- క్యాడర్‌కు పెద్ద కొడుకునవుతా
- పార్టీ కోసం కష్టించే ప్రతి కార్యకర్త బాధ్యతా నాదే
- వైసీపీ దమనకాండకు బలైన బాలకోటిరెడ్డికి నివాళి
- కుటుంబీకులను పిలిపించి మాట్లాడిన మంత్రి లోకేష్
- జీవితాంతం కుటుంబానికి అండగా ఉంటానని భరోసా
- ఇకపై కార్యకర్తలను నేరుగా కలిసేందుకు నిర్ణయం
ఉండవల్లి (చైతన్య రథం): తెలుగుదేశం పార్టీకి కార్యకర్తలే బలమని, పార్టీ కోసం కష్టపడిన కార్యకర్తల బాధ్యత తాను తీసుకుంటానని, ఇంటికి పెద్దకొడుకులా అండగా ఉంటానని విద్య, ఐటీ మంత్రి నారా లోకేష్ స్పష్టం చేశారు. కార్యకర్తల సంక్షేమం కోసం అహర్నిశలు కృషిచేస్తున్న మంత్రి నారా లోకేష్.. తన నియోజకవర్గ పర్యటనలో ముందుగా కార్యకర్తలతో సమావేశమై వారి సమస్యలను నేరుగా తెలుసుకుని పరిష్కరిస్తున్నారు. ఇకపై ఉండవల్లి నివాసంలో కార్యకర్తలను నేరుగా కలుసుకుని వారికి అండగా నిలవాలని నిర్ణయించుకున్నారు. ఈ నేపథ్యంలో వైసీపీ గూండాల చేతిలో హత్యకు గురైన పల్నాడు జిల్లా రొంపిచర్ల మండల టీడీపీ అధ్యక్షుడు, మాజీ ఎంపీపీ వెన్నా బాలకోటిరెడ్డి కుటుంబ సభ్యులను ఉండవల్లి నివాసానికి పిలిపించుకుని యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు.
కార్యకర్తే అధినేత హామీని నిలబెట్టుకుంటున్న మంత్రి లోకేష్
అలవాల గ్రామానికి చెందిన వెన్నా బాలకోటిరెడ్డి నాలుగు దశాబ్దాలుగా పార్టీ పటిష్టత, ప్రజా సంక్షేమ కోసం పనిచేశారు. దీనిని ఓర్వలేని వైసీపీ గూండాలు అప్పటి వైసీపీ ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి అండతో ఇంట్లో నిద్రిస్తున్న వెన్నా బాలకోటిరెడ్డిని తుపాకీతో కాల్చి చంపారు. హత్యకు ఆరు నెలల ముందు కత్తులతో దాడికి యత్నించగా ప్రాణాపాయం నుంచి బయటపడ్డారు. రక్షణ కోసం పోలీసులకు పలుమార్లు ఫిర్యాదు చేసినప్పటికీ పట్టించుకోలేదు. కూటమి ప్రభుత్వంలో కార్యకర్తే అధినేత అనే లక్ష్యంతో పనిచేస్తున్న పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్.. వైసీపీ విధ్వంస పాలనను ఎదుర్కొని తీవ్రంగా నష్టపోయిన కార్యకర్తల కుటుంబాలకు అన్ని విధాలా అండగా నిలుస్తున్నారు.
హత్య కేసు నిందితులను కఠినంగా శిక్షించాలి
దివంగత వెన్నా బాలకోటిరెడ్డి సతీమణి వెన్నా నాగేంద్రమ్మ, బాలకోటిరెడ్డి సోదరుని కుమారులు వెన్నా నరసింహారెడ్డి, వెన్నా రామకృష్ణారెడ్డిలను కలుసుకున్న మంత్రి లోకేష్.. వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. హత్య పూర్వాపరాలు, వెన్నా నాగేంద్రమ్మ ఆరోగ్యపరిస్థితిపై వాకబు చేశారు. హత్య కేసు నిందితులు స్వేచ్ఛగా సంచరిస్తున్నారని, కేసును పూర్తిస్థాయిలో విచారణ జరిపి నిందితులను కఠినంగా శిక్షించేలా చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా బాలకోటిరెడ్డి కుటుంబ సభ్యులు మంత్రి నారా లోకేష్‌కు విజ్ఞప్తి చేశారు. ఆర్థికంగా చాలా నష్టపోయామని, ఉపాధి హామీ, గృహనిర్మాణం బిల్లులు పెండిరగ్‌లో ఉండటంతో పాటు తాము నివసిస్తున్న ఇల్లు తాకట్టులో ఉందని మంత్రి దృష్టికి తీసుకువచ్చారు.
జీవితాంతం అండగా ఉంటానని భరోసా
మంత్రి నారా లోకేష్ స్పందిస్తూ.. వెన్నా బాలకోటిరెడ్డి కుటుంబానికి జీవితాంతం అండగా ఉంటానని భరోసా ఇచ్చారు. పెండిరగ్ బిల్లులను చెల్లించడంతోపాటు పార్టీపరంగా ఇంటిని తాకట్టునుంచి విడిపిస్తానని హామీ ఇచ్చారు. హత్య కేసు నిందితులకు కఠిన శిక్ష పడేలా చర్యలు తీసుకుంటామన్నారు. వైసీపీ దాష్టీకాలకు ఎదురొడ్డి నిలిచిన అంజిరెడ్డి తాత, మంజులారెడ్డి, తోట చంద్రయ్యలే మనకు స్ఫూర్తి అని.. ఇంటికి పెద్దకొడుకులా బాధ్యత తీసుకుంటానని వారికి ధైర్యం చెప్పారు. తమకు మంత్రి లోకేష్ అండగా నిలబడటంపట్ల బాలకోటిరెడ్డి కుటుంబీకులు కృతజ్ఞతలు తెలిపారు.