- సీఈఓ కార్యాలయంలోకి ఐప్యాక్ సిబ్బంది చొరబాటా?
- ఓటమి భయంతో ఓటర్ల జాబితాలో జగన్ అక్రమాలు
- జగన్ ఎమ్మెల్యేలను బదిలీ చేస్తే.. వారు ఓటర్లను బదిలీ చేయించుకుంటున్నారు
- వాలంటీర్లతో ఓటర్ల డేటా సేకరణ
- సీఈఓకు అచ్చెన్నాయుడు ఫిర్యాదు
అమరావతి: ఓటర్ల జాబితాలోని అవకతవకలు, రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి కార్యాలయంలో ఐప్యాక్ సిబ్బంది చొరబడటం, కులగణన పేరుతో ప్రజల వ్యక్తిగత వివరాలను వాలంటీర్లు సేకరించటం సహా ఎన్నికల్లో గెలుపు కోసం జగన్ రెడ్డి అనుసరిస్తున్న తప్పుడు విధానాలపై సీబీఐ విచారణ జరిపించాలని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడు డిమాండ్ చేశారు. పార్టీ పొలిట్‌బ్యూరో సభ్యులు బొండా ఉమామహేశ్వరరావు, వర్ల రామయ్యతో కలిసి మంగళవారం రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారిని కలిసి ఓటర్ల జాబితాలో అధికార వైసీపీ పాల్పడుతున్న అక్రమాలపై అచ్చెన్నాయుడు ఫిర్యాదు చేశారు. అనంతరం మీడియాతో మాట్లాడారు.
ప్రధానంగా మూడు విషయాలపై రాష్ట్ర ఎన్నికల ప్రధానాధాకారికి వినతి పత్రాలు ఇచ్చామని అచ్చెన్నా యుడు చెప్పారు. ఓటర్ల జాబితాలో అవకతవకలకు సంబంధించి,అధికారపార్టీ వ్యవహరిస్తున్న తీరుగురించి మొదట్నుంచీ జరుగుతున్న పరిణామాలను మరోసారి రాష్ట్ర ఎన్నికల ప్రధానాధాకారికి వివరించాం. రాష్ట్రం లో ఎన్నికలు ఎప్పుడు జరిగినా ప్రజలు, తనను.. తన ప్రభుత్వాన్ని సాగనంపడం ఖాయమని గ్రహించాకే జగన్‌రెడ్డి ఓటర్ల జాబితాలో అవకతవకలకు తెరలే పాడు. వాలంటీర్లను, సచివాలయ సిబ్బందిని వినియో గించుకొంటూ ఎన్నికల్లో లబ్ధిపొందాలని జగన్‌రెడ్డి ఒక పథకం ప్రకారం ముందుకు వెళ్తున్నాడు. రాష్ట్రంలో ఓట్ల దొంగలు పడ్డారని గతంలో ఇక్కడే అనేకసార్లు చెప్పాము. వాలంటీర్లను ఇంటింటికీ పంపి, ఓటర్ల వివ రాలు సేకరిస్తున్నారని, ఆఖరికి ఎవరు ఏ పార్టీ సాను భూతిపరులో కూడా సమాచారం సేకరిస్తున్నారని అలా ంటివి జరక్కుండా చర్యలు తీసుకోవాలని కూడా గతం లో అనేకసార్లు ఎన్నికలసంఘాన్నికోరాం.అదలా ఉంటే ఇప్పుడు ఏకంగా రాష్ట్రఎన్నికల ప్రధాన అధికారి కార్యా లయంలోనే ఓట్ల దొంగలు ప్రవేశించారు. ఇలాంటి చర్యలు కరడుగట్టిన నేరస్థులకు తప్ప సామాన్యుల ఊహకు కూడా అందనివని అచ్చెన్నాయుడు అన్నారు. సానుకూలంగా స్పందించారు. మరోపక్క ఐ ప్యాక్ సిబ్బంది ఏకంగా రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి కార్యాలయంలోకే చొరబడి మొత్తం ఓటర్ల సమాచారం సేకరించి ఓటర్ల జాబితాను తారుమారు చేసే పనిలో నిమగ్నమైందని ప్రముఖ దినపత్రికల్లో కథనాలు వచ్చాయి. ఇలాంటి సందర్భంలో సీఈఓ చెప్పే వాదన కాకుండా, తక్షణమే మొత్తం వ్యవహారంపై సీబీఐ విచారణ జరిపించాలని కోరాం. మా పార్టీ ఎంపీలు కూడా ఢల్లీి లో ఇదే అంశంపై కేంద్ర ఎన్నికల కమిషనర్ కు ఇప్పటికే ఫిర్యాదు చేశారు. ఈ రోజు మేం కూడా రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారికి ఫిర్యాదు చేశాం. ఇలానే జరిగితే రాష్ట్రంలో ప్రశాంతంగా, స్వేఛ్చాయుత వాతావరణంలో ఎన్నికలు ఎలా జరుగుతాయో ఎన్నికల కమిషన్ కూడా ఆలోచించాలి. ఓటర్ల జాబితాలోని అవకతవకలపై సీబీఐ విచారణ జరిపించాలన్న మా విజ్ఞప్తిపై రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి కూడా సానుకూలంగా స్పందించారని అచ్చెన్నాయుడు తెలిపారు.
10వేల ఓట్లు బదిలీ చేయిస్తున్నారు: బొండా
వైసీపీ ప్రభుత్వం ఏవిధంగా వ్యవస్థల్ని దుర్వినియోగం చేస్తోందో ప్రజలు గ్రహించాలని టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడు బొండా ఉమామహేశ్వరరావు అన్నారు. విజయవాడ సెంట్రల్ నియోజకవర్గ వైసీపీ అభ్యర్థిగా నియమితులైన వెల్లంపల్లి శ్రీనివాస్.. వాలంటీర్లకు, సచివాలయ సిబ్బందికి, పోలీసులకు బహుమతులు ఇస్తూ తన పనులు చేయించుకుంటు న్నాడు. వైసీపీకి ఓట్లేయడానికి ఒప్పుకోకపోయినా, ప్రజలు తమ దారికి రాకపోయినా పథకాలు ఆపేస్తా మని వారిని బహిరంగంగానే బెదిరిస్తున్నాడు. మాజీ మంత్రి వెల్లంపల్లి, అతని అనుచరులు, వాలంటీర్ల బెదిరింపులకు సంబంధించిన వివరాల్ని, ఫోటోల్ని ఎన్నికల కమిషనర్ ఎదుట ఉంచాం. అలానే మీడియా కు కూడా విడుదల చేస్తున్నాం. విజయ వాడలో ఏ కల్యాణ మండపంలో చూసినా వాలంటీర్లు, సచివాల య సిబ్బందితో జరుగుతున్న సమావేశాలే కనిపిస్తు న్నాయి. విజయవాడ పశ్చిమ నియోజకవర్గం నుంచి సెంట్రల్ నియోజకవర్గంలోకి 10వేల ఓట్లు బదిలీ చేయడానికి దరఖాస్తులు పెట్టారు. దానిపై కూడా ఆధా రాలతో సహా ఎన్నికల కమిషనర్‌కు ఫిర్యాదు చేశాం. జనవరి 22న ఓటర్ల జాబితా విడుదలయ్యాక వెంటనే 10వేల మంది ఓటర్లు ఎక్కడ నుంచి వచ్చారో ఆలోచిం చరా? అధికారులు వాలంటీర్ల సాయంతో ఇష్టానుసా రం దొంగఓట్లు చేరుస్తున్నారు. సచివాలయ సిబ్బంది, వాలంటర్లకు బహుమతులు పంచుతున్నప్పుడే మున్సి పల్ కమిషనర్‌కు ఫిర్యాదుచేశాం. కానీ ఎలాంటి చర్య లు తీసుకోలేదు. రాష్ట్రంలో ఇప్పటివరకు రూ.70 కోట్ల డబ్బు సీజ్ చేసినట్టు అధికారులు గర్వంగా చెబుతు న్నారు. మరి మేం ఇచ్చిన ఫిర్యాదుపై ఎందుకు స్పం దించలేదు? ఈ విధంగా ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్న వ్యక్తులపై చర్యలు తీసుకునేందుకు రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి స్పందించపోతే కేంద్ర ఎన్నికల కమిషన్ కు ఫిర్యాదు చేస్తామని బొండా స్పష్టం చేశారు.
అప్పుడే ప్రలోభాలకు తెరలేపాడు: వర్ల రామయ్య
ముఖ్యమంత్రి జగన్‌కు, వైసీపీ అభ్యర్థులకు ఓటమి భయం పట్టుకుందని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య అన్నారు. దాంతో ముందస్తుగా అభ్యర్థు ల్ని ప్రకటించినట్టే, ముందే ప్రలోభాలకు తెరలేపాడు ఈ ముఖ్యమంత్రి. విజయవాడ సెంట్రల్ నియోజక వర్గంలో పోలీసుల సమక్షంలోనే బహుమతులు పంచు తుంటే వారేం చేస్తున్నారు? చాలా నియోజకవర్గాల్లో వైసీపీ నేతలు ఓటర్ల జాబితాను ముందు పెట్టుకొని మరీ వివిధ రకాల బహుమతులు పంచుతున్నారు. అవి నీతి సొమ్ము ఖర్చుపెట్టి ఎన్నికల్లో గెలవాలని ప్రయత్ని స్తున్న ముఖ్యమంత్రికి, వైసీపీ నేతలకు ప్రజలు తగిన బుద్ధి చెప్పాలి. ఈ వ్యవహారంపై రాష్ట్ర ఎన్నికల ప్రధానా ధికారికి ఫిర్యాదు చేశాం. ఆయన కూడా జిల్లా కలెక్టర్ల కు లేఖ రాసి వెంటనే చర్యలు తీసుకునేలా చూస్తానని చెప్పారు. ఇలానే వ్యవహరిస్తే ఎన్నికలు ఒక ప్రహస నంగా మారతాయి. ఈ వ్యవహారంపై అవసరమైతే న్యాయపోరాటం చేస్తాం. ఈసీలో దొంగలు పడ్డారని పత్రికల్లో కథనాలు వస్తే విచారణ జరిపించాల్సిన బాధ్యత ఎన్నికల కమిషనర్ పై లేదా? అందుకే సీబీఐ విచారణ కోరుతున్నాం. ఐప్యాక్ సిబ్బంది ఇలా అన్నింట్లో చొరబడితే ఎన్నికలు సజావుగా, సక్రమంగా ఎలా జరుగుతాయని రామయ్య ప్రశ్నించారు.
వ్యక్తిగత సమాచారం సేకరిస్తూ, టీడీపీ ఓట్లను తొలగిస్తున్నారు.
రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి(సీఈఓ) కార్యాలయంలో నియమితులైన సిబ్బందిలో కొందరు ఐప్యాక్‌కు చెందినవారు ఉన్నారు. జగన్‌రెడ్డి కోసం పనిచేస్తున్న ఐప్యాక్ విభాగానికి చెందిన కొంత మందిని సీఈవో కార్యాలయంలో నియమించి, పూర్తి సమాచారం తీసు కొని తెలుగుదేశంపార్టీ సానుభూతిపరుల ఓట్లు తొలగిస్తున్నారు. 15రోజుల్లో ఎన్నికల షెడ్యూల్ వస్తుందని అనుకుంటున్న సమయంలో ఈ ప్రభుత్వం బీసీ జనగణన పేరుతో వాలంటీర్ల ద్వారా ప్రజల వ్యక్తిగత సమాచారం సేకరించడం దుర్మార్గం. ఆఖరికి వేలిముద్రలు కూడా తీసుకొని ప్రజల వ్యక్తిగత సమాచారాన్ని తస్కరి స్తున్నారనే విషయం ఎన్నికల ప్రధానాధికారికి తెలియ చేస్తే ఆయన కూడా ఒప్పుకున్నారు. ఇటీవల విడుదలైన ఓటర్ల జాబితాలో చనిపోయిన ఓటర్లను తొలగించలేదు. అలానే దొంగ ఓట్లపై, ఒకే డోర్ నంబర్‌తో ఉన్న ఓట్లపై కూడా చర్యలు లేవు. కొన్నిచోట్ల డబుల్ ఎంట్రీలు ఉన్నాయి. అవన్నీ అలా ఉంటే జగన్‌రెడ్డి కొత్తగా తన పార్టీ ఎమ్మెల్యేలను ఒక నియోజకవర్గం నుంచి మరో నియోజకవర్గానికి మారుస్తుంటే, ఆ విధంగా ట్రాన్స్‌ఫర్ అయిన అభ్యర్థులు తమ పాత నియోజకవర్గాల్లోని ఓటర్లను కొత్త నియోజకవర్గాలకు బదిలీ చేయించడానికి అధికారులకు దరఖాస్తులు పంపే పనిలో నిమగ్నమయ్యారు. ఇంతకంటే దుర్మార్గం ఉంటుందా? ఈ విధంగా ఓట్లను ఒక నియోజక వర్గం నుంచి మరో నియోజకవర్గానికి బదలాయించడంపై దృష్టిపెట్టాలని సీఈఓను కోరాం. కానీ ఆయన వైఖరి మరోలా ఉందని అచ్చెన్నాయుడు అన్నారు.