చైతన్యరధం ఈ-పేపర్
అభిప్రాయం
No Result
View All Result
TDP - తెలుగు దేశం పార్టీ
టీడీపీ లో చేరండి
విరాళం
Telugu Desam
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 40 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • మహానాడు 2022 తీర్మానాలు
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
    • తెలంగాణ కమిటీలు
    • అనుబంధ విభాగాలు
    • బి.సి సాధికార సమితి
    • ఎస్.సి సాధికార సమితి
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • జిల్లా వెబ్ సైట్ లు
    • అనంతపురం
    • అనకాపల్లి
    • అన్నమయ్య
    • అల్లూరి సీతారామరాజు
    • ఎన్టీఆర్
    • ఏలూరు
    • కర్నూలు
    • కాకినాడ
    • కృష్ణా
    • గుంటూరు
    • చిత్తూరు
    • డా.బి.ఆర్.అంబేద్కర్ కోనసీమ
    • తిరుపతి
    • తూర్పు గోదావరి
    • నంద్యాల
    • పల్నాడు
    • పశ్చిమ గోదావరి
    • పార్వతీపురం మన్యం
    • ప్రకాశం
    • బాపట్ల
    • విజయనగరం
    • విశాఖపట్నం
    • వైఎస్ఆర్
    • శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు
    • శ్రీకాకుళం
    • శ్రీసత్యసాయి
  • సూపర్ 6
TDP - తెలుగు దేశం పార్టీ
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 40 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • మహానాడు 2022 తీర్మానాలు
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
    • తెలంగాణ కమిటీలు
    • అనుబంధ విభాగాలు
    • బి.సి సాధికార సమితి
    • ఎస్.సి సాధికార సమితి
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • జిల్లా వెబ్ సైట్ లు
    • అనంతపురం
    • అనకాపల్లి
    • అన్నమయ్య
    • అల్లూరి సీతారామరాజు
    • ఎన్టీఆర్
    • ఏలూరు
    • కర్నూలు
    • కాకినాడ
    • కృష్ణా
    • గుంటూరు
    • చిత్తూరు
    • డా.బి.ఆర్.అంబేద్కర్ కోనసీమ
    • తిరుపతి
    • తూర్పు గోదావరి
    • నంద్యాల
    • పల్నాడు
    • పశ్చిమ గోదావరి
    • పార్వతీపురం మన్యం
    • ప్రకాశం
    • బాపట్ల
    • విజయనగరం
    • విశాఖపట్నం
    • వైఎస్ఆర్
    • శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు
    • శ్రీకాకుళం
    • శ్రీసత్యసాయి
  • సూపర్ 6
No Result
View All Result
TDP - తెలుగు దేశం పార్టీ
No Result
View All Result
Telugu Desam
Home ఆంధ్రప్రదేశ్

ముఖ్యమంత్రి ఐదు హామీ సంతకాలకు కేబినెట్‌ ఆమోదం

కేబినెట్‌ నిర్ణయాలు వెల్లడించిన మంత్రి పార్ధసారథి

by చైతన్యరధం
Jun 25, 2024 at 6:17am
in ఆంధ్రప్రదేశ్, చైతన్యరధం, తాజా సంఘటనలు, ముఖ్య వార్తలు
ముఖ్యమంత్రి ఐదు హామీ సంతకాలకు కేబినెట్‌ ఆమోదం
Share on FacebookShare on TwitterShare on Whatsapp
  • 16347 పోస్టులతో మెగా డిఎస్సీ
  • ల్యాండ్‌ టైటిలింగ్‌ యాక్ట్‌ రద్దు..
  • సార్వత్రిక పింఛనుల పెంపునకు ఓకే
  • తొలిదశగా 186 అన్న క్యాంటీన్ల పునరుద్దరణ
  • నైపుణ్య గణన నిర్వహణకు మంత్రిమండలి ఆమోదం
  • వైద్య ఆరోగ్య వర్సిటీకి ఎన్టీఆర్‌ పేరు పునరుద్ధరణ
  • అడ్వకేట్‌ జనరల్‌గా దమ్మాలపాటి
  • జగన్‌ సర్కారు వైఫల్య విధానాలపై శ్వేతపత్రాలు
  • గంజాయి నియంత్రణపై సబ్‌ కమిటీ

అమరావతి (చైతన్య రథం): మెగా డీఎస్సీ `2024ను రాష్ట్ర మంత్రిమండలి ఆమోదించింది. దీనిద్వారా 16 వేల 347 ఉపాధ్యాయ పోస్టుల నియామకాలు చేపడతారు. విజయవాడలోని డాక్టర్‌ వైయస్సార్‌ ఆరోగ్య వర్శిటీ పేరును డాక్టర్‌ ఎన్టీఆర్‌ ఆరోగ్య విశ్వ విద్యాలయంగా పునరుద్ధరిస్తూ కేబినెట్‌ నిర్ణయం తీసుకుంది. అమరావతి రాష్ట్ర సచివాలయం మొదటి బ్లాకు కేబినెట్‌ సమావేశ మందిరంలో రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు అధ్యక్షతన సోమవారం ఉదయం రాష్ట్ర మంత్రిమండలి సమావేశం జరిగింది. దాదాపు మూడున్నర గంటలపాటు సుదీర్ఘంగా సాగిన తొలి కేబినెట్‌ భేటీలో పలు కీలకాంశాలపై నిర్ణయాలు తీసుకున్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలమేరకు ఇప్పటికే ముఖ్యమంత్రి ఐదు సంతకాల అంశాలను కేబినెట్‌ ఆమోదించింది. వీటిలో మెగా డీఎస్సీతోపాటు ల్యాండ్‌ టైటిలింగ్‌ చట్టం రద్దు, ఏప్రిల్‌నుంచి పింఛను రూ.4వేలకు పెంపు, అన్న క్యాంటీన్ల పునరుద్ధరణ, నైపుణ్య గణన అంశాలు ఉన్నాయి. అన్ని వర్గాలకు భరోసా కల్పించేలా మంత్రిమండలి తీసుకున్న నిర్ణయాలను రాష్ట్ర సమాచార పౌర సంబంధాలు, గృహ నిర్మాణ మంత్రి కె.పార్థసారధి మీడియాకు వెల్లడిరచారు.

16347 పోస్టులతో మెగా డిఎస్సీ
మెగా డీఎస్సీ `2024 ద్వారా 16 వేల 347 ఉపాధ్యాయ పోస్టుల నియామకానికి మంత్రిమండలి ఆమోదం తెలిపినట్టు మంత్రి పార్థసారథి వెల్లడిరచారు. ఎస్జీటీలు 6371, పీఈటీలు 132, స్కూల్‌ అసిస్టెంట్‌లు 7,725, టీజీటీలు 1781, పీజీటీలు 286, ప్రిన్సిపాళ్లు 52 పోస్టులను భర్తీ చేయనున్నారు. గత ప్రభుత్వం 6100 టీచర్‌ పోస్టులను భర్తీ చేయడానికి నోటిఫికేషన్‌ మాత్రమే ఇచ్చిందని, చంద్రబాబు ప్రభుత్వం ఏకంగా 16 వేల 347 ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేయనుందని వెల్లడిరచారు. పదవీ బాధ్యతలు చేపట్టిన రోజే మెగా డీఎస్సీపై ముఖ్యమంత్రి తొలి సంతకం చేశారని, వెంటనే మంత్రిమండలి ఆమోదించడం ప్రభుత్వ చిత్తశుద్ధికి తార్కాణం మంత్రి వ్యాఖ్యానించారు. ఇకపై డీఎస్సీ నిర్వహణ నిరంతర ప్రక్రియగా ఉంటుందన్నారు. ఏటా డీఎస్సీ నిర్వహణకు కేబినెట్‌ ఆమోదించిందన్నారు. గత ప్రభుత్వం టెట్‌ పరీక్షను ప్రతి ఆరు నెలలకు ఒకసారి నిర్వహించకపోవడం వల్ల లక్షలాది విద్యార్థులు నష్టపోయారని, ఈ నేపథ్యంలో ఇకపై టెట్‌ (టీచర్‌ ఎలిజబులిటీ టెస్ట్‌) పరీక్షను నిబంధనలకు అనుగుణంగా నిర్వహించాలని కేబినెట్‌ నిర్ణయించింది. నాణ్యత గల విద్యను అందించడమే లక్ష్యంగా టీచర్లకు నియామకం కంటే ముందే శిక్షణ ఇవ్వాలని, శిక్షణ డిసెంబర్‌ 10నుంచి ప్రారంభమవ్వాలని సీఎం చంద్రబాబు సంబంధిత శాఖాధికారులకు సూచించారు. ప్రాథమికస్థాయి నుంచే నాణ్యమైన విద్యాబోధనకు అవసరమైన విధివిధానాలను నిర్ణయించేందుకు ప్రస్తుత విద్యావిధానంతోపాటు జాతీయ విద్యా విధానాన్నీ అధ్యయనం చేయాల్సిన అవసరముందని, ఆ దిశగా అధికారులు సమాయత్తం కావాలని ఆదేశించారు.

సంబంధితవార్తలు

శాంతిహోమంతో సన్నిధి శుద్ధి

ఏపీ ప్రభుత్వాసుపత్రులు దేశంలోనే బెస్ట్‌గా ఉండాలి: సీఎం చంద్రబాబు

పరిశ్రమలకు కేరాఫ్‌గా రాష్ట్రం అదే మన సంకల్పం కావాలి: సీఎం చంద్రబాబు

భూహక్కు చట్టం 2022 రద్దు
ఆంధ్రప్రదేశ్‌ భూహక్కు చట్టం 2022 రద్దు ప్రతిపాదనను మంత్రిమండలి ఆమోదించింది. ప్రజలను భయబ్రాంతులకు గురిచేసిన ల్యాండ్‌ టైటిలింగ్‌ యాక్ట్‌ రద్దుకు చంద్రబాబు హామీ ఇవ్వడం తెలిసిందే. గత ప్రభుత్వం ఏకపక్షంగా తీసుకొచ్చినట్లు చట్టంపై సరైన అవగాహనలేని టైటిలింగ్‌ రిజిస్ట్రేషన్‌ ఆఫీసర్లు అనవసరమైన సమస్యలు సృష్టిస్తారని మేం గ్రహించాం. నీతి ఆయోగ్‌ ప్రతిపాదించిన చట్టానికి, గత ప్రభుత్వం ఆమోదించిన చట్టానికి తీవ్ర వైరుద్యముంది. కొన్ని వివాదాస్పద అంశాల కారణంగా చట్టరద్దుకు మంత్రిమండలి ఆమోదించింది. ఈ యాక్ట్‌ ప్రకారం టైటిల్‌ రిజిస్ట్రేషన్‌ ఆఫీసర్‌ తర్వాత మధ్యంతర, జిల్లా, న్యాయ వ్యవస్థతో సంబంధం లేకుండా నేరుగా పరిష్కారానికి కక్షిదారులు హైకోర్టుకు ఆశ్రయించే పరిస్థితిని కల్పించారు. అంటే టైటిలింగ్‌ రిజిస్ట్రేషన్‌ ఆఫీసర్‌ ఏకీకృత నిర్ణయం తీసుకునే భయంకరమైన పరిస్థితి నెలకొన్నందున చట్టాన్ని రద్దు చేయాలని నిర్ణయించినట్టు మంత్రి వివరించారు. రిజిస్ట్రేషన్‌ వ్యవస్థ, రెవెన్యూ వ్యవస్థ, న్యాయ వ్యవస్థలను అస్తవ్యస్థం చేస్తుందని భావించడం, భూయజమాని ఒరిజినల్‌ డాక్యుమెంట్‌ను పొందే అవకాశాన్ని కల్పించే ఉద్దేశంతో చట్టం రద్దుకు మంత్రిమండలి నిర్ణయించిందన్నారు.

ఇక ఎన్టీఆర్‌ భరోసా పింఛను..
సామాజిక పింఛన్ల పథకాన్ని ఎన్టీఆర్‌ భరోసా పింఛన్‌ పథకంగా మార్పుచేస్తూ కేబినెట్‌ ఆమోదం తెలిపింది. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు వృద్ధాప్య, వితంతు, చేనేత, కల్లుగీత, మత్స్యకార, ఒంటరి మహిళలు, డప్పు కళాకారులు తదితర పింఛన్ల మొత్తాన్ని రూ.3 వేల నుంచి రూ.4 వేలకు పెంచుతూ మంత్రిమండలి ఆమోదించింది. పెంపుదల నిర్ణయంతో 28 కేటగిరీలకు చెందిన దాదాపు 66 లక్షల మంది లబ్ధిదారులకు లబ్ధి చేకూరనుంది. పెన్షన్ల పంపిణీకి ప్రభుత్వం ఏడాదికి రూ.33వేల కోట్లకుపైగా ఖర్చు చేయనుంది. ఈ మేరకు రూ.4 వేలకు పెంచిన పింఛన్‌ మొత్తాన్ని ఏప్రిల్‌, మే, జూన్‌లకు పెరిగిన రూ.వెయ్యి రూపాయల చొప్పున కలిపి ప్రతి పింఛన్‌దారుకు మొత్తంగా రూ.7వేల పింఛన్‌ల మొత్తాన్ని జూలై 1న సచివాలయ ఉద్యోగులతో ఇంటివద్దనే అందించాలని కేబినెట్‌ నిర్ణయించింది. దివ్యాంగులు, క్షయ వ్యాధిగ్రస్తులకు ఇస్తున్న పింఛన్‌ను రూ.3 వేలనుంచి రూ.6 వేలకు పెంచారు. పూర్తి అంగవైకల్యమున్న దివ్యాంగులకు రూ.5 వేల పింఛన్‌ను రూ.15 వేలకు పెంచారు. కిడ్నీ, లివర్‌, బైలేట్రల్‌ ఎలిఫెంటాసిస్‌ వంటి దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న వారికి ఇస్తున్న ఫించన్‌ను రూ.10 వేలకు పెంచారు. కిడ్నీ డయాలసిస్‌, సికిల్‌ సెల్‌ ఎనీమియా, తలసేమియా, హెచ్‌ఐవీ తదితర వ్యాధిగ్రస్తులకు పెన్షన్‌ పంపిణీ డీబీటీ ద్వారా అందించాలని మంత్రిమండలి నిర్ణయించింది. సామాజిక భద్రతా పింఛన్ల పెంపుదలవల్ల ప్రభుత్వంపై నెలకు రూ.819 కోట్ల అదనపు భారం పడుతుంది. ఏరియర్స్‌తో కలిపి నెలకు రూ.4,408 కోట్లు ప్రభుత్వం ఖర్చు చేయాల్సి ఉంది.

నైపుణ్య సెన్సెస్‌ నిర్వహణకు కేబినెట్‌ ఓకే..
ఏ దేశమైనా సామాజికంగా, ఆర్థికంగా అభివృద్ధి చెందాలంటే నైపుణ్యం కలిగిన యువత ఎంతో అవసరం. అది గుర్తించిన మన ప్రభుత్వం అందుకనుగుణంగా ఆంధ్రప్రదేశ్‌ నైపుణ్య సెన్సెస్‌-2024 నిర్వహణకు తొలి మంత్రి మండలిలోనే ఆమోదం తెలియజేసింది. ఏటా రాష్ట్రంలో 310 ఇంజినీరింగ్‌ కాలేజీలు, 1400 డిగ్రీ కాలేజీలు, 267 పాలిటెక్నిక్‌ కాలేజీలు, 516 ఐటీఐ కాలేజీల నుండి దాదాపు 4.4 లక్షల యువత ఆయా కోర్సులను పూర్తి చేసుకొని బయటకు వస్తున్నారు. అయితే డిమాండ్‌, సప్లై మరియు అందుబాటులో ఉన్న సదుపాయాల ఆధారంగా స్కిల్‌ గ్యాప్‌ను అంచనా వేయడం, ప్రస్తుత, భవిష్యత్‌ అవసరాలను దృష్టిలో ఉంచుకొని యువతను జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో పోటీ పడేలా చేసి ప్రపంచ యవనికపై మన ముద్ర ఉండేలా తీర్చిదిద్దాల్సిన అవసరం ఎంతైనా ఉంది. యువతకు నైపుణ్య అవసరాలు అలాగే పారిశ్రామిక అనుబంధ సంస్థలు, వ్యవసాయ రంగం, మార్కెటింగ్‌ సంస్థలు, ప్రొడక్షన్‌ సంస్థలు వారి అవసరాలను దృష్టిలో ఉంచుకొని ఆయా సంస్థల అవసరాలకు అనుగుణంగా నైపుణ్య సర్వేని 3నుంచి 4నెలల వ్యవధిలో పూర్తి చేయాలని మంత్రిమండలి నిర్ణయించింది. ఈ సెన్సెస్‌లో అందుబాటులో ఉన్న స్కిల్‌ ప్రొఫైల్స్‌, స్కిల్‌ నీడ్స్‌, స్కిల్‌ ఇన్‌ డిమాండ్‌, స్కిల్‌ లభ్యతమధ్య అంతరాన్ని గుర్తించడం, అంచనా వేయడం, తదనుగుణంగా నైపుణ్యాభివృద్ధి శిక్షణలు డిజైన్‌చేసేలా ప్రభుత్వానికి సమాచారం అందించడం, మార్కెట్‌ అవసరాలకు అనుగుణంగా యువత సదరు నైపుణ్యాలను సాధించేలా శిక్షణ అందించడం ఈ సెన్సెస్‌ ముఖ్య లక్ష్యాలు. అంతిమంగా మన రాష్ట్ర యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలను కల్పించడమే ప్రభుత్వ సంకల్పం.

అన్న క్యాంటీన్ల పునరుద్ధరణ..
రాష్ట్రంలోని పేదవారి ఆకలి దప్పులను తీర్చే లక్ష్యంతో సబ్సిడీ ధరకు నాణ్యమైన ఆహారాన్ని అందించేందుకు గతంలో మంజూరు చేసిన అన్నా క్యాంటీన్‌లను పున:ప్రారంభించేందుకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. గత ప్రభుత్వం అన్నా క్యాంటీన్లను కక్షపూరితంగా మూసివేసి నిరుపేదల నోటిదగ్గర ముద్ద తీసేసింది. పేదవాడి ఆకలి దప్పులను తీర్చేందుకు చంద్రబాబు బాధ్యతలు స్వీకరించిన రోజునే అన్నా క్యాంటీన్‌లను పునరుద్ధరిస్తూ సంతకం పెట్టారు. ఆమేరకు రాష్ట్రవ్యాప్తంగా 203 అన్నా క్యాంటీన్‌లను పున:ప్రారంభించేందుకు చర్యలు తీసుకోనున్నారు. తొలిదశలో 183 అన్నా క్యాంటీన్లను ఒకేసారి ప్రారంభించాలని కేబినెట్‌ నిర్ణయం తీసుకుంది. మిగిలిన 20 క్యాంటీన్లను కూడా తదుపరి దశలో ప్రారంభించాలని నిర్ణయించింది. ఈ అన్నా క్యాంటీన్‌ల ద్వారా పేద అన్నార్తులకు ఉదయం అల్పాహారం, మధ్యాహ్న భోజనం, రాత్రి భోజనం సబ్సిడీ ధరకే అందించనున్నారు.

వైద్య ఆరోగ్య వర్సిటీకి ఎన్టీఆర్‌ పేరు పునరుద్ధరణ…

1986లో నాటి రాష్ట్ర ప్రభుత్వం ఒక చట్టం ద్వారా ఆంధ్రప్రదేశ్‌ యూనివర్సిటీ ఆఫ్‌ హెల్త్‌ సైన్సెస్‌ను ఏర్పాటు చేసింది. 1998లో ఈ చట్టానికి సవరణ చేసి అప్పటి రాష్ట్ర ప్రభుత్వం ఎన్టీఆర్‌ యూనివర్సిటీ ఆఫ్‌ హెల్త్‌ సైన్సెస్‌గా నామకరణం చేసింది. అనంతరం 2006లో డాక్టర్‌ ఎన్టీఆర్‌ యూనివర్సిటీ ఆఫ్‌ హెల్త్‌ సైన్సెస్‌గా మార్పు చేసింది. 2022లో యూనివర్సిటీ పేరును గత ప్రభుత్వం డాక్టర్‌ వైౖయస్సార్‌ యూనివర్సిటీ ఆఫ్‌ హెల్త్‌ సైన్సెస్‌గా మార్చింది. ప్రస్తుతం ఆ చట్టాన్ని సవరిస్తూ స్వర్గీయ డా. నందమూరి తారక రామారావు ప్రజలకు చేసిన సేవలకు గుర్తింపుగా యూనివర్సిటీకి ఆయన పేరుతో పున:నామకరణం చేయాలన్న ప్రతిపాదనకు మండలి ఆమోదం తెలిపింది. విదేశాలకు వెళ్లే వైద్య విద్యార్థులకు కళాశాల పేరు మారడం వలన సాంకేతికపరమైన సమస్యలు ఎదుర్కొంటున్న కారణంగా తిరిగి అదే పేరును పునరుద్ధరించేందుకు మంత్రిమండలి నిర్ణయం తీసుకుంది.

ఏజీగా దమ్మాలపాటి
ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర అడ్వకేట్‌ జనరల్‌గా దమ్మాలపాటి శ్రీనివాస్‌ను నియమిస్తూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి మంత్రి మండలి ఆమోదం తెలిపింది. ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర పూర్వపు అడ్వకేట్‌ జనరల్‌ ఎస్‌.శ్రీరామ్‌, అదనపు అడ్వకేట్‌ జనరల్‌ పొన్నవోలు సుధాకర్‌ రెడ్డిల రాజీనామాలను ఆమోదిస్తూ మంత్రి మండలి నిర్ణయం తీసుకుంది.

జగన్‌ సర్కారు వైఫల్య విధానాలపై ఏడు శ్వేతపత్రాలు
ప్రజల్లో గత ప్రభుత్వం అనుసరించిన విధానాలపై అవగాహన కల్పించేందుకు ఏడు శ్వేతపత్రాలను విడుదల చేయాల్సిందిగా మంత్రి వర్గానికి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు సూచించారు. పోలవరం, అమరావతి, విద్యుత్‌, పర్యావరణం (ల్యాండ్‌, శాండ్‌, మైన్స్‌, జియాలజీ మొదలైనవి), లిక్కర్‌ అండ్‌ ఎక్సైజ్‌, లా అండ్‌ ఆర్డర్‌ మరియు ఆర్థిక శాఖలపై శ్వేత పత్రాలు విడుదల చేసి ప్రజలకు అవగాహన కల్పిస్తారు. ఈనెల 28నుండి జులై 18వరకు రెండు మూడు రోజులకొకసారి శ్వేతపత్రాలు విడుదల చేయడం జరుగుతుంది. గత ఐదేళ్లలో సంస్థలు ఏవిధంగా కుంటుపడ్డాయన్న విషయాన్ని ప్రజల్లో పూర్తి అవగాహన కల్పించాల్సిన బాధ్యత ప్రజా ప్రతినిధులకు ఉందన్నారు. ఇవేగాక అన్ని పంచాయతీలు, మున్సిపాలిటీల పారిశుద్ధ్య పనులను వెంటనే ప్రారంభించాలని, చివరి ఆయకట్టుకు నీరందించే దిశగా కాల్వలు, చెరువుల్లో పూడిక తొలగించే కార్యక్రమాన్ని సత్వరమే చేపట్టాలని నిర్ణయించారు. వర్షాకాలం ప్రారంభమైనందున సీజనల్‌ వ్యాధులు ప్రబలే అవకాశం ఉండటంతో.. ప్రజారోగ్య పరిరక్షణకు సమాయత్తం కావాలని సూచించారు. అధ్వాన్నంగా మారిన రోడ్లు, రహదారులపై పాట్‌హోల్స్‌ను పూడ్చేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని ఆర్‌ అండ్‌ బీని ఆదేశించారు.

గంజాయి నియంత్రణపై సబ్‌ కమిటీ
రాష్ట్రాన్ని ప్రమాదకరమైన పరిస్థితికి నెడుతున్న గంజాయి మహమ్మారిని ఉక్కుపాదంతో అణిచేసేందుకు చంద్రబాబు ప్రభుత్వం తొలి అడుగువేసింది. గంజాయి నివారణకు హోంమంత్రి అనిత సారథ్యంలో మంత్రివర్గ ఉపసంఘం ఏర్పాటు చేయాలని కేబినెట్‌ నిర్ణయించింది. హోం, రెవెన్యూ, హెల్త్‌, గిరిజన శాఖ మంత్రులతో ఉప సంఘం ఏర్పాటు చేయనున్నారు. గంజాయి నియంత్రణపై మంత్రుల కమిటీలో సభ్యుడిగా మంత్రి నారా లోకేశ్‌ ఉండనున్నారు. 6 శాఖలపై శ్వేతపత్రాలు విడుదల చేయాలని కేబినెట్‌ నిర్ణయం తీసుకున్నారు. పోలవరం, అమరావతి, విద్యుత్‌, పర్యావరణం, మద్యం, ఆర్థిక అంశాలతోపాటు శాంతిభద్రతల అంశంపైనా శ్వేతపత్రాలు విడుదల చేయాలని నిర్ణయించారు. కేబినెట్‌ భేటీ అనంతరం రాజకీయ అంశాలపై మంత్రులకు ముఖ్యమంత్రి చంద్రబాబు దిశానిర్దేశం చేశారు.

Tags: అధినేత చంద్రబాబుకేబినెట్‌ భేటీకేబినెట్‌ మంత్రులుకేబినేట్ నిర్ణయాలుకొలుసు పార్థసారధిమంత్రి పార్థసారధిసీఎం చంద్రబాబు
Previous Post

సచివాలయంలో మంత్రి నారా లోకేష్‌ బాధ్యతల స్వీకరణ!

Next Post

విద్యారంగంలో ప్రమాణాల మెరుగుకు సహకరించండి

మరిన్ని వార్తలు

చైతన్యరధం ఈ పేపర్ 19-05-2025
చైతన్యరధం

చైతన్యరధం ఈ పేపర్ 19-05-2025

కార్యకర్త
@ May 19, 2025
ఆంధ్రప్రదేశ్

మహానాడు ఏర్పాట్లపై టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా సమీక్ష

చైతన్యరధం
@ May 18, 2025
ఎమ్మెల్సీ ఎన్నికల్లో..టీడీపీ అభ్యర్థుల విజయం ఖాయం
ఆంధ్రప్రదేశ్

మన త్రివిధ దళాలకు శిరసాభివందనం

చైతన్యరధం
@ May 18, 2025
రోడ్డు ప్రమాదంలో ముగ్గురు మృతి
ఆంధ్రప్రదేశ్

రోడ్డు ప్రమాదంలో ముగ్గురు మృతి

చైతన్యరధం
@ May 18, 2025
చైతన్యరధం ఈ పేపర్ 18-05-2025
చైతన్యరధం

చైతన్యరధం ఈ పేపర్ 18-05-2025

కార్యకర్త
@ May 18, 2025
ఆర్ధిక వృద్ధి గ్రేట్‌
ఆంధ్రప్రదేశ్

బల్లెం వీరుడి ప్రదర్శన భేష్‌ 

చైతన్యరధం
@ May 18, 2025
ఆంధ్రప్రదేశ్

రాష్ట్ర విద్యార్థి హార్డీకి మాస్టర్‌ స్పెల్లర్‌ అవార్డ్‌

చైతన్యరధం
@ May 18, 2025
మహిళలకు శుభవార్త ..ఆగస్టు 15 నుంచి ఉచిత బస్సు ప్రయాణం
ఆంధ్రప్రదేశ్

మహిళలకు శుభవార్త ..ఆగస్టు 15 నుంచి ఉచిత బస్సు ప్రయాణం

చైతన్యరధం
@ May 18, 2025
Load More

ముఖ్య వార్తలు

రాష్ట్ర విద్యార్థి హార్డీకి మాస్టర్‌ స్పెల్లర్‌ అవార్డ్‌

చైతన్యరధం
@ May 18, 2025
ప్రధాని మోదీతో మంత్రి లోకేష్‌ భేటీ

ప్రధాని మోదీతో మంత్రి లోకేష్‌ భేటీ

చైతన్యరధం
@ May 18, 2025
20 లక్షల ఉద్యోగాలు..హామీ నిలబెట్టుకుంటాం

దేశ క్లీన్‌ ఎనర్జీ విప్లవానికి పునాదిరాయి రెన్యూ!

చైతన్యరధం
@ May 17, 2025
అడుగడుగునా జేజేలు..

ఇబ్బందులు తీర్చి అండగా ఉంటా

చైతన్యరధం
@ May 17, 2025
మరిన్ని

అత్యధికంగా వీక్షించినవి

వేటాడాల్సింది తిమింగలాన్ని!?

చైతన్యరధం
@ May 16, 2025 7:00 AM

చంద్రబాబుపై గుడ్డి వ్యతిరేకత విడనాడాలి

చైతన్యరధం
@ May 12, 2025 6:50 AM

జగన్‌ ఐదేళ్ల పాలనలో అధ్వాన్నంగా సీమ ప్రాజెక్టులు

చైతన్యరధం
@ May 11, 2025 6:00 AM

రాజధాని పునః ప్రారంభ సభపై సాక్షి విద్వేష దాడి

చైతన్యరధం
@ May 5, 2025 7:20 AM
మరిన్ని

తాజా సంఘటనలు

మహానాడు ఏర్పాట్లపై టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా సమీక్ష

చైతన్యరధం
@ May 18, 2025
ఎమ్మెల్సీ ఎన్నికల్లో..టీడీపీ అభ్యర్థుల విజయం ఖాయం

మన త్రివిధ దళాలకు శిరసాభివందనం

చైతన్యరధం
@ May 18, 2025
రోడ్డు ప్రమాదంలో ముగ్గురు మృతి

రోడ్డు ప్రమాదంలో ముగ్గురు మృతి

చైతన్యరధం
@ May 18, 2025
ఆర్ధిక వృద్ధి గ్రేట్‌

బల్లెం వీరుడి ప్రదర్శన భేష్‌ 

చైతన్యరధం
@ May 18, 2025
మరిన్ని
పార్టీ సమాచార చందాదారులు అవ్వండి
TDP-Logo-mini
మన పార్టీ
  • మన సిద్ధాంతం
  • జై హింద్ - జై తెలుగుదేశం
  • మన చరిత్ర
  • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
  • కార్య నిర్వాహక వర్గం
మన నాయకత్వం
  • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
  • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
  • NTR శత జయంతి ఉత్సవాలు
మన విజయాలు
  • భారత దేశం
  • ఆంధ్ర ప్రదేశ్
  • తెలంగాణ
  • 40 సంవత్సరాల విజయాలు
డౌన్లోడ్స్
  • మ్యానిఫెస్టో
  • మహానాడు 2022 తీర్మానాలు
  • నాయకుడితో నా చిత్రం
  • లోగోలు
  • నాయకుల చిత్రాలు
ప్రచార సమాచారం
  • బ్యానర్స్ / బుక్ లెట్స్
  • పోస్టర్స్ / కరపత్రాలు
  • ప్రచార గీతాలు
  • ఎన్నికల సమాచారం / సూచనలు
మీడియా వనరులు
  • పత్రికా ప్రకటనలు
  • ప్రసంగాలు
  • కార్యక్రమాలు
  • ముఖాముఖి & కథనాలు
  • ఫోటో గ్యాలరీ
  • వీడియో గ్యాలరీ
© 2024 తెలుగు దేశం పార్టీ. Privacy Policy | Terms ConditionsMarketed by Sanbrains
Telegram Whatsapp Facebook Twitter Instagram Youtube
No Result
View All Result
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారతదేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 40 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • మహానాడు 2022 తీర్మానాలు
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • TDP పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • విరాళం
  • అభిప్రాయం
  • చైతన్యరధం ఈ-పేపర్
  • జిల్లా వెబ్‌సైట్‌లు
    • Ananthapuramu
    • Anakapalli
    • Bapatla
    • Chittoor
    • EastGodavari
    • Eluru
    • Guntur
    • Kadapa
    • Kakinada
    • Krishna
    • Kurnool
    • Manyam
    • Nandyala
    • Nellore
    • Palnadu
    • Prakasam
    • Srikakulam
    • Tirupati
    • Visakhapatnam
    • Vizianagaram
    • WestGodavari
  • సూపర్ 6

© 2022 Telugu Desam Party. Designed by Tecbrains.

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Create New Account!

Fill the forms below to register

*By registering into our website, you agree to the Terms & Conditions and Privacy Policy.
All fields are required. Log In

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In

Add New Playlist