ఉభయ తెలుగురాష్ట్రాలలో సీపీఎం బాగా బలహీనపడిరది. ఇందుకు అది కొన్ని కారణాలున్నాయి. అందులో ఒకానొక ముఖ్యకారణం సీపీఎం పొలిట్‌బ్యూరో సభ్యులు బి.వి.రాఘవులు ఎందుకో చంద్రబాబుపై గుడ్డి వ్యతిరేకత వైపు సీపీఎం పార్టీని ప్రభావి తం చేయడం. రెండవది నాడు వై.ఎస్.రాజశేఖరెడ్డి పాలనపై మెతక వైఖరి అవలంబిం చారు. నేడు జగన్ పట్ల కూడా సానుకూల వైఖరి ప్రదర్శిస్తున్నారు. నాసిరకం మద్యం పోసి జగన్ 35 లక్షల మంది పేదల ఆరోగ్యాన్ని నాశనం చేశారు. వైసీపీ పాలనలో భారీగా నాసిరకం మద్యంతో మరణాలు సంభవించాయి. రూ.60లు ఉన్న చీప్ లిక్కర్ ధరను వైకాపా ప్రభుత్వం రూ.160లకు పెంచింది. ఈ ధరల పెరుగుదల వల్ల పేదల సంపాదన వేల కోట్లు జగన్ మాఫియా పరమైంది. దీనికి సిట్ ఆధారాలు కూడా సేకరించి కొన్ని అరెస్టులు కూడా చేసింది. మద్యం మంభకోణంలో మూలవిరాట్లను కూడా కోర్టు ముందు నిలబెట్టాలని బి.వి.రాఘవులు ప్రకటన చేసి ఉంటే పేదలు సం తోషపడి ఉండేవారు. నాడు మద్యంపై నెల్లూరు కేంద్రంగా సీపీఎం గట్టి పోరాటం చేసిం ది. నాటికన్నా జగన్ పాలనలో నాసిరకం మద్యంతో పేదలను రోగగ్రస్తులను చేసినా దానిపై సీపీఎం గట్టి పోరాటాలు చేయలేదు. టీడీపీ అధికారంలో ఉంటే ఎగిరిపడే వారు.. జగన్ అధికారంలో ఉంటే మాత్రం మొక్కుబడి కార్యక్రమాలు చేస్తారు.
సాక్షి పత్రికకు జి.వి.రాఘవులు ఇచ్చిన ఇంటర్వ్యూ 11.5.2025న 2వ పేజీలో ప్రచురితమైంది. అందులో చంద్రబాబు ప్రభుత్వంపై గుడ్డి వ్యతిరేకత వ్యక్తమైంది. ‘‘భూసేకరణ తప్ప అమరావతిపై దృష్టి లేదని, కేంద్ర ప్రభుత్వంలో భాగస్వాములుగా ఉన్నారన్న మాటే తప్ప నిధులు రాబట్టలేక పోతున్నారని, విద్య, వైద్యరంగాలకు.. బడ్జెట్ కేటాయింంపుల్లో చిన్నచూపు తగదని రాఘవులు అన్నట్టుగా సాక్షి రాసింది. ఇది అసత్యం మాత్రమే. అమరావతిలో భూసేకరణ ఒక్కటే చూసి అక్కడ జరుగుతున్న, జరగబోతున్న రూ.50 వేల కోట్ల విలువైన అభివృద్ధి పనులు రాఘవులు ఎందుకు చూడలేకపోతు న్నారు? ఇది గుడ్డి వ్యతిరేకత కాదా?
కేంద్రం నుంచి నిధులు రాబట్టలేదనే ఆరోపణ సరిమైంది కాదు. ఒక్క విశాఖ స్టీలు ప్లాంటకు సుమారు రూ.12 వేల కోట్లు సాధించిన విషయం రాఘవులకు ఎందుకు కనపడలేదు? కేంద్రమంత్రితో విశాఖ స్టీలు ప్లాంటును ప్రైవేటీకరించబోమని ప్రకటన చేయించింది నిజం కాదా? జగన్ పాలనలో విశాఖ ప్యాక్టరీ భూములమ్మమన్నది నిజం. నాడు వైసీపీ కేంద్రం నుంచి విశాఖ స్టీలు ప్లాంటుకు 33 మంది ఎంపీలున్నా నిధులు సాధించలేదు. ఇక విద్య, వైద్య రంగాలకు బడ్జెట్‌లో చిన్నచూపు చూశారనే ఆరోపణ కూడా వాస్తవం కాదు. పాఠశాల విద్య, ఉన్నత విద్య, నైపుణ్యాభివృద్ధికి 2025-26 బడ్జెట్‌లో రూ.35,519 కోట్లు కేటాయించారు. ఐదేళ్లలో జగన్ ఒక్క డీఎస్సీ కూడా జరపలేదు. విద్యాశాఖ మంత్రి లోకేష్ మొదటి ఏడాదే డీఎస్సీ ద్వారా 16,347 ఉపాధ్యా య నియామకాలు చేయబోతున్నారు. వైద్యరంగానికి బడ్జెట్లో ఎన్నడూ లేని విధంగా రూ. 19,264 కోట్లు కేటాయించారు. 2024-25 బడ్జెట్ కన్నా 2025-26 బడ్జెట్‌లో వైద్య రంగానికి 14 శాతం అదనంగా నిధులు కేటాయించారు. ఈ వాస్తవాలు పరిశీలించి గుడ్డి వ్యతిరేకత విడనాడాలి. అలాగే సీపీఎం నీడ పడకుండా తగుజాగ్రత్తలు తీసుకుంటే పార్టీ అభివృద్ధి చెందుతుందని సానుభూతిపరులు ఆకాంక్షిస్తున్నారు.
గురజాల మాల్యాద్రి,
చైర్మన్, టీడీపీ నాలెడ్డ్ సెంటర్