అమరావతి (చైతన్య రథం): రాష్ట్రంలో స్వయం సహాయ సంఘాల మహిళలకు ఆర్ధిక స్వావలంబన కల్పించే దిశగా వివిధ సంస్థలతో సెర్ప్, మెప్మా సంస్థల ఒప్పందాలు కుదుర్చుకున్నాయి. అమరావతి పరేడ్ గ్రౌండ్స్ అంతర్జాతీయ మహిళా దినోత్సవం రాష్ట్రస్థాయి కార్యక్రమంలో భాగంగా ఈ ఒప్పందాలు సాగాయి. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమక్షంలో సెర్ప్, మెప్మా సంస్థలు 36 ఒప్పందాలు కుదుర్చుకున్నాయి.
ఒప్పందాల వివరాలు
- పట్టణ ప్రాంతాల్లో 260 ఎగ్ కార్ట్స్ సహా మహిళలతో మైక్రో ఎంటర్ప్రైజెస్ ఏర్పాటుకు నేషనల్ ఎగ్ కోఆర్డినేషన్ కమిటీతో మెప్మా ఒప్పందం.
- ఎస్‌హెచ్‌జీ సంఘాల మహిళలు తీసుకునే రుణాలపై డేటా డ్రివెన్ క్రెడిట్ అసెస్మెంట్ మోడల్స్ తయారీకి ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్‌తో ఒప్పందం.
- మహిళలు తయారు చేసిన ఉత్పత్తుల మార్కెటింగ్, ఆధునిక రీటైల్ కియోస్క్‌ల ఏర్పాటుకు రీకనెక్ట్ ప్రైవేట్ లిమిటెడ్‌తో ఒప్పందం.
- మహిళా మైక్రో ఎంటర్‌ప్రైజెస్‌లకు ఆహారపదార్ధాల కోసం యంత్రపరికరాలను అందించేందుకు కూలెక్స్ ఇండస్ట్రీస్‌తో ఒప్పందం.
- స్వయం ఏపీ ఎంటర్ప్రైజ్ ఏర్పాటు, మార్కెటింగ్ లింకేజ్ కోసం నిర్మాణ్ ఆర్గనైజేషన్‌తో ఒప్పందం.
- అరకు కాఫీ, చాయ్ రాస్తాలాంటి అవుట్ లెట్స్ ఏర్పాటుకు ఎస్‌హెచ్‌జీ మహిళలకు ఆర్ధిక సహకారం కోసం సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియాతో ఒప్పందం.
- ఎస్‌హెచ్‌జీ మహిళల కుటుంబాల ఇళ్ల నిర్మాణానికి ఆర్ధిక సహకారం అందించేలా ఈజీ ఫైనాన్స్ ప్రైవేట్ లిమిటెడ్‌తో ఒప్పందం.
- తిరుపతి క్యాంటీన్ల నిర్వహణకు స్వయం సహాయ సంఘాల మహిళలకు ఆర్ధిక సహాకారం అందించేలా ఇండియన్ ఓవర్సీస్ బ్యాంకుతో ఒప్పందం.
- మిల్లెట్లతో తయారైన పదార్ధాల రీటైల్ అవుట్ లెట్ల ఏర్పాటుకు 9 నట్జ్ మిల్లెట్స్ ప్రైవేట్ లిమిటెడ్‌తో ఒప్పందం.
- మహిళా సంఘాలు ఎంఎసఎంఈలను ఏర్పాటు చేసుకునేలా డిజిటల్ డీపీఆర్‌లు సిద్ధం చేసుకునేలా సహకారం కోసం ఫిన్ వోయిస్ ఓపెన్ బిజినెస్ సొల్యూషన్స్‌తో ఒప్పందం.
- సౌందర్య ఉత్పత్తుల్లో వినియోగించే సముద్రపు నాచు సాగులో స్వయం సహాయ సంఘాల మహిళలకు శిక్షణ ఇచ్చేలా నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఓషన్ టెక్నాలజీతో ఒప్పందం.
- సీవీడ్ కల్చర్‌లో మహిళలకు శిక్షణ, ఉత్పత్తుల తయారీ కోసం సీఎసఐఆర్తోనూ కీలకమైన ఒప్పందం చేసుకున్న సెర్ప్.
- ఎస్‌హెచ్‌జీ మహిళలకు సీవీడ్ ఉత్పత్తులు, విలువ జోడింపు, శిక్షణ కోసం కేరళకు చెందిన అమృత విశ్వ విద్యాపీఠంతో ఒప్పందం చేసుకున్న సెర్ప్.
- వెలుగు 2.0 ద్వారా ఎస్‌హెచ్‌జీ పారిశ్రామిక వేత్తలను బలోపేతం చేసేలా శిక్షణ, ప్రొఫైలింగ్, మార్కెట్ స్కేల్ అప్ కోసం ఎక్సఎలఆరఐ సంస్థతో ఒప్పందం.
- పొదుపు చేసిన మొత్తాలను వ్యాపారాలుగా మార్చేందుకు అవసరమైన సహకారం కోసం ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్‌తో సెర్ప్ ఒప్పందం.
- సర్క్యులర్ ఎకానమీ మోడల్ ద్వారా చేనేత వస్త్రాల జాబ్ వర్క్‌ను విలువ ఆధారిత ఉత్పత్తులు, మార్కెటింగ్ అంశాల్లో ఆప్కో మాజిక్ వీవ్స్తో ఒప్పందం.
- మహిళా ఎఫ్పీఓల బలోపేతం, మార్కెట్ లింకేజి, సహా వివిధ అంశాలపై సహకారం కోసం ఐఐఎం విశాఖపట్నంతో ఒప్పందం చేసుకున్న సెర్ప్.
- దేశీయ పౌల్ట్రీ ఉత్పత్తులు, ప్రకృతి సేద్యం ల్యాండ్స్కేప్లాంటి అంశాల్లో సహకారం కోసం వాసన్‌తో ఒప్పందం.
- లైవ్ స్టాక్ వ్యాల్యూ చైన్స్, ఎఫ్పీఓలకు సాంకేతిక మద్ధతు అందించేందుకు హైఫెర్ ఇంటర్నేషనల్‌తో కుదిరిన ఒప్పందం
- ఎఫ్‌పీఓ సర్టిఫికేషన్, గిరిజన ప్రాంతాల్లో మహిళలకు జీవనోపాధి కల్పించే అంశాలకు మద్దతు ఇచ్చేలా విజయవాహిని ఛారిటబుల్ ఫౌండేషన్‌తో ఒప్పందం.
- మహిళా సంఘాల ఉత్పత్తులకు మార్కెటింగ్ సహా, క్రెడిట్ రెడీనెస్ కోసం కాల్గుడి డిజిటల్ ప్రైవేట్ లిమిటెడ్‌తో ఒప్పందం.
- మహిళా ఎఫ్పీఓలకు ప్రోత్సాహం, ఉత్తరాంధ్రలోని గ్రామీణ ప్రాంతాల్లో జీవనోపాధి కోసం బాపూజీ రూరల్ ఎన్ లైట్మెంట్ డెవలప్మెంట్ సొసైటీతో ఒప్పందం.
- మహిళా రైతులు, ఎఫ్పీఓలుకు ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ సలహాలను ఇచ్చేందుకు డిజిటల్ గ్రీన్ ట్రస్ట్‌తో ఒప్పందం చేసుకున్న సెర్ప్.
- స్వయం సహాయ మహిళా సంఘాలు తయారు చేసిన ఉత్పత్తులకు ఫుడ్ సేఫ్టీ ఆడిట్స్, కెపాసిటీ బిల్డింగ్, ఫుడ్ ప్రాసెసింగ్ అంశాల్లో హకారం కోసం ఫుడ్ సేఫ్టీ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్‌తో ఒప్పందం.
- ఎస్‌హెచ్‌జీల ఆధ్వర్యంలో నడిచే చేనేత ఉత్పత్తులకు మార్కెటింగ్ సహకారం హ్యాండ్లూమ్ క్లస్టర్ డెవలప్మెంట్ కోసం ఇండియన్ ఎంపోరియంతో ఒప్పందం.
- మహిళా సంఘాల సంస్థలు ఉత్పత్తి చేసిన హ్యాండ్లూమ్ వస్త్రాల ఎగుమతి, మార్కెటింగ్ లింకేజ్ కోసం ఎంబ్యోమ్ కన్సల్టింగ్ సర్వీసెస్‌తో ఒప్పందం
- మిల్లెట్ క్లస్టర్ల అభివృద్ధి, బ్రాండింగ్లాంటి అంశాల్లో యాక్సెస్ లైవ్లీ హుడ్స్ కన్సల్టింగ్ ఇండియా లిమిటెడ్‌తో సెర్ప్ ఒప్పందం.
- ఎస్‌హెచ్‌జీ సంస్థలు ఉత్పత్తి చేసిన సుగంధ ద్రవ్యాలు, పచ్చళ్ల తయారీ ఇతర ప్రాసెసింగ్ కోసం ఎంఎసఎంఈతో ఒప్పందం.
- స్వయం సహాయ మహిళా సంఘాలకు గ్రామీణ సంస్థల ఏర్పాటు, స్కిల్ డెవలప్మెంట్లాంటి అంశాల కోసం సెంచూరియన్ యూనివర్సిటి ఆఫ్ టెక్నాలజీ మేనేజ్మెంట్తో మెప్మా ఒప్పందం.
- 800కుపైగా ఎస్‌హెచ్‌జీలు చాయ్ రస్తా, కాఫీ అవుట్లెట్లను ఏర్పాటు చేసి నిర్వహించేందుకు వీలుగా చాయ్ రాస్తా ఆస్పిరేషనల్ ఫుడ్స్ లిమిటెడ్‌తో ఒప్పందం చేసుకున్న మెప్మా
- 20 వేల తిరుపతి క్యాంటీన్ అవుట్ లెట్స్‌ను స్వయం సహాయ సంఘాల మహిళలు ఏర్పాటు చేసేలా సారా ప్రాజెక్ట్స్- తిరుపతి క్యాంటీన్స్ సంస్థతో ఒప్పందం.
- కమ్యూటీ హెల్త్ ప్రొఫైలింగ్, ఎస్‌హెచ్‌జీ మహిళల కుటుంబాలకు హెల్త్ స్క్రీనింగ్ కోసం స్వస్తి ది హెల్త్ కేటలిస్ట్ సంస్థతో ఒప్పందం.
- మొబైల్ డెసెర్ట్ తయారీ ఈవీ వాహనాల నిర్వహణకు ద థిక్ షేక్ ఫ్యాక్టరీ లిమిటెడ్‌తో ఒప్పందం
- గ్రామీణ మహిళా పారిశ్రామికవేత్తలు తయారు చేసిన ఉత్పత్తులను స్వయం డిజిటల్ స్టోర్ ఫ్రంట్ ద్వారా మార్కెటింగ్ చేసుకునేందుకు సహకారం అందించేలా ఫ్లిప్ కార్ట్‌తో ఒప్పందం.
- ఎస్‌హెచ్‌జీ క్లస్టర్ డెవలప్మెంట్, శిక్షణ, పరిశ్రమలకు ప్రోత్సాహం తదితర అంశాల్లో సాయం అందించేలా ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ డెవలప్మెంట్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇండియాతో ఒప్పందం.
- వస్త్రాల తయారీ, శిక్షణ, అరకు కాఫీ ఆన్ వీల్స్లాంటి వాటిలో సహకారం కోసం ఏపి ఐటీసీఓ సంస్థతో ఒప్పందం
- స్వయం సహాయ సంఘాల్లోని మహిళల ఆర్ధిక స్వావలంబన, శిక్షణ, సహకారం కోసం మొత్తం 36 సంస్థలతో మెప్మా, సెర్ప్ ఒప్పందాలు
- ఆర్ధిక, వ్యవసాయ, సీవీడ్, హ్యాండ్లూమ్, ఫుడ్ సర్వీస్, హెల్త్, డిజిటల్, ఎంఎసఎంఈ, నైపుణ్య కల్పన తదితర రంగాల్లో కుదిరిన ఒప్పందాలు.
- వన్ ఫ్యామిలీ వన్ ఎంటర్ప్రెన్యూర్ కార్యక్రమంలో భాగంగా మహిళా పారిశ్రామికవేత్తలను తయారు చేసేలా వివిధ సంస్థలతో ఒప్పందాలు చేసుకున్న ప్రభుత్వం.














