అమరావతి (చైతన్యరథం): మాజీ మంత్రి నందమూరి హరికృష్ణ జయంతి సందర్భంగా ఆయన సోదరుడు, హిందూపూర్ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ నివాళులర్పించారు. తెలుగునేల నాలుగు చెరగులా గ్రామ గ్రామాన పర్యటించి.. అశేష ప్రజలతో, అభిమానులతో చైతన్య రథసారధిగా పెనవేసుకున్న ప్రేమాభిమానాల పెన్నిధి.. మా అన్న స్వర్గీయ నందమూరి హరికృష్ణ జయంతి సందర్భంగా.. వారికి నా హృదయపూర్వక నివాళులు అర్పిస్తున్నానన్నారు.