- రూ.9,449 కోట్ల విలువైన 5 ప్రాజెక్టులకు శంకుస్థాపనలు
- రూ.1704 కోట్ల విలువైన 8 అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలు
- రూ.2276 కోట్ల విలువైన 2 ప్రాజెక్టులు జాతికి అంకితం
- విద్యుత్, రైల్వే, రహదార్లు, పారిశ్రామిక, రక్షణ రంగాలకు కొత్త ఊపు
కర్నూలు (చైతన్య రథం): కేంద్రం, రాష్ట్రంలోని ఎన్డీఏ డబుల్ ఇంజన్ సర్కార్తో ఏపీకి రెట్టింపు ప్రయోజనాలు దక్కుతున్నాయన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నమ్మకాన్ని నిరూపిస్తూ.. ప్రధాని నరేంద్ర మోదీ గురువారం రాష్ట్రంలో రూ.13,429 కోట్ల కేంద్ర ప్రాజెక్టులకు శ్రీకారం చట్టారు. రాష్ట్రంలో విద్యుత్, రైల్వే, జాతీయ రహదారులు, పారిశ్రామిక, రక్షణ రంగాలకు చెందిన రూ.13,429 కోట్ల విలువైన అభివృద్ధి పనులకు ప్రధాని శ్రీకారం చుట్టారు. వర్చువల్ విధానంలో వివిధ ప్రాజెక్టులను మోదీ ప్రారంభించారు. అలాగే ఇంకొన్నింటికి శంకుస్థాపనలు చేశారు. రెండు ప్రాజెక్టులను జాతికి అంకితం చేశారు. రూ.9,449 కోట్ల విలువైన 5 అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేశారు. రూ.1704 కోట్ల విలువైన 8 అభివృద్ధి పనులను ప్రధాన మంత్రి ప్రారంభించారు. ఇక రూ.2276 కోట్ల విలువైన 2 ప్రాజెక్టులను ప్రధాని జాతికి అంకితం చేశారు. శంకుస్థాపనలు చేసిన వాటిలో.. రూ.2826 కోట్లతో విద్యుత్ ట్రాన్స్మిషన్ వ్యవస్థ, రూ.4922 కోట్లతో ఓర్వకల్లు-కొప్పర్తి పారిశ్రామిక కారిడార్, రూ.493కోట్లతో కొత్త వలస -విజయనగరం మధ్య 4వ లైన్, రూ.184 కోట్లతో పెందుర్తి -సింహాచలం నార్త్ మధ్య రైల్ ఫ్లైఓవర్ లైన్, రూ.964 కోట్లతో సబ్బవరం-షీలానగర్ జాతీయ రహదారి ఉన్నాయి.
అలాగే.. రూ.82 కోట్లుతో నిర్మించిన రేణిగుంట కడప కడప -మదనపల్లె రోడ్డు, రూ.286 కోట్లుతో నిర్మించిన కడప -నెల్లూరు -చునియంపల్లి రోడ్లు, రూ.70కోట్లతో నిర్మించిన కనిగిరి బైపాస్ రోడ్, రూ.98 కోట్లతో నిర్మించిన గుడివాడ-నూజెండ్ల వద్ద 4లేన్ల రోడ్డు ఓవర్ బ్రిడ్జి, రూ.13కోట్లతో నిర్మించిన కల్యాణదుర్గం -రాయదుర్గం -మొలకలమూరు రోడ్డు, రూ.593కోట్లతో నిర్మించిన పీలేరు -కలసూర్ నాలుగు లేన్ల రోడ్, రూ.362కోట్లతో ఏర్పాటు చేసిన నిమ్మకూరులోని నమ్మకాన్ని బెల్లో లో అడ్వాన్స్డ్ నైట్ విజన్ గ్లాసుల ఉత్పత్తి కేంద్రం, రూ.200 కోట్లతో ఏర్పాటు చేసిన చిత్తూరులోని ఇండేన్ బాట్లింగ్ ప్లాంట్లను ప్రధాని మోదీ వర్చ్యువల్ గా ప్రారంభించారు. అలాగే, రూ. 546కోట్లతో నిర్మించిన కొత్తవలస -కొరాపుట్ రైల్వే డబ్లింగ్ పనుల ప్రాజెక్టు, రూ.1730కోట్లతో నెలకొల్పిన శ్రీకాకుళం- అంగుల్ నాచురల్ గ్యాస్ పైప్లైన్ ప్రాజెక్టులను ప్రధాని మోదీ జాతికి అంకితం చేశారు.
శ్రీశైల మల్లన్నను దర్శించిన ప్రధాని, సీఎం
కర్నూలు విమానాశ్రయంనుంచి శ్రీశైల క్షేత్రానికి హెలికాప్టర్లో వెళ్లిన ప్రధాని మోదీ, ముఖ్యమంత్రి చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ శ్రీశైల మల్లిఖార్జునస్వామిని దర్శించుకున్నారు. అనంతరం అక్కడేవున్న శక్తిపీఠంలోని భ్రమరాంబ అమ్మవారిని దర్శించి.. వేదపండితుల ఆశీర్వచనాలు స్వీకరించారు. శ్రీశైలంలోని శివాజీ స్పూర్తి కేంద్రానికి ప్రధాని మోదీవెంట సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వెళ్లారు. స్పూర్తి కేంద్రంలోని దర్బార్ హాల్, ధాన్య మందిరాన్ని ప్రధాని సందర్శించారు.