తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు జన్మదినోత్సవం రాష్ట్రవ్యాప్తంగా ఘనంగా నిర్వహంచారు. ముఖ్యమంత్రిగా ఉమ్మడి, ప్రత్యేక ఆంద్రప్రదేశ్‌కు చేసిన సేవలు టిడిపి కార్యకర్తలు, నాయకులు గుర్తు చేసుకున్నారు. 2024లో చంద్రబాబే సీఎం కావాలని ప్రతినబూనారు. భావితరాల భవిష్యత్ చంద్రబాబే పలువురు ప్రశంసించారు. ఆంధ్ర రాష్ట్రానికి చంద్రబాబు లాంటి వ్యక్తి సీఎంగా ఉండటం అవసరం అని రాష్ట్ర ప్రజానీకం కోరుకుంటున్నారు. సైకో వద్దు… సైకిల్ ముద్దు అని నినదించారు. రాష్ట్రవ్యాప్తంగా పలు సేవా కార్యక్రమాలు నిర్వహించారు. సామాజిక చైతన్య ర్యాలీలు నిర్వహించారు. చంద్రబాబు నిండు నూరేళ్లు వర్థిల్లాలని దీవించారు.
శుభాకాంక్షలు తెలిపిన పరిటాల సునీత
మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడుకి మాజీ మంత్రి పరిటాల సునీత గురువారం పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా పరిటాల సునీత మాట్లాడుతూ. ఎంతో ముందు చూపు, విజన్ ఉన్న మహోన్నతమైన నాయకుడు చంద్రబాబు అని సునీత అన్నారు. 2024లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయి రాష్ట్రాన్ని అందరి సహకారంతో అభివృద్ధిలో ముందుకు తీసుకెళ్లాలని ఆమె అన్నారు. దేవుని చల్లని దీవెనలు, చంద్రబాబుపై ఉండాలని ఆమె ఆకాంక్షించారు.
చీరాల నియోజకవర్గంలో…
దార్శనికుడు, సంపద సృష్టికర్త, నారా చంద్రబాబు నాయుడు ఒక్కరే భావితరాలకు భవిష్యత్తు అని చీరాల నియోజకవర్గ టిడిపి నాయకుడు సజ్జా వెంకటేశ్వర్లు అన్నారు. చంద్రబాబు 73వ జన్మదిన వేడుకలను ఆయన గురువారం ఘనంగా నిర్వహించారు. 40 ఏళ్ల సుదీర్ఘ రాజకీయ అనుభవంతో ఆంధ్ర రాష్ట్రానికి ప్రపంచ స్థాయి గుర్తింపు తెచ్చిన మహానేత బాబు అని అయన అన్నారు. సమాజమే దేవాలయం, ప్రజలే దేవుళ్ళు అన్న స్వర్గీయ ఎన్టీ రామారావు ఆశయ వారసత్వాన్ని ముందుకు తీసుకెళ్లి ప్రపంచ దేశాల్లో తెలుగువారికి ప్రత్యేక గౌరవాన్ని తీసుకొచ్చిన చంద్రబాబు నాయుడు అవసరం ప్రస్తుత పరిస్థితుల్లో రాష్ట్రానికి ఎంతయినా ఉందన్నారు. వైసీపీ రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో దిగజార్చిన పరిస్థితులు చూస్తున్నామన్నారు. ఈ సందర్భంగా పేద ముస్లిం షేక్ ఆదాంబి కి వ్యాపార నిమిత్తం తోపుడు బండిని ఆయన బహుకరించారు. అనంతరం దేశాయిపేటలోని సత్రం మల్లేశ్వరరావు అనాధ వృద్ధాశ్రమంలోని వృద్ధులకు చీరలు పంపిణీ చేశారు. చంద్రబాబు పుట్టినరోజు సందర్భంగా వృద్ధుల సమక్షంలో కేక్ కట్ చేసి చంద్రబాబుకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈమని బాలు, రాయల శేషయ్య, గుత్తి శివయ్య, కరీముల్లా, వంక హరికృష్ణ, సజ్జ రవికుమార్, స్వామి పాల్గొన్నారు.
రామకుప్పంలో…
మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు జన్మదినం సందర్భంగా రామకుప్పంలో టీడీపీ నాయకులు గురువారం ఘనంగా జన్మదిన వేడుకలను నిర్వహించారు. వైయస్సార్ సర్కిల్ నుండి పోలీస్ స్టేషన్ వరకు భారీ ర్యాలీ నిర్వహించిన అనంతరం కేక్ కోసి పంచిపెట్టారు. ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షుడు ఆనంద్ రెడ్డి, మాజీ అధ్యక్షుడు ఆంజనేయులు రెడ్డి, రాష్ట్ర, జిల్లా, మండల స్థాయి పార్టీ నాయకులు, కార్యకర్తలు భారీగా పల్గొని చంద్రబాబుకు జన్మదిన శుభాకాంక్షలు తెలియచేశారు.
గిద్దలూరులో
ప్రకాశం జిల్లా గిద్దలూరు టిడిపి కార్యాలయంలో గురువారం టిడిపి ఇన్చార్జ్ ముత్తుకూరు అశోక్ రెడ్డి ఆదేశాల మేరకు స్థానిక టిడిపి నాయకులు మాజీ ముఖ్యమంత్రి తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు పుట్టినరోజు వేడుకలను కార్యకర్తలు నాయకులు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు కేక్ కట్ చేసి చంద్రబాబు నాయుడుకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. అభివృద్ధి అనే పదాన్ని తన చిరునామాలు గా మార్చుకున్న చంద్రబాబు నాయుడు మరింతకాలం జీవించాలని కోరుకుంటున్నట్లు వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక టిడిపి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.
పలమనేరులో..
తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి 73వ జన్మదిన వేడుకలు పలమనేరులో గురువారం ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా నియోజకవర్గంలోని మండల కేంద్రాలతో పాటు పట్టణం మరియు తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో జన్మదిన వేడుకలను ఆ పార్టీ నాయకులు నిర్వహించారు. ఈ సందర్బంగా పెద్ద ఎత్తున టపాకాయలు పేల్చి భారీ కేకును కట్ చేసి వేడుకలు జరుపుకున్నారు. అనంతరం మాజీ ముఖ్యమంత్రిగా చంద్రబాబు ఉమ్మడి రాష్ట్రంలో మరియు నవ్యంధ్రప్రదేశ్ లో చేపట్టిన సంక్షేమ మరియు అభివృద్ధి కార్యక్రమాలను వివరించారు. ఆయన నాయకత్వంలో తెలుగుదేశం పార్టీలో పనిచేయడం ఎంతో సంతోషదాయకమనే నాయకులు కొనియాడారు.