- తీర్చిదిద్దాలని సీఎం చంద్రబాబు ఆదేశం
- ఆర్ అండ్ బీ రహదారుల అభివృద్ధి పనులపై సీఎం టెలీ కాన్ఫరెన్స్
- పనులను ప్రత్యక్షంగా తనిఖీ చేయాలని మంత్రి, స్పెషల్ సీఎస్లకు ఆదేశం
- పనులు చేపట్టని కాంట్రాక్టర్లపై చర్యలు తీసుకోవాలని స్పష్టీకరణ
- ఏడాదిలో రూ.2500 కోట్లతో 5471 కి.మీ రోడ్ల అభివృద్ధికి అనుమతులు ఇచ్చిన ఘనత కూటమి ప్రభుత్వానిదే
అమరావతి (చైతన్యరథం): కూటమి ప్రభుత్వంలో రహదారులకు అత్యంత ప్రాధాన్యత ఇస్తున్న క్రమంలో రాబోయే డిసెంబర్ చివరి నాటికి రాష్ట్రంలో రహదారులన్నింటినీ గుంతల రహితంగా తీర్చిదిద్దాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశించారు. ఆర్ అండ్ బీ శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి, ఆ శాఖ ప్రత్యేక ముఖ్య కార్యదర్శి ఎంటీ కృష్ణబాబు, శాఖ ఉన్నతాధికారులతో రాష్ట్రంలో రహదారుల అభివృద్ధి పనుల స్థితిగతులపై టెలీ కాన్ఫరెన్స్ ద్వారా శనివారం ముఖ్యమంత్రి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో రహదారుల అభివృద్ధి – మరమ్మత్తుల పనుల తీరుపై ప్రత్యక్షంగా తనిఖీ చేయాలని మంత్రిని, ప్రత్యేక ముఖ్య కార్యదర్శిని సీఎం ఆదేశించారు. అదే సమయంలో ఇప్పటికీ పనులు ప్రారంభించని కాంట్రాక్టర్లపై తగిన చర్యలు చేపట్టాలని స్పష్టం చేశారు. రహదారులు మరమ్మతు పనుల నాణ్యతా ప్రమాణాల విషయంలో రాజీపడవద్దని, అత్యుత్తమంగా ఉండేలా చూడాలన్నారు. రహదారులు అభివృద్ధిలో అత్యున్నత సాంకేతిక విధానాలను, వినూత్న మెటీరియల్ ను ఉపయోగించే విధానాలను అందిపుచ్చుకోవాలని సీఎం సూచించారు.
పట్టించుకోని గత ప్రభుత్వం
రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రహదారులకున్న ప్రాధాన్యత గుర్తించి అందుకు తగిన విధంగా నిధులు కేటాయించింది. గత ఏడాది గుంతల రహిత రహదారులే లక్ష్యంగా మిషన్ పాతెూల్ ఫ్రీ లో భాగంగా రూ.861 నిధులతో రాష్ట్రంలో రోడ్లను గుంతల రహితంగా తీర్చిదిద్దాం. అయితే గత ప్రభుత్వంలో 5 ఏళ్లలో కనీసం పునరుద్ధరణ పనులు కూడా చేపట్టకపోవడం రహదారులపై పూర్తిగా నిర్లక్ష్యం వహించడం వంటి కారణాల వల్ల రహదారులు మరింత అధ్వాన్నంగా మారాయి.. అయినప్పటికీ ఈ ఏడాది రహదారుల నిర్వహణ, మెరుగుదల కోసం రూ.2500 కోట్లతో పనులు చేపట్టేందుకు ఇప్పటికే పరిపాలన అనుమతులు ఇచ్చాం.
ఇందులో భాగంగా రూ.40 కోట్ల నాబార్డ్ నిధులతో 1250 కి.మీ జిల్లా ప్రధాన రహదారుల అభివృద్ధి కోసం 191 పనులు మంజూరు చేశాం. ఈ పనులన్నింటికీ ఇప్పటికే టెండర్లు పిలిచి గుత్తేదారులకు అప్పగించాం. ఇవి కాకుండా రూ.600 కోట్లు మూలధన వ్యయం కింద 227 పనులు మంజూరు చేశాం. వీటితో పాటు 1450 కిలోమీటర్ల మేర రహదారులు అభివృద్ధి చేయడానికి కాంట్రాక్టర్లను
గుర్తించి పనులు అప్పగించాం. మరో 2,104 కిలోమీటర్ల రహదారుల అభివృద్ధి కోసం 274 పనులకు
పరిపాలనా అనుమతులు ఇచ్చాం. ఇందుకోసం రూ.1000 కోట్లతో ఆయా పనులకు టెండర్లు పిలిచాం. డిసెంబర్ నెల మొదటి వారంలో ఈ పనులన్నింటినీ కాంట్రాక్టర్లను గుర్తించి పనులు మొదలు పెట్టడానికి ప్రణాళికలు సిద్ధం చేశామని సీఎం చంద్రబాబు తెలిపారు.
ఇవి కాకుండా వివిధ కారణాలతో కాంట్రాక్టర్లకు అప్పగించి రద్దయిన.. రూ.277 కోట్లతో 607 కి.మీ రహదారుల నిర్వహణ, అభివృద్ధి కోసం ప్రతిపాదనలు సిద్ధం చేశాం. రాబోయే 2, 3 రోజుల్లో ఈ పనులకు పరిపాలనా అనుమతులు మంజూరు చేయడంతో పాటు టెండర్లు పిలిచి పనులు ప్రారంభిస్తాం. ఇవి కాకుండా మరో రూ.233 కోట్ల రూపాయలతో రహదారులు అభివృద్ధి చేస్తాం, ఇందుకు ఇప్పటికే ఆర్థిక శాఖ నుంచి అనుమతులు వచ్చాయని సీఎం చెప్పారు.
ఏడాదిలో రూ.2500 కోట్లు
ఉమ్మడి రాష్ట్ర చరిత్రలోనే ఎప్పుడూ లేని విధంగా కేవలం ఒక్క ఏడాది వ్యవధిలో రూ.2500 కోట్లతో 5471 కిలోమీటర్ల రహదారుల అభివృద్ధికి పరిపాలన అనుమతులు ఇచ్చిన ఘనత ఒక్క కూటమి ప్రభుత్వానికే దక్కుతోంది. ఇప్పటి వరకు అసలే వర్షాకాలం, ఆపై వరుస తుపానుల కారణంగా వరుసగా వర్షాలు కురుస్తున్న క్రమంలో ఈ పనులు ప్రారంభం కాలేదు. వచ్చేవారంలో ఈ పనులన్నీ యుద్ధ ప్రాతిపదికన ప్రారంభించి డిసెంబర్ నెలాఖరు నాటికి రాష్ట్రంలో రహదారుల అభివృద్ధి, మరమ్మత్తు పనులు పూర్తి చేస్తాం. ఇవి కాకుండా 9101 కిలోమీటర్ల రహదారుల అత్యవసర మరమ్మత్తుల కోసం రూ.500 కోట్లతో ఆర్థిక శాఖకు ప్రతిపాదనలు పంపిస్తాం. మొంథా తుపాను వల్ల దెబ్బతిన్న దాదాపు 4794 కిలోమీటర్లు రహదారుల మరమ్మత్తుల కోసం ఈ నిధులను వినియోగిస్తామని సీఎం చంద్రబాబు తెలిపారు.
గత ప్రభుత్వం 2 సంవత్సరాల పాటు కాంట్రాక్టర్లు చేసిన పనులకు నిధులు విడుదల చేయకుండా నిలిపివేసింది. దీంతో కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టే నాటికి సుమారుగా రూ.4000 కోట్ల రూపాయల పెండింగ్ బిల్లులు ఉన్నాయి. రాష్ట్ర ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా ఈ బిల్లులను, గత సంవత్సరం చేసిన పనులకు సంబంధించిన సీఆర్ ఐఎఫ్, ఎన్డీబీ నిధులతో చేపట్టిన బిల్లులను దశలవారీగా చెల్లింపులు జరిపాం. ఇప్పటి వరకు సుమారుగా రూ.1900 కోట్ల రూపాయల బిల్లులను గుత్తేదారులకు చెల్లించాం. ప్రతి నెల కాంట్రాక్టర్లకు పెండింగ్ బిల్లులు చెల్లింపు చేసే విధంగా ఆర్థిక శాఖ అనుమతితో ప్రణాళికలు చేపట్టాం.
కాంట్రాక్టర్లలో ప్రభుత్వం పట్ల విశ్వాసాన్ని మెంపొందించేందుకు ఆర్ అండ్ బీ శాఖ మంత్రి బీసీ
జనార్దన్ రెడ్డి, ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎంటీ కృష్ణ బాబు కాంట్రాక్టర్లతో ఇప్పటికే పలుమార్లు ప్రత్యేక సమావేశాలు నిర్వహించారు. అదే విధంగా ఆర్ అండ్ బీ శాఖ ఉన్నతాధికారులతో ఇటీవల పుట్టపర్తి, విశాఖపట్నంలోనూ, ఎప్పటికప్పుడూ విజయవాడ లోనూ మంత్రి, ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సమావేశాలు నిర్వహిస్తూ పనుల పురోగతిని సమీక్షిస్తున్నారు. ప్రజలకు మెరుగైన రహదారుల కల్పించడంలో ఇప్పటికే ప్రారంభించిన పనులన్నీడిసెంబర్ నెలాఖరు నాటికి ఎట్టి పరిస్థితిల్లోనూ పూర్తి వేయాలని ఆర్ అండ్ బీ శాఖ ఉన్నతాధికారులను ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశించారు.












