయకుండానే జగన్‌రెడ్డి జాతికి అంకితం చేయడం ఆశ్చర్యానికి గురిచేసింది. ఐదేళ్ల కాలంలో వెలిగొండ నిర్వాసితుల పునరావాసానికి రూపాయి కూడా కేటాయించకపోవడం, పనులు పూర్తి చేయకుండా ప్రాజెక్ట్‌ను జాతికి అంకితం చేయడం ఏంటని ప్రజలు విస్తుపోయారు. వైసీపీ హయాంలో కేవలం రూ.170 కోట్లు మాత్రమే వెలిగొండ ప్రాజెక్ట్ కోసం ఖర్చు చేస్తే.. అందులో రూ.50 కోట్ల బిల్లులను జగన్ తన బంధువులైన కడప జిల్లాకు చెందిన కాంట్రాక్టర్లకు చెల్లించారు. చంద్రబాబు హయాంలో 80 శాతం పనులు చేస్తే..వైసీపీ హయాంలో కేవ లం 5 శాతం పనులే చేసి ప్రాజెక్టును నిర్లక్ష్యం చేసింది. అలాగే ఆర్‌ఆర్ ప్యాకేజీ కింద నిర్వాసితులకు రూ.880 కోట్లు ఇవ్వాల్సి ఉండగా ఒక్క రూపాయి కూడా కేటాయిం చలేదు. ఇలా ఒక్క వెలిగొండ ప్రాజెక్ట్‌నే కాకుండా రాష్ట్రంలోని ఇతర ప్రాజెక్టుల నిర్మా ణాలను వైసీపీ ప్రభుత్వం నీరుగార్చింది. ఫలితంగా ప్రాజెక్టుల నిర్మాణ వ్యయం వేల కోట్ల పెరిగి..ఆ భారమంతా నేడు ప్రజలపై పడిరది.
నల్లమల సాగర్ నిర్మాణం కీలకం
ప్రకాశం జిల్లాలోని నల్లమల పర్వత శ్రేణులకు సమాంతరంగా, వెలుపల ఉన్న కొండలను వెలుగొండలు అని పిలుస్తారు. ఈ వెలుగొండ కొండల శ్రేణిలోని సుంకేసుల, గొట్టిపడియ, కాకర్ల వద్ద కొండల మధ్య ఖాళీలను కలుపుతూ గోడల తరహాలో ఆనకట్ట లు కట్టడంతో 43.50 టీఎంసీల సామర్థ్యంతో సహజమైన నల్లమల సాగర్ రిజర్వాయ ర్ ఏర్పాటైంది. ఈ రిజర్వాయర్‌లో 10.35 టీఎంసీలు డెడ్ స్టోరేజీ కాగా.. 38.57 టీఎంసీలను పంటల సాగుకు, 1.57 టీఎంసీలను తాగునీటి కోసం వినియోగిస్తారు. 3.37 టీఎంసీల నీటిని ఆవిరి రూపంలో నష్టపోతామని అంచనా. వెలిగొండ ప్రాజెక్టులో భాగంగా నల్లమలసాగర్ జలాశయంలో నీళ్లు నింపేందుకు వీలుగా వెలిగొండ టన్నెళ్ల నుంచి నీళ్లు తీసుకువెళ్లే కాలువల్లో అవసరమైన పనులు చేసేందుకు రూ.106.39 కోట్లతో పాలనామోదం ఇచ్చారు. ఈ మేరకు జలవనరుల శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ప్యాకేజీ 2, 4లలో మిగిలిన పనులు చేపట్టేందుకు ఉత్తర్వులు ఇచ్చారు. ఇందులో భాగం గా ఫీడర్ కాలువ, తీగలేరు కాలువల్లో మిగిలిపోయిన ప్రధాన పనులు 2022-23 ధరలతోనే చేపట్టేందుకు మేఘా కంపెనీకి అప్పగిస్తూ ఆదేశాలు ఇచ్చారు. రూ.53.44 కోట్ల విలువైన పనులు వారికి అప్పగించారు. మరో రూ.29.38 కోట్ల విలువైన పనులు ఎస్సీఎల్ కంపెనీకి అప్పగిస్తూ ఆదేశాలు ఇచ్చారు.
వచ్చే ఏడాది జూన్ నాటికి ఆయకట్టు రైతులకు నీరు
వెలిగొండ రిజర్వాయర్ నుంచి 2026 జూన్ నాటికి ఆయకట్టు రైతులకు సాగు నీరందించే లక్ష్యంతో ప్రభుత్వం ఉంది. వెలిగొండ పూర్తవ్వాలంటే ఇంకా రూ.4 వేల కోట్లు కావాల్సి ఉంది. కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టిన అనంతరం వెలిగొండ ప్రాజెక్టు పనుల్లో వేగం పెరిగింది. టన్నెల్‌లో ఉన్న టీబీఎం యంత్రం తొలగించడానికి కోర్టు కేసు అడ్డంకిగా ఉన్న నేపథ్యంలో బైపాస్ టన్నెల్ నిర్మాణం సాధ్యాసాధ్యాలపై అధి కారులు చర్చించారు. హెడ్ రెగ్యులేటర్, టన్నెల్, ఫీడర్ కాలువలు, పునరావాస కాలనీల నిర్మాణ పనులు వేగవంతం చేస్తున్నారు.
` ప్రవీణ్ బోయ, అనలిస్ట్