- సడలిస్తే దర్యాప్తు ముందుకుసాగుతుంది
- సునీతకు న్యాయం జరుగుతుంది
- వివేకా హత్యకేసుపై టీడీపీ నేత బీటెక్ రవి
- పులివెందులలో రాజీనామా చేస్తాం
- జగన్‌రెడ్డి మా సవాల్‌ను స్వీకరిస్తారా?
మంగళగిరి(చైతన్యరథం): వివేకా హత్య కేసులో సుప్రీంకోర్టు కాల పరిమితి విధించి నందునే సీబీఐ దర్యాప్తు ఆగిపోయిందని సిద్ధార్థ లూద్రా చెబుతున్నారు..సుప్రీంకోర్టు కాలపరిమితిని సడలి స్తే దర్యాప్తు సజావుగా జరిగేందుకు అవకాశముందని టీడీపీ నేత బీటెక్ రవి తెలిపారు. మంగళగిరి టీడీపీ కేంద్ర కార్యాలయంలో బుధవారం విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. సుప్రీం కోర్టులో వివేకా కేసుపై జరిగిన వాద, ప్రతివాదనలు విన్నాక వివేకానందరెడ్డి హత్య కేసు కోల్డ్ స్టోరేజ్‌కు వెళ్లిందా? అనే అను మానం కలుగుతోంది. ఈ కేసుపై ఎలాంటి పురోగతి లేదెందుకని ప్రజాస్వామ్య వాదులు, అహింసావాదులు, ప్రజలు ప్రశ్నిస్తున్నారు. నిర్ధ్యాక్షిణ్యంగా వివేకానందరెడ్డిని చంపినప్పటికి ఈ కేసును ఎందుకు తేల్చడంలేదనే అనుమానాలు ప్రజల్లో ఉన్నాయి. వివేకా కుమార్తె సునీత ఈ కేసును త్వరగా తేల్చాలని అభ్యర్థిస్తున్నారు. ఈ హత్య కేసులోని నిందితులు బయట స్వేచ్ఛగా తిరుగుతున్నారు. సాక్ష్యులను బెదిరించడం, కేసు విషయంలో ప్రభావితం చేయడం చేస్తున్నారు. అయినా సునీత న్యాయపోరాటం చేస్తున్నారు. నిందితులు బయట తిరగడంతో ఈ కేసు పురోగతికి అడ్డంకిగా మారుతోంది. వివేకా హత్య కేసులో నిందితుల బెయిల్‌ను రద్దు చేయాలని సునీత కోరారు. సుప్రీంకోర్టు గైడ్‌లైన్స్ ప్రకారం ఈ కేసుకు కాలపరిమితి విధించడంతో సీబీఐ ఈ కేసు దర్యాప్తు అయిపోయిందని మూసివేశారు. ఈ కేసు దర్యాప్తు చేయాల్సిందిగా సుప్రీంకోర్టు సీబీఐకి సూచించాలి. సునీత తరపు న్యాయవాది సిద్ధార్థ లూద్రా కూడా ఈ విషయాన్నే సూచిస్తున్నారు.
సుప్రీం కోర్టు సీబీఐకి సూచిస్తే తప్ప వారు ఈ కేసును చేపట్టరు. ఇందులో లార్జర్ కాన్స్పిరసీ ఉంది. దానిని బయట పెట్టాల్సి ఉంది. సీబీఐ వారు ఆగారు..మళ్లీ వారు రీఇన్వెస్టిగేషన్ అంటే ఇన్వెస్టిగేషన్ గడువు కొంచెం పెంచండని అడగాలి. అప్పుడు ఎలాబరేటెడ్‌గా ఇన్వెస్టిగేషన్ చేసి దీంట్లో ఉన్న లార్జర్ కాన్స్పరసీ అనేది తప్పకుం డా బయటికి వస్తుందని సిద్ధార్థ లూద్రా వాదించారు. వివేకా అల్లుడి మీద కృష్ణారెడ్డి అనే ఒకతను తప్పుడు ఫిర్యాదు ఇవ్వడం జరిగింది. తర్వాత సీబీఐలో పనిచేసే రాంసింగ్ మీద కూడా ఫాల్స్ కంప్లైంట్ ఇచ్చి దానిమీద బాగా ఆలస్యం చేసి ఇబ్బంది పెడుతు న్నారు. ఈ విషయాన్ని అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు దృష్టికి తీసుకురావడంతో ఆ రెండు కేసులు కూడా ఫాల్స్ కేసుల ని.. వీటిని క్వాష్ చేస్తున్నామని కూడా చెప్పడం జరిగింది. అలాగే రిటన్‌గా రాయడంలో కూడా ఇవి కేవలం దురుద్దేశ పూర్వ కంగా ఈ కేసులు పెట్టడం జరిగిందని కూడా అత్యున్నత న్యాయ స్థానం కామెంట్ చేసింది. దీన్ని బట్టి వైసీపీ అధికారాన్ని ఆ ఏ విధంగా ఉపయోగించుకున్నారో అర్థమవుతోంది. మాస్టర్‌మైండ్ అవినాష్‌రెడ్డే అని కోర్టు కామెంట్ చేసింది. ఇందులో కర్త, కర్మ, క్రియ అంతా అవినాష్‌రెడ్డే. ముద్దాయిలు బయట ఉంటే కేసు సజావుగా జరగదని సునీత చెబుతున్నారు. భవిష్యత్తులో సునీత పోరాటానికి న్యాయం జరుగుతుంది.
జగన్ సవాల్‌కు సిద్ధమా?
2024లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీకి 11 సీట్లు రావడానికి కారణం ఈవీఎంలేనని జగన్ అన్నారు. నిన్న జరిగిన పులివెందుల జడ్పీటీసీ ఎన్నికల్లో వైసీపీకి డిపాజిట్ కూడా దక్క లేదు. డిపాజిట్ రాలేదనే అక్కసుతో రిగ్గింగ్ జరిగిందని మాట్లాడు తున్నారు. ఈ ఎన్నికల్లో వైసీపీ నీచాతినీజంగా వ్యవహరించింది. స్థానిక ఓటర్లకే కాకుండా ఇతరులకు డబ్బులు ఇచ్చి ఆరోజు నేను ఓటు వేయలేదని మైక్‌ల ముందు చెప్పించారు. చెప్పినవారు ఆ ప్రాంతానికి చెందినవారు కాదు, వారికి అక్కడ ఓట్లు లేవు. సాక్ష్యా ధారాలతో నిరూపించగలం. కుప్పంలో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి చెమ్చాలతో మాట్లాడిరచారు. కేంద్ర బలగాలతో మళ్లీ ఎన్నికలు జరపాలని జగన్ కోరుతున్నారు. ఇందుకు రెడీ అయితే నేను విసిరే సవాల్‌ని జగన్ స్వీకరించాలి. జడ్పీటీసీ ఎన్నికలు 9 నెలలు మాత్రమే ఉన్నప్పటికీ జగన్‌కు రుచి చూపాలని ఈ ఎన్నికల్లో పోటీ చేశాం. ప్రజాస్వామ్యయుతంగా ఎన్నికలు జరిగితే జగన్‌రెడ్డి పరిస్థి తేంటో ప్రజలకు తెలియజేయాలనే ఉద్దేశంతో పులివెందులలో జడ్పీటీసీ ఎన్నికల్లో పోటీ చేశాం. ప్రజలు మావైపు ఉన్నారో, లేక మీ వైపు ఉన్నారో తేటతెల్లమైంది. మాకు పదవి ముఖ్యం కాదు. మా షరతులకు ఒప్పుకుంటే మీరు చెప్పినట్లే పులివెందుల జడ్పీ టీసీకి రాజీనామా చేస్తాం. పులివెందుల ప్రజలు జగన్‌ను ఎమ్మెల్యే గా గెలిపిస్తే ఇంతవరకు అసెంబ్లీకి రాలేదు. పులివెందుల సమస్య ల గురించి పట్టించుకోలేదు. జగన్ ఎమ్మెల్యే పదవికి అనర్హుడు. పులివెందుల ఎన్నికలు ప్రజాస్వామ్యబద్ధంగా జరగలేదనంటే మీరు కూడా రాజీనామా చేసి రండి. రెండు ఎన్నికలు మీరు అడిగినట్లు గానే కేంద్ర బలగాలతో ప్రజాస్వామ్యబద్ధంగా జరిపిద్దాం. దమ్ముం టే ఈ సవాల్‌ను స్వీకరించాలని చాలెంజ్ చేశారు.