- ఇంత భారీ పెట్టుబడులు రాబట్టడం ఆయనకే సాధ్యం
- కొనియాడిన హోంమంత్రి అనిత
అమరావతి (చైతన్యరథం): ముఖ్యమంత్రి చంద్రబాబు నాయకత్వంలో ఆంధ్రప్రదేశ్‌లో పెట్టుబడుల వరద మొదలయిందని రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనిత అన్నారు. అనకాపల్లి జిల్లా నక్కపల్లి(రాజయ్యపేట)లో భారీ ఎత్తున పెట్టుబడులు పెట్టేందుకు ఉక్కు దిగ్గజ సంస్థలైన ఆర్సెలర్ మిట్టల్- నిప్పన్ స్టీల్స్ ముందుకు రావడం ఉత్తరాంధ్ర అభివృద్ధిలో కీలక మలుపు అన్నారు. రూ.1.4 లక్షల కోట్ల పెట్టుబడితో సుమారు 5వేల ఎకరాల్లో 17.8 మిలియన్ టన్నుల సామర్థ్యంతో భారీ స్టీల్ ప్లాంట్ ఏర్పాటు చేసి 20వేల మందికి పైగా ఉద్యోగాలిచ్చే కియా తరహా భారీ పరిశ్రమను ఏపీకి తీసుకురావడం చంద్రబాబుకే సాధ్యం అని కొనియాడారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చరిత్రలోనే భారీ పెట్టుబడులు మన అనకాపల్లికి రావడం అదృష్టం. నా సొంత నియోజకవర్గం పాయకరావుపేటలోని మండలం ‘నక్కపల్లి’ కొత్తగా పెట్టుబడుల పురుడు పోసుకోబోతుందంటూ ఇంత భారీ పరిశ్రమను ఈ ప్రాంతానికి తెస్తున్నందుకు సీఎం చంద్రబాబుకు హోం మంత్రి అనిత ధన్యవాదాలు తెలిపారు.