చైతన్యరధం ఈ-పేపర్
అభిప్రాయం
No Result
View All Result
TDP - తెలుగు దేశం పార్టీ
టీడీపీ లో చేరండి
విరాళం
Telugu Desam
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
    • Form C2 – Rajya Sabha Election 2026
    • Form C7 – Rajya Sabha Election 2026
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • సూపర్ 6
TDP - తెలుగు దేశం పార్టీ
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
    • Form C2 – Rajya Sabha Election 2026
    • Form C7 – Rajya Sabha Election 2026
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • సూపర్ 6
No Result
View All Result
TDP - తెలుగు దేశం పార్టీ
No Result
View All Result
Telugu Desam
Home ఆంధ్రప్రదేశ్

ఏపీకి కేంద్రం అండ

మీడియాతో కేంద్ర వ్యవసాయ మంత్రి శివరాజ్‌ సింగ్‌ చౌహాన్‌

by చైతన్యరధం
Sep 6, 2024 at 7:35am
in ఆంధ్రప్రదేశ్, చైతన్యరధం, తాజా సంఘటనలు, ముఖ్య వార్తలు
ఏపీకి కేంద్రం అండ
Share on FacebookShare on TwitterShare on Whatsapp
  • రాష్ట్రానికి పూర్తి మద్దతు, సహాయ సహకారాలు
  • గత ప్రభుత్వ నిర్వాకమే విపత్తునకు ఒక కారణం
  • సీఎం అవిశ్రాంత సహాయక చర్యలు ఆమోఘం
  • కలెక్టరేటే.. సీఎం క్యాంపు కార్యాలయంగా పనిచేశారు
  • అడిగిన వెంటనే ఎన్డీఆర్‌ఎఫ్‌ బృందాలను పంపించాం
  • సహాయక చర్యల్లో డ్రోన్ల వినియోగం ఆధునిక ప్రక్రియ
  • యుద్ధప్రాతిపదికన పారిశుద్ధ్య నిర్వహణ ప్రశంసనీయం
  • రైతులకు పంట బీమా పథకంతో పూర్తి లబ్ధి చేకూరుస్తాం
  • కేంద్రం దృష్టికి బ్యారేజ్‌ సామర్థ్యం పెంపు అంశం తీసుకెళ్తా..
  • మీడియాతో కేంద్ర వ్యవసాయ మంత్రి శివరాజ్‌ సింగ్‌ చౌహాన్‌

అమరావతి (చైతన్య రథం): కష్ట సమయంలో రాష్ట్రానికి కేంద్రం అండగా ఉంటుందని కేంద్ర వ్యవసాయశాఖ మంత్రి శివరాజ్‌ సింగ్‌ చౌహాన్‌ హామీనిచ్చారు. గురువారం ఉదయం గన్నవరం చేరుకున్న కేంద్ర మంత్రి ఏరియల్‌ సర్వే ద్వారా బుడమేరు, క్యాచ్‌మెంట్‌ ఏరియాలతోపాటు వరద ప్రభావిత ప్రాంతాలైన జక్కంపూడి మిల్క్‌ ఫ్యాక్టరీ, కండ్రిక, అజిత్‌సింగ్‌ నగర్‌ను పరిశీలించారు. ఆయా ప్రాంతాల్లో జరిగిన నష్టాన్ని రాష్ట్ర మంత్రి నారా లోకేశ్‌ కేంద్ర మంత్రికి వివరించారు.
ఏరియల్‌ సర్వే అనంతరం ముఖ్యమంత్రి నివాసంలోని హెలీప్యాడ్‌కు చేరుకున్నారు. అక్కడినుంచి రోడ్డు మార్గంలో వరద కారణంగా దెబ్బతిన్న ప్రకాశం బ్యారేజీ గేట్లను పరిశీలించారు. జక్కంపూడి కాలనీ, మిల్క్‌ ఫ్యాక్టరీ ప్రాంతాన్ని ఎన్డీఆర్‌ఎఫ్‌ బోట్‌లో వెళ్లి పరిశీలించారు. అనంతరం విజయవాడ కలెక్టరేట్‌లోని కమాండ్‌ కంట్రోల్‌ రూముకు చేరుకుని వరద కారణంగా దెబ్బతిన్న ప్రాంతాలపై ఏర్పాటు చేసిన ఫొటో ఎగ్జిబిషన్‌ వీక్షించారు. గురువారం సాయంత్రం సీఎం చంద్రబాబుతో కలిసి శివరాజ్‌సింగ్‌ చౌహాన్‌ మీడియాతో మాట్లాడారు. కేంద్రం నుంచి త్వరగా సాయమందేలా చూస్తామన్నారు.
విజయవాడ నగరంలో ఎవరూ ఊహించని రీతిలో కురిసిన 400 మిమీ వర్షపాతంవల్ల వరద విప్తతు సంభవించిందని.. బుడమేరుకు పడిన గండ్లువల్ల విజయవాడకు క్లిష్టమైన వరద పరిస్థితి తలెత్తిందని మంత్రి శివరాజ్‌ సింగ్‌ చౌహాన్‌ అన్నారు. విపత్కర పరిస్థితులను ఎదుర్కొనేందుకు సీఎం చంద్రబాబు కలెక్టర్‌ కార్యాలయాన్నే తన క్యాంపు కార్యాలయంగా మార్చుకొని అధికార బృందానికి నేతృత్వంవహిస్తూ 24గంటలూ శ్రమించి సహాయ కార్యక్రమాలు అమలు చేయడంపట్ల చౌహాన్‌ ప్రశంసించారు. ఇలాంటి సంక్లిష్టమైన వరద పరిస్థితుల్లో అధికార యంత్రాంగం పూర్తిస్థాయిలో పనిచేయడం.. దానికి ముఖ్యమంత్రి నాయకత్వం వహించడం గొప్ప విషయమన్నారు. వరద పరిస్థితిని కేంద్రం గుర్తించిందని.. రాష్ట్రానికి పూర్తి మద్దతు, సహాయ సహకారాలు అందిస్తుందన్నారు. ముఖ్యమంత్రి అభ్యర్థన మేరకు ఎన్‌డీఆర్‌ఎఫ్‌ బృందాలు, వైమానిక హెలికాప్టర్లను ప్రధానమంత్రి వెంటనే పంపారన్నారు. రాష్ట్ర ప్రభుత్వ, కేంద్ర ప్రభుత్వ విపత్తు స్పందన బలగాలు కలిసికట్టుగా పనిచేసి వరదబారినపడిన ప్రజలను రక్షించడం, వారి దైనందిక అవసరాలు తీర్చడంలో కృషిచేశాయని మంత్రి పేర్కొన్నారు.
ప్రభుత్వ పనితనం భేష్‌..
రాష్ట్ర ప్రభుత్వం సరైన రీతిలో స్పందించిన కారణంగానే భారీ ప్రాణనష్టం తప్పిందని.. లేకుంటే పరిస్థితి వేరుగా ఉండేదని మంత్రి అన్నారు. వరద నీటిలో అధికారులు, అనధికారులు, ఎన్నికైన ప్రజాప్రతినిధులు కలసి ప్రజాసంక్షేమానికి పనిచేయడం హర్షణీయమన్నారు. వరద విపత్తు ప్రాంతాల బాధ్యతలు ఐఏఎస్‌లకు అప్పగించడాన్ని ప్రశంసించారు. ప్రభుత్వ సహాయ కార్యక్రమాలపై వరద బాధితుల నుంచి నేరుగా సమాచారం తెలుసుకున్నానని, నిత్యావసరాలైన ఆహారం, పాలు, నీరు సకాలంలో అందించినట్టు చెప్పారన్నారు. దేశంలోనే మొట్టమొదటిసారిగా వరద సహాయక చర్యల్లో డ్రోన్లను వినియోగించి ప్రజలకు ఆహారం, మంచినీళ్లు అందించడం గొప్ప ఆలోచన, భేషైన చర్యగా మంత్రి అభివర్ణించారు.
కేంద్ర బీమా పథకంతో రైతులకు లబ్ది
వరద నీరు తగ్గాక పారిశుద్ధ్య కార్యక్రమాలతోపాటు ఫైర్‌ఇంజిన్ల ద్వారా ఇళ్లు, రోడ్లను శుభ్రపరచడం.. అంటువ్యాధులు ప్రబలకుండా యుద్ధప్రాతిపదికన పారిశుద్ధ్య కార్యక్రమాలు నిర్వహణ.. వీటన్నింటినీ స్వయంగా సీఎం పర్యవేక్షించడం హర్షణీయమని మంత్రి అన్నారు. బుడమేరు గండ్లు పూడ్చడానికి కేంద్ర రక్షణ బలగాల సహాయం అవసరమన్న సీఎం విజ్ఞప్తిమేరకు త్వరలోనే బలగాలను పంపిస్తామని కేంద్రమంత్రి హామీ ఇచ్చారు. భవిష్యత్తులో విపత్తులను ఎదుర్కొనేందుకు స్వల్పకాలిక, దీర్ఘకాలిక ప్రణాళికలు చేపట్టాల్సిన అవసరాన్ని మంత్రి ప్రస్తావించారు. 70 యేళ్ల ప్రకాశం బ్యారేజ్‌కు 11.90 లక్షల క్యూసెక్కుల ప్రవాహాన్ని తట్టుకునే సామర్థ్యం ఉందని.. అయితే ఒకేసారి వరద ముంపును తట్టుకొనే సామర్థ్యాన్ని పెంచే విషయమై ప్రణాళికను రూపొందించాల్సిన అవసరముందన్న సీఎం కొరిన మీదట.. అంచనా వేసేందుకు కేంద్రబృందాన్ని కేంద్ర హోంమంత్రి అమిత్‌షా పంపారన్నారు. దీనిపై తగు నిర్ణయం తీసుకుంటామన్నారు. గత ప్రభుత్వం బుడమేరు సమీపంలో నిర్వహించిన అక్రమ తవ్వకాలు కూడా వరద విపత్తునకు కారణమన్నారు. ఏదేమైనప్పటికీ 1.8 లక్షల హెక్టార్లలో రెండు లక్షల మంది రైతులకు వ్యవసాయ, ఉద్యానవన పంటల నష్టం వాటిల్లిందని తెలిపారు. నష్టాన్ని అంచనా వేసేందుకు ఎన్‌డీఆర్‌ఎఫ్‌, వ్యవసాయ, ప్రణాళిక బృందాలు ఇప్పటికే పని ప్రారంభించారని.. గత ప్రభుత్వం పంటల బీమా ప్రీమియం కట్టని కారణంగా రైతులకు నష్టం వాటిల్లిందన్నారు. ప్రస్తుత ఎన్‌డీఏ ప్రభుత్వం ఆ తప్పిదం చేయదని.. కేంద్ర పంటల బీమా పథకం ద్వారా వచ్చే లబ్ధిని రైతులకు పూర్తిగా దక్కుతుందన్నారు. విపత్కర సమయంలో ప్రజలకు అండగా నిలబడటమే ఎన్‌డీఏ ప్రభుత్వ లక్ష్యమని ప్రధాని మోదీ రాష్ట్ర ప్రభుత్వానికి కావాల్సిన అన్ని రకాల సహాయ సహకారాలను అందిస్తుందని.. ఇప్పటికే రాష్ట్రానికి విచ్చేసిన కేంద్ర బృందాలు తమ అంచనాలను కేంద్రానికి సమర్పిస్తాయన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సమైఖ్యంగా సంకట పరిస్థితుల నుంచి ప్రజలను గట్టెక్కించే ప్రయత్నం చేస్తూ దీర్ఘకాలిక ప్రణాళిక ద్వారా ఇలాంటి సమస్యలు ఉత్పన్నంకాకుండా చర్యలు తీసుకుంటామని శివరాజ్‌సింగ్‌ చౌహాన్‌ ఉద్ఘాటించారు.
బ్యారేజ్‌ సామర్థ్యంపై సీఎం చర్చ
ముఖ్యమంత్రి చంద్రబాబు మాట్లాడుతూ.. ప్రకాశం బ్యారేజీని 11.90 లక్షల క్యూసెక్కుల నీటి ప్రవాహానికి వీలుగా డిజైన్‌ చేశారని కేంద్ర వ్యవసాయ మంత్రి శివరాజ్‌ సింగ్‌ చౌహాన్‌కు వివరించారు. అయితే వారంక్రితం కృష్ణా పరివాహక ప్రాంతంలో కురిసిన భారీ వర్షాలతో 11 లక్షల 43 వేల క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేయడం జరిగిందన్నారు. క్లౌడ్‌ బరెస్ట్‌ అయినట్టు ఒకే రోజు విజయవాడ నగరంలో 40 సెం.మీ. వర్షపాతం నమోదైందని వివరించారు.
గత ప్రభుత్వ చర్యల వల్లే వరద విపత్తు
బుడమేరును సుమారు ఏడు వేల క్యూసెక్కుల నీటి సామర్థ్యంతో డిజైన్‌ చేయగా.. 30వేల క్యూసెక్కుల వరకూ నీరు రావడంతో మూడుచోట్ల గండ్లుపడి నగరంలోని పలు లోతట్టు కాలనీలు ముంపునకు గురయ్యాయని సీపం చంద్రబాబు వివరించారు. 2019లో బుడమేరు మరమ్మత్తులకు అయిదు పనులు మాంజూరు చేయగా.. గత ప్రభుత్వం ఆ పనులు నిలిపి వేయడంతో నేడు పలుచోట్ల గండ్లు పడి సంకట పరిస్థితి తలెత్తిందన్నారు. ప్రకాశం బ్యారేజీ సామర్థ్యాన్ని 15 లక్షల క్యూసెక్కులకు పెంచేందుకు ఒక సాంకేతిక బృందంతో అధ్యయనం చేయిస్తున్నామని సీఎం చంద్రబాబు మీడియాకు వివరించారు. అలాగే బుడమేరుకు మరమ్మత్తులతో పాటు ఆధునికీకరణకు చర్యలు తీసుకోనున్నట్టు చెప్పారు. ఏటిగట్లను కూడా పటిష్టం చేయనున్నట్లు తెలిపారు.
బుడమేరు వరదలతో నగరంలో చాలా కాలనీలు వరద ముంపునకు గురై వేలాది గృహాలు దెబ్బతినడంతో పాటు ఇళ్ళలోని విలువైన సామానులు దెబ్బతిన్నాయని సీఎం చెప్పారు. బుడమేరు గండ్లను పూడ్చేందుకు ఆర్మీ బృందం కూడా రానుందన్నారు. వరదల వల్ల కలిగిన నష్టంపై కేంద్రానికి నివేదిక పంపుతున్నట్టు తెలిపారు. కేంద్ర బృందం కూడా గురువారం ఉమ్మడి కృష్ణా, గుంటూరు జిల్లాల్లో పర్యటించిందని అన్నారు.
వరద నష్టంపై ఫొటో ఎగ్జిబిషన్‌
అంతకుముందు వరద నష్టంపై విజయవాడ కలెక్టరేట్లో ఏర్పాటు చేసిన ఛాయాచిత్ర ప్రదర్శనను కేంద్ర మంత్రి శివరాజ్‌ సింగ్‌ చౌహాన్‌.. ముఖ్యమంత్రి చంద్రబాబుతో కలిసి తిలకించారు. కృష్ణా నది, బుడమేరు వరద ముంపునకు గురైన ప్రాంతాలు, ఎన్డీఆర్‌ఎఫ్‌, ఎస్‌డీఆర్‌ఎఫ్‌, పోలీసు తదితర విభాగాల ద్వారా రెస్క్యూ, సహాయ పునరావాస చర్యలు, ఆహారం, తాగునీరు, ఇతర సహాయ చర్యలను, జరిగిన పంట, ఆస్తి, పశు నష్టం వివరాలను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్‌ కుమార్‌ ప్రసాద్‌, సమాచార శాఖ డైరెక్టర్‌ హిమాన్షు శుక్లా కేంద్రమంత్రికి వివరించారు. కార్యక్రమంలో కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్‌, రాష్ట్ర మంత్రులు కె.అచ్చెన్నాయుడు, నారా లోకేశ్‌, నాదెండ్ల మనోహర్‌, జి.సంధ్యారాణి, వంగలపూడి అనిత, బిసి జనార్థన్‌ రెడ్డి, ఎంపీలు కేశినేని చిన్ని, డి పురంధేశ్వరి తదితరులు పాల్గొన్నారు.

సంబంధితవార్తలు

వెలిగొండ ప్రాజెక్టు నిర్మాణం కోసం భూములు, ఇళ్లు కోల్పోయి త్యాగాలు చేసిన నిర్వాసిత కుటుంబాలకు బుధవారం మరో రూ.200 కోట్ల పరిహారాన్ని ప్రభుత్వం అందించింది.

గవర్నర్ కోటాలో శాసనమండలి సభ్యులుగా ఎన్నికైన టీడీపీ సీనియర్ నేత వర్ల రామయ్యకు విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ శుభాకాంక్షలు తెలిపారు.

విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్‌ను దళవాయి రమాదేవి, కుటుంబసభ్యులు మర్యాదపూర్వకంగా కలిశారు

Previous Post

కదిలిన కేంద్రబృందం

Next Post

బుడమేరును కబ్జా చేసి జగన్‌రెడ్డి అనుచరుల వ్యాపారం

మరిన్ని వార్తలు

చైతన్యరధం ఈ పేపర్ 19-08-2026
చైతన్యరధం

చైతన్యరధం ఈ పేపర్ 19-08-2026

కార్యకర్త
@ August 19, 2026
చైతన్యరధం ఈ పేపర్ 18-08-2026
చైతన్యరధం

చైతన్యరధం ఈ పేపర్ 18-08-2026

కార్యకర్త
@ August 18, 2026
ఎల్‌నినోను ఎదుర్కొనేలా మూడేళ్ల కార్యాచరణ
ఆంధ్రప్రదేశ్

ఎల్‌నినోను ఎదుర్కొనేలా మూడేళ్ల కార్యాచరణ

చైతన్యరధం
@ August 18, 2026
ధైర్యముంటే అసెంబ్లీకి వచ్చి చర్చించాలి
ఆంధ్రప్రదేశ్

ధైర్యముంటే అసెంబ్లీకి వచ్చి చర్చించాలి

చైతన్యరధం
@ August 18, 2026
భోగాపురానికి తొలి విమానం కొత్త అధ్యాయానికి శ్రీకారం
ఆంధ్రప్రదేశ్

భోగాపురానికి తొలి విమానం కొత్త అధ్యాయానికి శ్రీకారం

చైతన్యరధం
@ August 18, 2026
డేట్, టైమ్ ఫిక్స్ చెయ్…ఎక్కడైనా..ఎప్పుడైనా చర్చకు సిద్ధం
ఆంధ్రప్రదేశ్

డేట్, టైమ్ ఫిక్స్ చెయ్…ఎక్కడైనా..ఎప్పుడైనా చర్చకు సిద్ధం

చైతన్యరధం
@ August 18, 2026
చైతన్యరధం ఈ పేపర్ 17-08-2026
చైతన్యరధం

చైతన్యరధం ఈ పేపర్ 17-08-2026

కార్యకర్త
@ August 17, 2026
వైసీపీకి తగిన బుద్ధి చెబుతాం!
ఆంధ్రప్రదేశ్

వైసీపీకి తగిన బుద్ధి చెబుతాం!

చైతన్యరధం
@ August 17, 2026
Load More

ముఖ్య వార్తలు

ధైర్యముంటే అసెంబ్లీకి వచ్చి చర్చించాలి

ధైర్యముంటే అసెంబ్లీకి వచ్చి చర్చించాలి

చైతన్యరధం
@ August 18, 2026
డేట్, టైమ్ ఫిక్స్ చెయ్…ఎక్కడైనా..ఎప్పుడైనా చర్చకు సిద్ధం

డేట్, టైమ్ ఫిక్స్ చెయ్…ఎక్కడైనా..ఎప్పుడైనా చర్చకు సిద్ధం

చైతన్యరధం
@ August 18, 2026
వైసీపీకి తగిన బుద్ధి చెబుతాం!

వైసీపీకి తగిన బుద్ధి చెబుతాం!

చైతన్యరధం
@ August 17, 2026
వాటర్ మూమెంట్ ప్లాన్ ప్రకారమే నీటి నిర్వహణ

వాటర్ మూమెంట్ ప్లాన్ ప్రకారమే నీటి నిర్వహణ

చైతన్యరధం
@ August 15, 2026
మరిన్ని

అత్యధికంగా వీక్షించినవి

ఆదర్శ నియోజకవర్గంగా మంగళగిరి!

ఆదర్శ నియోజకవర్గంగా మంగళగిరి!

చైతన్యరధం
@ August 9, 2026 6:20 AM
దళితులపై జగన్‌ది కపట ప్రేమ!

దళితులపై జగన్‌ది కపట ప్రేమ!

చైతన్యరధం
@ July 9, 2026 6:00 AM
చంద్రబాబు విజన్‌తో విద్యుత్ ధగధగలు 

చంద్రబాబు విజన్‌తో విద్యుత్ ధగధగలు 

చైతన్యరధం
@ April 29, 2026 7:10 AM
అమ్మకు ఆసరా…చెల్లెమ్మలకు భరోసా…

అమ్మకు ఆసరా…చెల్లెమ్మలకు భరోసా…

చైతన్యరధం
@ March 8, 2026 6:30 AM
మరిన్ని

తాజా సంఘటనలు

ఎల్‌నినోను ఎదుర్కొనేలా మూడేళ్ల కార్యాచరణ

ఎల్‌నినోను ఎదుర్కొనేలా మూడేళ్ల కార్యాచరణ

చైతన్యరధం
@ August 18, 2026
ధైర్యముంటే అసెంబ్లీకి వచ్చి చర్చించాలి

ధైర్యముంటే అసెంబ్లీకి వచ్చి చర్చించాలి

చైతన్యరధం
@ August 18, 2026
భోగాపురానికి తొలి విమానం కొత్త అధ్యాయానికి శ్రీకారం

భోగాపురానికి తొలి విమానం కొత్త అధ్యాయానికి శ్రీకారం

చైతన్యరధం
@ August 18, 2026
డేట్, టైమ్ ఫిక్స్ చెయ్…ఎక్కడైనా..ఎప్పుడైనా చర్చకు సిద్ధం

డేట్, టైమ్ ఫిక్స్ చెయ్…ఎక్కడైనా..ఎప్పుడైనా చర్చకు సిద్ధం

చైతన్యరధం
@ August 18, 2026
మరిన్ని
TDP-Logo-mini
మన పార్టీ
  • మన సిద్ధాంతం
  • జై హింద్ - జై తెలుగుదేశం
  • మన చరిత్ర
  • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
  • కార్య నిర్వాహక వర్గం
మన నాయకత్వం
  • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
  • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
  • NTR శత జయంతి ఉత్సవాలు
మన విజయాలు
  • భారత దేశం
  • ఆంధ్ర ప్రదేశ్
  • తెలంగాణ
  • 44 సంవత్సరాల విజయాలు
డౌన్లోడ్స్
  • మ్యానిఫెస్టో
  • మహానాడు 2022 తీర్మానాలు
  • నాయకుడితో నా చిత్రం
  • లోగోలు
  • నాయకుల చిత్రాలు
ప్రచార సమాచారం
  • బ్యానర్స్ / బుక్ లెట్స్
  • పోస్టర్స్ / కరపత్రాలు
  • ప్రచార గీతాలు
  • ఎన్నికల సమాచారం / సూచనలు
మీడియా వనరులు
  • పత్రికా ప్రకటనలు
  • ప్రసంగాలు
  • కార్యక్రమాలు
  • ముఖాముఖి & కథనాలు
  • ఫోటో గ్యాలరీ
  • వీడియో గ్యాలరీ

© 2026 తెలుగుదేశం పార్టీ. Privacy Policy | Terms Conditions.

Telegram Whatsapp Facebook Twitter Instagram Youtube
Sanbrains
No Result
View All Result
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారతదేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • మహానాడు 2022 తీర్మానాలు
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • TDP పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • విరాళం
  • అభిప్రాయం
  • చైతన్యరధం ఈ-పేపర్
  • జిల్లా వెబ్‌సైట్‌లు
    • Ananthapuramu
    • Anakapalli
    • Bapatla
    • Chittoor
    • EastGodavari
    • Eluru
    • Guntur
    • Kadapa
    • Kakinada
    • Krishna
    • Kurnool
    • Manyam
    • Nandyala
    • Nellore
    • Palnadu
    • Prakasam
    • Srikakulam
    • Tirupati
    • Visakhapatnam
    • Vizianagaram
    • WestGodavari
  • సూపర్ 6

© 2022 Telugu Desam Party. Designed by Tecbrains.

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Create New Account!

Fill the forms below to register

*By registering into our website, you agree to the Terms & Conditions and Privacy Policy.
All fields are required. Log In

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In

Add New Playlist